బోయినపల్లిలో శనివారం విషాదం చోటుచేసుకుంది.
బోయినపల్లి: బోయినపల్లిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పంటకు నీరు ఇవ్వాల్సిన బావి రైతు ప్రాణం తీసింది. స్థానికంగా నివాసముంటున్న ఎడపల్లి లచ్చయ్య(45) అనే రైతు శనివారం బావిలో ఉన్న మోటారు తీయడానికి లోపలికి దిగాడు.
బావిలో మోటారు వద్ద ఉండగా బావి చరియల నుంచి మట్టిపెళ్లలు లచ్చయ్యపై విరిగిపడ్డాయి.. దీంతో లచ్చయ్య ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. క్రేన్ సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.