సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో అక్కడికక్కడే ముగిశాయి. ఆరంభంలో సెంచరీ లాభాలతో మురిపించినా, మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో స్వల్ప ఒడిదుడుకుల మధ్య కన్సాలిడేట్ అయిన కీలక సూచీలు చివరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప లాభంతో 35,216 వద్ద, నిఫ్టీ కూడా కేవలం పాయింట్లు పెరిగి 10,718 వద్ద ముగిసింది. అయితే కీలక మద్దతు స్తాయిలకు పైన నిలవడం సానుకూల సంకేతం. బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ లాభపడగా, ఆటో, ఐటీ, ఫార్మా, మెటల్ రంగాలు నష్టపోయాయి.
హెచ్‌పీసీఎల్, ఐషర్, బీపీసీఎల్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, యాక్సిస్, ఐవోసీ, గ్రాసిమ్, ఎయిర్‌టెల్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. మరోవై పు సోమవారం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో 45శాతం నష్టపోయిన ఐసీఐసీఐ బ్యాంకు నేడు దాదాపు 7 శాతం పుంజుకోవడం విశేషం. ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, జీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, యస్‌బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, వేదాంతా నష్టపోయాయి. అటు కరెన్సీ మార్కెట్లో రుపీ బలహీన ధోరణికొనసాగింది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. 120 రూపాయలు క్షీణించి 31, 138 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment