దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్30 పాయింట్లు క్షీణించి 32370 వద్ద నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 10,121 వద్ద ముగిసింది.
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన కీలక సూచీలు ఒక దశలో సెన్సెక్స్ 100 పాయింట్లు కోల్పోయింది. చివరికి స్వల్పనష్టాలకు పరిమితమై వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్30 పాయింట్లు క్షీణించి 32370 వద్ద నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 10,121 వద్ద ముగిసింది. పీఎస్‌యూ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్ బాగా నష్టపోగా, రియల్టీ స్వల్ప నష్టలు, ఫార్మా లాభాల్లో టాప్ విన్నర్గా నిలిచింది. వర్క్ హార్డ్, లుపిన్, సన్ ఫార్మా, డా. రెడ్డీస్, సిప్లా, భారతి ఎయిర్‌టెల్ లాభాల్లో ముగిసాయి. జీ ఎంటర్టెయిన్మెంట్, గెయిల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్ డీవీఆర్ షేర్లు భారీగా నష్టపోయాయి.