సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు శుక్రవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు ఎగియగా నిప్టీ 22 పాయింట్లు లాభపడింది. అయితే ఇన్వెస్టర్ల అమ్మకాలతో వెనక్కి తగ్గినా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 35,300కి ఎగువన, నిఫ్టీ 10800ఎగువన ఉన్నాయి. అయితే సరికొత్త గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడి, ఫలితాల ప్రభావం ఉంటుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ లాభాలు మార్కెట్లకు ఉత్సాహాన్నిస్తున్నాయి.
హెచ్‌పీసీఎల్, ఎస్‌బ్యాంక్, అదానీ, యునైటెడ్ ' స్పిరిట్స్, ఇండియా బుల్స్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్ లాభపడుతుండగా, భారతి ఎయిర్‌టెల్, ఐడియా, ఆర్‌కాం, తదితర టెలికాం షేర్లు బలహీనంగా ఉన్నాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్, టీసీఎస్, విప్రో, అశోక్ లేలాండ్, జీ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment