
హైదరాబాద్: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని బోయిన్‌పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సిద్ధిఖీ అనే వ్యక్తిని ఫయాజుద్దీన్ హత్య చేశాడు.
సిద్ధిఖీని దారుణంగా నరికి చంపేశాడు.రియల్ ఎస్టేట్ లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఫయాజుద్దీన్‌తో పాటు అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.