సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌గా మొదలైనాయి. రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న కీలకసూచీ సెన్సెక్స్ తాజాగా కొత్త గరిష్టాన్ని అందుకుంది. బుధవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 36,928 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్26 పాయింట్ల లాభంతో 36,851 వద్ద,నిఫ్టీ 4 పాయింట్లు ఎగిసి 11, 139 వద్ద కొనసాగినా, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ పుంజుకోగా, ఐటీ బలహీనంగా ఉంది. ముఖ్యంగా ఆయిల్ కంపెనీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, భారతి ఎయిర్‌టెల్ టాప్‌లూజర్స్‌గా ఉన్నాయి. అలాగే ఫలితాల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ కౌంటర్ కూడా భారీగా నష్టపోతోంది. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కో, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ టాప్ విన్నర్స్ ఉన్నాయి. అటు కరెన్సీ మార‍్కెట్‌లో దేశీయ కరెన్సీ రుపీ బలహీనంగా మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment