
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. ట్రంప్-కిమ్ భేటీ సానుకూల ఫలితాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా స్పందించారు. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పుంజుకున్న కీలక సూచీ 69 పాయింట్లు పుంజుకుని, నిఫ్టీ 25 పాయింట్ల ఎగిసి 10800కి ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రధానంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. భారీ లాభాలతో వక్రంగీ అప్పర్ సర్క్యూట్ అయింది. ఐవోసీ, బీపీసీఎల్ డాక్టర్ రెడ్డీస్, సిప్లా, విప్రో, లుపిన్, ఐవోసీ, అదానీ పోర్ట్స్,టాటా మోటార్స్, కెనరాబ్యాంకు బీజీఆర్ ఎనర్జీ, లాభపడుతుండగా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హిందాల్కో, వేదాంతా తదితర షేర్లు నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment