
సాక్షి, హైదరాబాద్: కష్ట పడి పైసా పైసా కూడబెట్టి కట్టుకునే కలల గృహం నాణ్యంగా లేకపోతే కష్ట మం తా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ప్రాజెక్ట్ సైట్ వద్దనే కాంక్రీట్ మిశ్రమం నాణ్యత పరీక్షలు అందించే సేవలను గోద్రెజ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభించింది.
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, డెవలపర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చని గోద్రెజ్ కన్‌స్ట్రక్షన్స్ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా కాంక్రీట్ టెస్ట్ స్క్వాడ్ వ్యాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనంలో లేబొరేటరీ కాంక్రీట్ మిక్సర్, మైక్రోవేవ్ ఓవెన్, ఎల్రక్టానిక్ వెయిటింగ్ బ్యాలెన్స్, క్యూబ్‌ల వంటి పరికరాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment