Godrej Properties
-
రెండు ఆఫీస్ స్పేస్‌లను అమ్మిన గోద్రెజ్.. ధర 157 కోట్లు
గోద్రెజ్ అండ్ బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని విక్రోలిలోని గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండు ఆఫీస్ స్పేస్‌లను రూ.157 కోట్లకు విక్రయించింది గోద్రెజ్ వన్ భవనంలోని సౌత్ టవర్లోని ఎనిమిదో అంతస్తులో మొదటి కార్యాలయ స్థలం 24,364 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇదే టవర్లోని తొమ్మిదో అంతస్తులో రెండో కార్యాలయం ఉంది. ఈ రెండు ఆఫీస్ స్పేస్‌లను అమ్మింది. కాగా, రెండు కార్యాలయ స్థలాలకు సంబంధించి మొత్తం 75 వెహికల్ పార్కింగ్ స్థలం ఉన్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ బిల్డింగ్ గోద్రెజ్ వన్గోద్రెజ్ వన్ కమర్షియల్ లగ్జరీ టవర్స్. సౌత్ ఉత్తర టవర్‌లో భూమి నుంచి కిందకి రెండు ఫ్లోర్లు ఉండగా.. 11 అంతస్తుల కార్యాలయ స్థలాలు ఉన్నాయి.వేల కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్ట్‌లు బుకింగ్స్సంస్థ రియల్ ఎస్టేట్ విభాగం గోద్రెజ్ ప్రాపర్టీస్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,000 కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడానికి 10 స్థలాలను కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20వేల కోట్ల అమ్మకాల బుకింగ్స్ నిర్వహించేలా.. మరికొన్ని ప్రాంతాల్లో ల్యాండ్స్‌ను కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. గోద్రెజ్ ప్రాపర్టీస్ భవిష్యత్‌లో రూ. 21,225 కోట్లతో 10 కొత్త ప్రాజెక్ట్‌లు బుకింగ్స్ అవుతాయని తెలిపింది. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ ధరఖాస్తు రిజెక్ట్ చేసిన రెరా
ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్‌కు భారీ షాక్ తగిలింది. గురుగ్రామ్, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ 2016కు అనుగుణంగా లేని కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ ప్రాజెక్ట్‌ల పొడిగింపు దరఖాస్తును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తిరస్కరించింది. గోద్రెజ్ డెవలపర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రమోటర్లు రెరాకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులో లైసెన్స్ పునరుద్ధరణ, త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)లో అందించిన బ్యాంక్ బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాల్లో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల్ని సరిదిద్దాలని రెరా అనేక సార్లు గోద్రెజ్‌కు ఆదేశాలు చేసింది. అయితే, వాటిని సరిదిద్దడంలో సదరు నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విఫలమయ్యారు. దీంతో తాజాగా గోద్రెజ్ డెవలపర్ల ప్రాజెక్ట్ పొడింపు ధరఖాస్తును రిజెక్ట్ చేసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సెక్టార్ 85, గురుగ్రామ్‌లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఎయిర్ ఫేజ్ 4 నిర్మాణాలు చేపడుతోంది. ఇందుకోసం రెరా నుంచి గోద్రెజ్ 2018 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ పొందింది. రిజిస్ట్రేషన్ తేదీ ముగియడంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ గోద్రెజ్ ప్రాపర్టీస్ రెరా చట్టంలోని సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన రెరా.. ఆ దరఖాస్తులో అనేక లోపాలను గుర్తించింది. వాటిని సరిదిద్దాలని కోరింది. చివరికి తీరు మార్చుకోకపోవడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ దరఖాస్తును తిరస్కరించింది. -
గోద్రేజ్ క్యాపిటల్ రుణ వితరణ లక్ష్యం రెట్టింపు
ముంబై: గోద్రేజ్ గ్రూపులో భాగమైన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రుణ వితరణను రూ.12,000 కోట్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఇది రూ.5,500 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ నాన్ బ్యాకింగ్ ఆర్థిక సేవల సంస్థ (ఎన్బీఎఫ్సీ) 2020 చివర్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కార్యకలాపాలు ప్రారంభించింది. గోద్రేజ్ ప్రాపర్టీ కస్టమర్లకు రుణాలు సమకూర్చే లక్ష్యంతో మొదలు కాగా, తర్వాత ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ రంగానికి కూడా రుణాలు ఇవ్వడం ఆరంభించింది. మార్చి చివరికి ఉన్న రూ.5,500 కోట్ల రుణాల్లో రూ.4,000 కోట్లు హోమ్ లోన్ విభాగానికి చెందినవి. ఇందులోనూ సగానికి పైగా (రూ.2వేల కోట్లకు పైన) గోద్రేజ్ ప్రాపర్టీస్ కస్టమర్లకు ఇచ్చినవే ఉన్నాయి. మిగిలిన చిన్న వ్యాపారస్థులకు ఇచ్చినవి కావడం గమనార్హం. తమ రెండు విభాగాల్లో (హౌసింగ్, ఎంఎస్ఎంఈ) నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) సున్నాగా ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. మార్చి త్రైమాసికంలో ఎంఎస్ఎంఈ విభాగం కూడా లాభాల్లోకి అడుగు పెట్టినట్టు చెప్పారు. హోమ్‌లోన్ విభాగం గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి లాభాల్లోనే ఉన్నట్టు తెలిపారు. ప్రమోటర్ల నుంచి రూ.1,200 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రమోటర్లు రూ. 1,200 కోట్ల నిధులు సమకూర్చనున్నట్టు మనీష్ షా వెల్లడించారు. మొదటి విడత నిధులు ప్రస్తుత త్రైమాసికంలోనే రానున్నట్టు తెలిపారు. 2024 మార్చి చివరికి నిర్ధేశించుకున్న రూ.12వేల కోట్ల రుణ పుస్తకంలో రూ.7,000 కోట్లు ఎంఎస్ఈ/ఎంఎస్ఎంఈ నుంచి ఉంటాయని షా చెప్పారు. ఎంఎస్ఎంఈ కస్టమర్ల బేస్ ప్రస్తుతం 1,000గా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి పది రెట్లు పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు వెల్లడించారు. ‘‘యాజమాన్యం కార్యకలాపాలు ప్రారంభించిన మూడో ఏడాది రుణ పుస్తకం రూ.10,000 కోట్లను అధిగమించాలనే లక్ష్యాన్ని పెట్టింది. మేము దీన్ని చేరుకుంటామనే నమ్మకంతో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో ఎంఎస్ఎంఈ/ఎస్ఎంఈ పుస్తకం రూ.30,000 కోట్లకు, 2028–29 చివరికి మొత్తం రుణ పుస్తకం రూ.50,000 కోట్లను అధిగమిస్తుంది’’అని చెప్పా రు. అప్పుడు కంపెనీని ప్రజల ముందుకు తీసుకెళ్లడాన్ని పరిశీలించొచ్చన్నారు. ఎంఎస్ఎంఈ/ఎస్ఎంఈలకు రుణ సేవల కోసం నిర్మన్ పేరుతో ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను షా ప్రకటించారు. -
గోద్రెజ్ గ్రూప్, ఎస్బీఐ ఒప్పందం
ముంబై: గోద్రెజ్ గ్రూప్‌లో భాగమైన గోద్రెజ్ క్యాపిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకునే దిశగా వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. బ్యాంకింగ్ సాధనాలు, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ తదితర ఆర్థిక సేవలను ఎస్బీఐ మరింత విస్తృతంగా అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. రుణాలు పొందడాన్ని మరింత సౌకర్యవంతంగా, సులభతరంగా చేసేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ మనీష్ షా తెలిపారు. -
ఆ ఇళ్లపై ఇదేం పిచ్చి.. ఎన్ని కోట్లయినా కొనేస్తున్నారు!
విలాసవంతమైన ఇళ్లపై సంపన్నులకు మోజు తగ్గడం లేదు. ధర ఎన్ని కోట్లయినా కొనడానికి వెనకాడటం లేదు. అందుకే అత్యంత విలాసవంతమైన రెసిడెన్సియల్ ప్రాజెక్ట్‌లను కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడి ఏర్పాటు చేస్తున్నాయి. ఇవీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. హారిబుల్ ఎక్స్పీరియన్స్: జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి! గత నెలలో డీఎల్ఎఫ్ గురుగ్రామ్‌లో 72 గంటల్లో రూ. 8 వేల కోట్లకుపైగా విలువైన 1,137 ఫ్లాట్లను విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సంగతి మరవకముందే గోద్రెజ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో రూ.24,575 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను అమ్మకానికి పెట్టింది. అది కూడా ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే. గోద్రేజ్ సంస్థ ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో కొనుగోలుదారులను ఆహ్వానించి వారికి ప్రాజెక్ట్‌కు సంబంధించిన త్రీడీ మోడల్‌ను, వీడియోలను ప్రదర్శించింది. అందులో ఉన్న విలాసవంతమైన సౌకర్యాలను చూపించింది. వీటిలో వేడినీటి కొలను (హాట్ పూల్) వంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు 160 ఎంపిక చేసిన కస్టమర్లను ఈ ఫ్లాట్లను సందర్శించేందుకు ఆహ్వానించగా ఎనిమిది అంతస్తుల ప్రాజెక్ట్‌లో 46 ఫ్లాట్లలో 17 అమ్ముడుపోయాయి. తాము విలాసవంతమైన నివాసాలను మాత్రమే విక్రయించడం లేదని, శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తున్నామని గోద్రెజ్ సేల్స్ మేనేజర్ యువరాజ్ మంచందా పేర్కొన్నారు. తమ అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లను మిలియనీర్లు, బిలియనీర్లు కొనుగోలు చేస్తారని చెప్పారు. కాగా గురుగ్రామ్‌లో గతనెల అమ్ముడైన ఫ్లాట్లకు సంబంధించిన పేపర్ వర్క్ ఇటీవలె పూర్తయింది. ఇదీ చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ న్యూస్: ఇక మరింత ఫాస్ట్‌గా ఇంటర్నెట్! -
ఇళ్లు కట్టేవారికి శుభవార్త! ఇంటి వద్దే నిర్మాణ నాణ్యత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కష్ట పడి పైసా పైసా కూడబెట్టి కట్టుకునే కలల గృహం నాణ్యంగా లేకపోతే కష్ట మం తా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ప్రాజెక్ట్ సైట్ వద్దనే కాంక్రీట్ మిశ్రమం నాణ్యత పరీక్షలు అందించే సేవలను గోద్రెజ్ కన్స్ట్రక్షన్స్ ప్రారంభించింది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, డెవలపర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చని గోద్రెజ్ కన్స్ట్రక్షన్స్ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా కాంక్రీట్ టెస్ట్ స్క్వాడ్ వ్యాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనంలో లేబొరేటరీ కాంక్రీట్ మిక్సర్, మైక్రోవేవ్ ఓవెన్, ఎల్రక్టానిక్ వెయిటింగ్ బ్యాలెన్స్, క్యూబ్‌ల వంటి పరికరాలు ఉంటాయి. -
ఆది గోద్రెజ్ రాజీనామా...కీలక మార్పులు
ముంబై: రియాల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ కంపెనీ నాయకత్వంలో కీలక మార్పులను ప్రకటించింది. గోద్రెజ్ గ్రూపు ఛైర్మన్ ఆది గోద్రెజ్ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇకపై ఆయన సంస్థ గౌరవ చైర్మన్ వ్యవహరించనున్నారు. ఛైర్మన్ బాధ్యతలను ప్రస్తుత ఎండీ, సీఈవో పిరోజ్ షా గోద్రెజ్ చేపట్టనున్నారు. అలాగే ఫిరోజ్ షా స్థానంలో మోహిత్ మల్హోత్రా మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో, గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మోహిత్ మల్హోత్రా ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. నాయకత్వం లో అన్ని మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఆది గోద్రెజ్ కుమారుడు, ఫిరోజ్ పెన్సిల్వేనియా, వార్టన్ బిజినెస్ స్కూల్ నుంచి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్ స్కూల్ (ఎస్ఐపీఏ) నుండి అంతర్జాతీయ వ్యవహారాల్లో మాస్టర్స్ డిగ్రీ పట్టాపొందారు. కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి ఎంబిఎ చేశారు. 2004 లో సంస్థ చేరిన ఫిరోజ్ షా, 2012 నుండి మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో నియమితులున్నారు. మల్హోత్రా 2010 లో గోద్రెజ్ ప్రాపర్టీస్ కంపెనీలో చేరారు. అనేక ఎఫ్ఎంసిజి, ప్రైవేట్ ఈక్విటీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రదేశంలో పలు ప్రముఖ కంపెనీల్లో పనిచేశాసిన అనుభవం ఆయనకుంది. ప్రస్తుతం గోద్రెజ్ ఫండ్ మేనేజ్మెంట్ హెడ్‌గా ఉన్న బలారియా ను గోద్రెజ్ ప్రాపర్టీస్ యొక్క అనుబంధ సంస్థకు సీఈవోగా పదోన్నతి కల్పించింది. ఈ పరిణామాలపై ఛైర్మన్ ఆది గోద్రెజ్, గోద్రెజ్ గ్రూప్ వ్యాఖ్యానిస్తూ, పిరోజ్షా, మోహిత్, గోద్రెజ్ ప్రాపర్టీస్ టీమ్ క్లిష్ట మార్కెట్ వాతావరణంలో కూడా మంచి ఫలితాలు సాధించారన్నారు. తాను ఖచ్చితంగా సంస్థను ముందుండి నడిపిస్తానన్నారు. రాబోయే దశాబ్దాలలో భారత రియల్ ఎస్టేట్ రంగంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ కు అనేక అద్భుతమైన అవకాశాలు రానున్నాయని అన్నారు. ఈ కొత్త టీం ఆధ్వర్యంలోనే ఈ అవకాశాలను అందిపుచ్చుకుని, సంస్థను ఒక అసాధారణ సంస్థగా నిర్మించనున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రెట్టింపు నికర లాభాలను సాధించి. రూ. 77 కోట్ల లాభాలను నమోదు చేసింది. గతేడాది క్యూ3లో రూ. 27 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం రూ. 247 కోట్ల నుంచి రూ. 518 కోట్లకు జంప్‌చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నిర్వహణ లాభం రూ. 6 కోట్ల నుంచి రూ. 121 కోట్లకు దూసుకెళ్లగా, పన్ను వ్యయాలు రూ. 7 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెరిగాయి. దీంతో గురువారం నాటి మార్కెట్లో గోద్రెజ్ ప్రాపర్టీస దూసుకుపోయింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో భారీ లాభాల్లో కొనసాగుతోంది.