ఆర్మూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూ స్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహశీ ల్దార్ వినోద్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను హెచ్చరించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్, కోటార్మూర్ గ్రామాల పరిధిలోని 202, 206 సర్వే నెంబర్‌లలోగల ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టెట్ వ్యాపారులు రోడ్లు వేసి, ప్లాట్లుగా మార్చిన వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో ‘సర్కారు జాగాలో పాగా’ శీర్షికతో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహశీల్దార్ వినోద్‌కుమార్, ఆర్‌ఐ వినోద్‌కుమార్ శుక్రవారం ఆ స్థలాన్ని పరిశీలించారు. గతంలో రెవెన్యూ అధికారులు వేసిన కంచెను తొలగించి న విషయాన్ని గుర్తించారు.
ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మొరం తో నిర్మించిన రోడ్డును ట్రాక్టర్‌తో తొలగింపజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ పెర్కిట్, కోటార్మూర్‌లలో ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తమకు గతంలో దరఖాస్తులు అందాయన్నారు. అయితే ప్రతిపాదిత స్థలంలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది అనే విషయం తెల్చడానికి సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. ఈలోగా రియల్ ఎస్టేట్ వ్యాపారి నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మించడాన్ని ఆయన తప్పుబట్టారు. పూర్తి స్థాయి విచారణ జరుపుతామని, ప్రభుత్వ భూమి కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు
కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు తహశీల్దార్
Published Sat, Aug 24 2013 3:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement