జోరు తగ్గని ఆఫీస్‌ స్పేస్‌ | Office Space Demand Full Swing In Hyderabad | Sakshi
Sakshi News home page

జోరు తగ్గని ఆఫీస్‌ స్పేస్‌

Published Thu, Nov 4 2021 12:55 PM | Last Updated on Fri, Nov 5 2021 1:43 PM

Office Space Demand Full Swing In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాల లావాదేవీల జోరు తగ్గడం లేదు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (జులై– సెప్టెంబర్‌) నగరంలో 25 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లీజు కార్యకలాపాలు జరిగాయని కొల్లియర్స్‌ ఇండియా నివేదిక తెలిపింది. ఇదే సమయంలో నగర మార్కె ట్లోకి కొత్తగా 32 లక్షల చ.అ. స్పేస్‌ సరఫరా జరిగింది. ఆఫీస్‌ స్పేస్‌ లీజులలో బ్యాంకింగ్, ఫైనా న్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లేస్‌ వాటా 66 శాతంగా ఉన్నాయి. రాయదుర్గలో అత్యధికంగా 53 శాతం, హైటెక్‌ సిటీలో 40% లీజు కార్యకలాపాలు జరిగాయి.

ఈ ఏడాది క్యూ3లో దేశవ్యాప్తంగా 1.03 కోట్ల చ.అ. ఆఫీస్‌ లావాదేవీలు జరిగాయి. క్రితం త్రైమా సికంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని మొత్తం లావాదేవీలలో ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాల వాటా 62 శాతంగా ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న వారి సంఖ్య పెరగడం, కంపెనీలు వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ పునఃప్రారంభిస్తుండటం, రవాణా పరిమితులు తొలగిపోవటం వంటి కారణాలతో దేశీయ కార్యాలయాల మార్కెట్‌కు డిమాండ్‌ పెరుగు తుందని కొల్లియర్స్‌ ఇండియా ఎండీ, సీఈఓ రమేష్‌ నాయర్‌ తెలిపారు.
 

చదవండి:చేవెళ్ల దారిలో పెరిగిన ధరలు, ఎకరం రూ.3 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement