
సాక్షి, హైదరాబాద్: సాస్ ఇన్‌ఫ్రా హైదరాబాద్‌లో మూడు భారీ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. 1.4 కోట్ల చ.అ. రానున్న ఈ మూడు ప్రాజెక్ట్‌ల మార్కెట్, మేనేజ్‌మెంట్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కొల్లియర్స్ గ్రూప్‌తో భాగస్వామ్యమైంది. ఇప్పటికే సాస్ ఇన్‌ఫ్రా ఎంబసీ గ్రూప్‌తో జతకట్టిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లోకి ఎంబీసీ రీ ఎంట్రీ ఇచ్చినట్టయింది.
ప్రపంచ స్థాయి కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయుక్తమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 52 లక్షల చ.అ. విస్తీర్ణంలో 36 అంతస్తులలో ఎంబసీ–సాస్ 1 టవర్ ప్రాజెక్ట్ ఉంటుంది. 30 లక్షల చ.అ.లలో రానున్న ఎంబసీ డైమండ్ టవర్ 45 అంతస్తులలో ఉంటుంది. అలాగే మరో 30 లక్షల చ.అ.లలో క్రౌన్ ప్రాజెక్ట్ ప్రణాళిక దశలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment