'ఏ సీఎం ఇన్ని విదేశీ పర్యటనలు చేయలేదు'
'ఏ సీఎం ఇన్ని విదేశీ పర్యటనలు చేయలేదు'
Published Sat, May 6 2017 2:01 PM | Last Updated on Wed, Jul 25 2018 2:59 PM
హైదరాబాద్: సీఎం చంద్రబాబుకు విదేశీ పర్యటనలు ఆనవాయితీగా మారాయని వైఎస్‌ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఇండియాలో ఏ ముఖ్యమంత్రి ఇన్ని విదేశీ పర్యటనలు చేయలేదన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు.. కనీసం దారి ఖర్చులకు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. ఏపీలో దోచుకున్న డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకే పర్యటనలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వెల్లువంటూ కొన్ని పత్రికలు మభ్యపెడుతున్నాయని తెలిపారు.
కాలిఫోర్నియా గవర్నర్‌తో రాష్ట్ర విభజనపై చర్చించడం దౌర్భాగ్యమన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు మాత్రం విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అనర్షుడగా ప్రజలు భావిస్తున్నారని అంబటి తెలిపారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని చాలా మంది అభ్యర్థులు కోరుతున్నారన్నారు. ఈ అంశంపై ఏపీపీఎస్సీ అధికారులతో చర్చించినట్టు తెలిపారు. దీనిపై రెండు, మూడ్రోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్టు అంబటి తెలిపారు.
Advertisement