boinapalli
-
బోయిన్‌పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని బోయిన్‌పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సిద్ధిఖీ అనే వ్యక్తిని ఫయాజుద్దీన్ హత్య చేశాడు. సిద్ధిఖీని దారుణంగా నరికి చంపేశాడు.రియల్ ఎస్టేట్ లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఫయాజుద్దీన్‌తో పాటు అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రైతులు సంతోషంగా ఉన్నారా?
బోయినపల్లి: ‘‘ఏం సంగతి, అంత మంచిదేనా..! వరద కాలువకు నీళ్లు వస్తున్నాయా?..రైతులు సంతోషంగా ఉన్నారా.. మిడ్‌మానేరు నింపుదామా?’’అని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డిలను సీఎం కేసీఆర్ ఫోన్లో ఆరా తీశారు. శుక్రవారం సీఎం వారిద్దరికీ ఫోన్ చేసి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘సర్.. మీరు నీళ్లు ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారు’అని వేణు, లచ్చిరెడ్డి సమాధానం చెప్పారు. వరద కాలువకు నీరుఎంత వస్తుందని సీఎం ప్రశ్నించగా.. 1,600 క్యూసెక్కులు వస్తున్నాయని వారు చెప్పగా.. లేదు ఏడు వేల క్యూసెక్కుల నీరు వస్తుందని సీఎం పేర్కొన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నింపుకుందామా? అని అడుగగా.. నింపుకుం దాం సార్.. కానీ, ముంపు గ్రామాల్లో గెజిట్ మిస్సింగ్, వృత్తుల్లో తప్పులు ఉన్నాయి.. అని సీఎంకు వివరించారు. ‘అవి చేద్దాం.. మీరు ఈ రోజే కలెక్టర్‌ను కలవండి’అని కేసీఆర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని కోరగా..‘ఆడిట్ ప్రాబ్లం ఉంటుంది. ఒక్క ప్రాజెక్టుకు ఇస్తే అన్నిటికీ ఇవ్వాలి చూద్దాం’ అని సీఎం సమాధానమిచ్చారు. నీటి ప్రవాహాల చిత్రాలు పంపండి వరద కాలువ పరిసరాల్లోకి వెళ్లి ఫోన్లో మాట్లాడాలని సీఎం ఆదేశించడంతో వారు అక్కడికెళ్లి మాట్లాడారు. సీఎం కోరిక మేరకు నీటి ప్రవాహాల చిత్రాలు పంపారు. -
తాడ్బంద్ దేవాలయంలో ముష్కరులు..
కంటోన్మెంట్ (బోయిన్పల్లి) : ‘నిత్యం వేలాది మంది భక్తులు సం దర్శించే తాడ్బంద్ దేవాలయంలోకి ఆదివారం రాత్రి ముష్కరులు చొరబడ్డారు!! సమాచారం అందుకున్న వెంటనే ఆక్టోపస్, సిటీ సెక్యూరిటీ గార్డ్స్ బృందాలతో పాటు, బోయిన్పల్లి పోలీసుల బృందం ఆలయాన్ని చుట్టుముట్టింది. వేర్వేరు బృందాలుగా విడిపోయి మెరుపు వేగంతో సమీపంలోని భవనాల మీదుగా దేవాలయం నలుదిక్కులకు చేరారు. అప్పటికే ఆలయం లోపు మాటువేసి ఉన్న ముష్కరుల కదలికలను కనిపెడుతూ ఒక్కొక్కరుగా దేవాలయంలోకి చేరిపోయారు. పోలీసులను ప్రతిఘటిస్తూ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న ముష్కరులను చాకచక్యంగా లొంగదీసుకున్నారు. దీంతో పోలీసులతో పాటు అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు’ ఇదంతా నిజమనుకుంటున్నారు కదూ. అదేం కాదు. అసలేమైందంటే.. సికింద్రాబాద్ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో బోయిన్పల్లి పోలీసులు, ఆక్టోపస్, సిటీ సెక్యూరిగార్డ్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన మాక్ డ్రిల్ ఇది. ఆక్టోపస్ డీఎస్పీ వీరరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌డ్రిల్ మొత్తం 100 మందికిపైగా పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో సందర్శించే షాపింగ్ మాల్స్, ప్రార్థనాలయాలు, ఇతరత్రా రద్దీ ప్రదేశాల వద్ద నిర్వహిస్తున్న మాక్‌డ్రిల్స్‌లో భాగంగానే తాడ్బంద్ దేవాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించామని బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. మాక్ డ్రిల్‌లో బోయిన్పల్లి ఎస్ఐలు రఘువీర్‌రెడ్డి, సాయికిరణ్ సహా 20 మందికిపైగా సిబ్బంది పాల్గొన్నారు. -
బోయిన్‌పల్లిలో తప్పిన పెనుప్రమాదం
-
మట్టిపెళ్లలు మీద పడి రైతు మృతి
బోయినపల్లి: బోయినపల్లిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పంటకు నీరు ఇవ్వాల్సిన బావి రైతు ప్రాణం తీసింది. స్థానికంగా నివాసముంటున్న ఎడపల్లి లచ్చయ్య(45) అనే రైతు శనివారం బావిలో ఉన్న మోటారు తీయడానికి లోపలికి దిగాడు. బావిలో మోటారు వద్ద ఉండగా బావి చరియల నుంచి మట్టిపెళ్లలు లచ్చయ్యపై విరిగిపడ్డాయి.. దీంతో లచ్చయ్య ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. క్రేన్ సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.