సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత సూచీ( డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం జూలైనెలలో దిగి వచ్చింది. జూన్ లో నాలుగేళ్ల గరిష్టాన్ని తాకిన డబ్ల్యుపీఐ స్వల్పంగా పుంజుకుంది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో 5.09శాతంగా నమోదైంది.
కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గు ముఖంపట్టడంతో టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు 5.09 శాతానికి దిగివచ్చింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.77 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో (2017 జూలైలో) ద్రవ్యోల్బణం రేటు 1.88 శాతంగా ఉంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలకుగాను 4.17 శాతంగా నమోదైంది. ఇది 9నెలల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. కూరగాయలు, పళ్ల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. 2018 జూన్‌లో కూరగాయల ధరలు 7.8 శాతం పెరగ్గా, జూలైలో 2.19 శాతం క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment