సాక్షి హైదరాబాద్: అనుమతి లేకుండా అడ్మిషన్లు స్వీకరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న గురునానక్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య డిమాండ్ చేశారు. పోలీసులు జరిపిన లాఠీ ఛార్జిని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, 4 వేల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఓ చట్ట సవరణ తెచ్చింది. గత ఏడాది సెపె్టంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదం తెలపడం.. ఆ తర్వాత ఈ బిల్లును గవర్నర్‌కు పంపారు. అయితే ఇప్పటివరకూ దీనిపై గవర్నర్ దగ్గర్నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా గురునానక్‌తోపాటు మరో కాలేజీ కూడా బిల్లుపై స్పష్టత రాకుండానే విద్యార్థులను చేర్చుకుంటూ, భారీగా డబ్బులు వసూలు చేసింది. 2022–23 విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.
చదవండి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment