హైదరాబాద్: రాజధాని రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకోవడం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేసే యత్నం చేసే యత్నమని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
రాజధానికి నిధులను కేంద్రాన్ని అడిగే ధైర్యంలేక రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజధాని పేరిట వేల ఎకరాల భూ సమీకరణ కేవలం రియల్ ఎస్టేట్ కోసమే అని ఆయన విమర్శించారు. ఈ అంశంపై తక్షణమే పునరాలోచించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రాజధానికి భూములిచ్చేందుకు ముంఉదకొచ్చే రైతులకు కూడా ఇదేరీతిన కోట్లు చెల్లిస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.