
జూలై ట్రాయ్ గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: జూలైలో మొబైల్ టారిఫ్‌లను పెంచిన ప్రభావం ప్రైవేట్ రంగ టెల్కోలపై కనిపించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గగా ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు పెరిగారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన జూలై గణాంకాల ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల సంఖ్య 29.4 లక్షల మేర పెరిగింది.
ఎయిర్‌టెల్ సబ్ర్‌స్కయిబర్స్ 16.9 లక్షలు, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు 14.1 లక్షలు, రిలయన్స్ జియో యూజర్లు 7.58 లక్షల మంది తగ్గారు. దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్ నాటి 120.56 కోట్ల నుంచి జూలైలో స్వల్పంగా క్షీణించి 120.51 కోట్లకు పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర టెలికం సర్కిల్స్‌లో మొబైల్ కనెక్షన్లు తగ్గాయి. జూలై తొలి వారంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సుమారు 10–27 శాతం శ్రేణిలో టారిఫ్‌లను పెంచడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment