guru nanak engineering college
-
రంగారెడ్డి: యూత్ ఫెస్టివల్లో శ్రుతిహాసన్ సందడి (ఫోటోలు)
-
అనుమతి లేకుండా అడ్మిషన్లు.. విద్యార్థులకు న్యాయం చేయాలి
-
అనుమతి లేకుండా అడ్మిషన్లు.. విద్యార్థులకు న్యాయం చేయాలి
సాక్షి హైదరాబాద్: అనుమతి లేకుండా అడ్మిషన్లు స్వీకరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న గురునానక్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య డిమాండ్ చేశారు. పోలీసులు జరిపిన లాఠీ ఛార్జిని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, 4 వేల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏం జరిగిందంటే.. కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఓ చట్ట సవరణ తెచ్చింది. గత ఏడాది సెపె్టంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదం తెలపడం.. ఆ తర్వాత ఈ బిల్లును గవర్నర్‌కు పంపారు. అయితే ఇప్పటివరకూ దీనిపై గవర్నర్ దగ్గర్నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా గురునానక్‌తోపాటు మరో కాలేజీ కూడా బిల్లుపై స్పష్టత రాకుండానే విద్యార్థులను చేర్చుకుంటూ, భారీగా డబ్బులు వసూలు చేసింది. 2022–23 విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. చదవండి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ -
అనుమతి లేకుండా అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం: ఎలాంటి అనుమతులు లేని గురునానక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఆర్థికంగానే కాకుండా, విద్యా సంవత్సరం నష్టపోయామని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు కారణమైన వర్సిటీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఓ చట్ట సవరణ తెచ్చింది. గత ఏడాది సెపె్టంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారు. ఇప్పటివరకూ దీనిపై గవర్నర్ దగ్గర్నుంచి స్పష్టత రాలేదు. అయితే, గురునానక్‌తోపాటు మరో కాలేజీ కూడా బిల్లుపై స్పష్టత రాకుండానే విద్యార్థులను చేర్చుకుంది. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. గురునానక్ కాలేజీలో 3వేల మంది విద్యార్థులు చేరారు. 2022–23 విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. దీనిపై ప్రభుత్వం సంబంధిత కాలేజీలకు నోటీసులివ్వగా, విద్యార్థుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఈ చర్యతో తమకు జరిగిన నష్టం భర్తీ కాదని విద్యార్థులు అంటున్నారు. తమకు అన్యాయం చేశారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులు కళాశాలలోకి చొరబడి రాళ్లు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. -
గురునానక్ కళాశాలపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కళాశాలపై బుధవారం ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఇవాళ దాడులు చేశారు. గురునానక్ కళాశాలతో పాటు వాటి అనుబంధ సంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.7కోట్ల 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రఘురామ్, నమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలపైనా దాడులు చేసి, సోదాలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీపై దాడులు
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి సరఫరా చేస్తున్న 8మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. కళాశాల విద్యార్థులతో పాటు బయటి వ్యక్తులకు వీరు గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ దాడులు చేశారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను ఇబ్రహీంపట్నం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డిటెయిన్ చేశారని విద్యార్థుల ఆందోళన
గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన ఇబ్రహీంపట్నం: కళాశాలకు హాజరైనప్పటికీ.. తమను డిటెయిన్ చేశారని విద్యార్థులు మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. బీటెక్ సివిల్ బ్రాంచ్‌లో యాజమాన్య కోటా కింద చదువుతున్న 140 మంది విద్యార్థుల అటెండెన్స్‌ను తక్కువగా చూపిస్తూ జేఎన్టీయూకు కళాశాల యాజమాన్యం రిపోర్టు చేసింది. దీంతో ఆ విద్యార్థులను డిటేయిన్ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏబీవీపీ నాయకులతో కలిసి కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ పార్థసారథిని నిలదీశారు. సకాలంలో ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. పార్థసార థి మాట్లాడుతూ హాజరు విషయంలో ఉన్నది ఉన్నట్లుగా తాము రిపోర్టు పంపినట్లు తెలిపారు. విద్యార్థులను డిటేయిన్ చేస్తారని ఊహించలేదని తెలిపారు. విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు తమ డెరైక్టర్ రవీందర్‌రెడ్డిపై విద్యార్థులు దాడి చేశారని, కాలేజీ అద్దాలు పగులగొట్టారని కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏబీవీపీ నాయకులు ఉదయ్‌కుమార్, వినోద్, శాంతికుమార్, సంపత్, అర్జున్, దిలీప్‌కుమార్, క్రాంతికుమార్, శిరీష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థులను సెక్యూరిటీ గార్డు కొట్టారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు.