గోద్రెజ్ అండ్ బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని విక్రోలిలోని గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండు ఆఫీస్ స్పేస్‌లను రూ.157 కోట్లకు విక్రయించింది
గోద్రెజ్ వన్ భవనంలోని సౌత్ టవర్‌లోని ఎనిమిదో అంతస్తులో మొదటి కార్యాలయ స్థలం 24,364 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇదే టవర్‌లోని తొమ్మిదో అంతస్తులో రెండో కార్యాలయం ఉంది. ఈ రెండు ఆఫీస్ స్పేస్‌లను అమ్మింది. కాగా, రెండు కార్యాలయ స్థలాలకు సంబంధించి మొత్తం 75 వెహికల్ పార్కింగ్ స్థలం ఉన్నట్లు తెలుస్తోంది.
కమర్షియల్ బిల్డింగ్ గోద్రెజ్ వన్
గోద్రెజ్ వన్ కమర్షియల్ లగ్జరీ టవర్స్. సౌత్ ఉత్తర టవర్‌లో భూమి నుంచి కిందకి రెండు ఫ్లోర్‌లు ఉండగా.. 11 అంతస్తుల కార్యాలయ స్థలాలు ఉన్నాయి.
వేల కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్ట్‌లు బుకింగ్స్
సంస్థ రియల్ ఎస్టేట్ విభాగం గోద్రెజ్ ప్రాపర్టీస్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,000 కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడానికి 10 స్థలాలను కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20వేల కోట్ల అమ్మకాల బుకింగ్స్ నిర్వహించేలా.. మరికొన్ని ప్రాంతాల్లో ల్యాండ్స్‌ను కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. గోద్రెజ్ ప్రాపర్టీస్ భవిష్యత్‌లో రూ. 21,225 కోట్లతో 10 కొత్త ప్రాజెక్ట్‌లు బుకింగ్స్ అవుతాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment