సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కళాశాలపై బుధవారం ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఇవాళ దాడులు చేశారు. గురునానక్ కళాశాలతో పాటు వాటి అనుబంధ సంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.7కోట్ల 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రఘురామ్, నమి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలపైనా దాడులు చేసి, సోదాలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment