ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్‌కు భారీ షాక్ తగిలింది. గురుగ్రామ్, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్ 2016కు అనుగుణంగా లేని కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ ప్రాజెక్ట్‌ల పొడిగింపు దరఖాస్తును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తిరస్కరించింది.
గోద్రెజ్ డెవలపర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రమోటర్లు రెరాకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులో లైసెన్స్ పునరుద్ధరణ, త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)లో అందించిన బ్యాంక్ బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాల్లో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల్ని సరిదిద్దాలని రెరా అనేక సార్లు గోద్రెజ్‌కు ఆదేశాలు చేసింది. అయితే, వాటిని సరిదిద్దడంలో సదరు నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విఫలమయ్యారు. దీంతో తాజాగా గోద్రెజ్ డెవలపర్‌ల ప్రాజెక్ట్ పొడింపు ధరఖాస్తును రిజెక్ట్ చేసింది.
గోద్రెజ్ ప్రాపర్టీస్ సెక్టార్ 85, గురుగ్రామ్‌లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఎయిర్ ఫేజ్ 4 నిర్మాణాలు చేపడుతోంది. ఇందుకోసం రెరా నుంచి గోద్రెజ్ 2018 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ పొందింది. రిజిస్ట్రేషన్ తేదీ ముగియడంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ గోద్రెజ్ ప్రాపర్టీస్ రెరా చట్టంలోని సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసింది.
దరఖాస్తును పరిశీలించిన రెరా.. ఆ దరఖాస్తులో అనేక లోపాలను గుర్తించింది. వాటిని సరిదిద్దాలని కోరింది. చివరికి తీరు మార్చుకోకపోవడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ దరఖాస్తును తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment