Foreign Students: వుయ్‌ ఆర్‌ విదేశీ | Life style of foreign students in Hyderabad India | Sakshi
Sakshi News home page

Foreign Students: వుయ్‌ ఆర్‌ విదేశీ

Nov 12 2024 7:17 AM | Updated on Nov 12 2024 7:17 AM

Life style of foreign students in Hyderabad India

ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకుంటూ 

భద్రత విషయంలో హైదరాబాద్‌ బెస్ట్‌ అంటున్న స్టూడెంట్స్‌ 

నిజాం కాలేజీ, హెచ్‌సీయూ,  ఓయూలో చేరేందుకు ఆసక్తి 

తెలుగు, ఉర్దూ భాషలు నేర్చుకునేందుకు ప్రయత్నం 

 స్థానిక విద్యార్థులతో స్నేహం  చేస్తూ కలివిడిగా ఉంటున్న ఫారినర్స్‌ 

 సొంత దేశాలకు వెళ్లినా  ఇక్కడి సంస్కృతిపై అభిమానం

భాగ్యనగరం.. రోజూ వేలాది మంది నగరానికి వస్తుంటారు. వారందరికీ హైదరాబాద్‌ పట్నం.. ఓ కల్పతరువులా మారుతోంది. ఎవరు వచి్చనా అందరినీ ఆదుకుంటుంది.. ఆదరిస్తుంటుంది. ఇలా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, వేరే రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. వారందరినీ హైదరాబాద్‌ అక్కున చేర్చుకుంటోంది.. వ్యాపారం, పర్యాటకం కోసమే కాకుండా పై చదువుల కోసం కూడా ఇక్కడికి వస్తున్నారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తోంది భాగ్యనగరం.. వారంతా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాషపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. మన సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇక్కడి వారితో స్నేహం చేస్తూ.. కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. వేర్వేరు దేశాల నుంచి.. వేర్వేరు సంస్కృతుల నుంచి తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎల్లలు దాటి ఇక్కడికి వచ్చిన  కొందరు విదేశీ విద్యార్థుల మనోగతం తెలుసుకుందాం..  



దేశం కాని, దేశం.. భాష కాని భాష.. అనుకోకుండా కొందరు.. ఇష్టంతో కొందరు ఇలా ఎంతో మంది భాగ్యనగరం గడ్డపై అడుగుపెట్టారు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త ఆహారం ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం.. అనుమానం.. వాటన్నింటినీ భాగ్యనగరం ప్రజలు, వాతావరణం పటాపంచలు చేశాయి. కొత్త, వింత అనుకున్న సంస్కృతి, సంప్రదాయమే ఇప్పుడు వారికి ఎంతో ఇష్టంగా మారిపోయింది. ఈ సంస్కృతిలో భాగమవుతున్నారు. ఎలాంటి భయం లేకుండా మాతృభూమిపై ఉన్నట్టుగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు.  తెలుగుతో పాటు ఉర్దూ భాషలపై మమకారం పెంచుకుని వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మురిసిపోతున్నారు. 

ఎంతోమంది స్నేహితులు 
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీల్లో విదేశీ విద్యార్థులకు డిగ్రీ, పీజీ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు వేలాది మంది ఇక్కడికి వచ్చి కాలేజీల్లో చేరుతున్నారు. నిజాం కాలేజీలోనే దాదాపు 300 మంది విద్యార్థులు ఏటా వస్తున్నారని చెబుతున్నారు. ఇక, వేరే కాలేజీలు, యూనివర్సిటీలు కలిపి 2 వేలకు పైగా విద్యార్థులు ఏటా వస్తున్నారు.  

నిబద్ధతతో నేర్చుకుంటారు.. 
ఇక్కడికి వచ్చే విదేశీ విద్యార్థులు పాఠాలను ఎంతో నిబద్ధతతో నేర్చుకుంటారు. ఏటా వందలాది మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ చదువుకుని వెళ్లిన వారు వారి బంధువులకు కూడా ఈ కాలేజీ గురించి చెప్పి ఇక్కడికి పంపిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు మంచి ఉద్యోగాలు సాధించామని ఫోన్‌ చేసి చెబుతుంటారు. ఇక్కడి పిల్లలతో కలిసిపోతుంటారు. విదేశీ విద్యార్థులకు కాలేజీలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మేం చూసుకుంటాం. 
– ప్రొ.మహ్మద్‌ అబ్దుల్‌ అలీ, విదేశీ విద్యార్థలు కో–ఆర్డినేటర్, నిజాం కాలేజీ  

ఫీజులు కాస్త తక్కువ.. 
తమ దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు కాస్త తక్కువగా ఉండటమే కాకుండా, చదువు కూడా క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు.  సుడాన్, తుర్కెమెనిస్తాన్, యెమెన్, సోమాలియా వంటి దేశాల నుంచి ఎక్కువగా వస్తుంటారని నిజాం కాలేజీ విదేశీ విద్యార్థుల కో–ఆర్డినేటర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అలీ తెలిపారు. స్థానిక విద్యార్థులు కూడా విదేశీ విద్యార్థులతో కలివిడిగా ఉంటూ, వారికి ఏ అవసరం ఉన్నా కూడా సాయపడుతున్నారు. భాష సమస్య ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉంటామని, ఇంగ్లి‹Ùలో కమ్యూనికేట్‌ అవుతుంటామని నిజాం కాలేజీలోని పలువురు విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. తమకు ఇక్కడి వారు చాలా మంది స్నేహితులు ఉన్నారని,  సెలవులు ఉన్నప్పుడు వారితో హైదరాబాద్‌లోని సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లి వస్తుంటామని వివరించారు.

సంస్కృతి చాలా ఇష్టం..
హైదరాబాద్‌ సంస్కృతి అంటే చాలా ఇష్టం. మట్టిగాజులు, మెహందీ మా దేశంలో ఎవరూ వేసుకోరు. కానీ నాకు వాటిపై ఎంతో ఇష్టం పెరిగింది. అందుకే ఎప్పుడూ మెహందీ పెట్టుకుంటాను. గాజులు వేసుకుంటాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి ఫ్రెండ్స్‌ను అప్పుడప్పుడూ అడిగి తెలుసుకుంటాను. భారత్‌కు ముఖ్యంగా హైదరాబాద్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. 
– దుర్సుంజెమల్‌ ఇమ్రుజకోవా, బీఏ ఫస్ట్‌ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్‌మెనిస్తాన్‌

సొంతూర్లో ఉన్నట్టే..  
ఇక్కడ చదువుకున్న ఓ బంధువు నిజాం కాలేజీ గురించి చెబితే ఇక్కడ చేరాను. మొదట్లో ఇక్కడి వాతావరణం, 
ఆహరంతో కాస్త ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు అలవాటైంది. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్‌ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటాం. మా వంట మేమే చేసుకుంటాం. అప్పుడప్పుడూ ఇక్కడి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి.. హైదరాబాద్‌ రుచులను ఆస్వాదిస్తుంటాం. చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రదేశాలకు చాలాసార్లు వెళ్లాం.  
– మహ్రీ అమన్‌దుర్దీయువా, 
బీఏ థర్డ్‌ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్‌మెనిస్తాన్‌

చాలా సంతోషంగా ఉంది.. 
ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు అంతా సెట్‌ అయ్యింది. ఇక్కడి వారితో పాటు మా దేశం నుంచి వచి్చన ఫ్రెండ్స్‌తో టైం పాస్‌ చేస్తుంటాం. ఇక్కడి ఫుడ్, కల్చర్‌ చాలా నచి్చంది.  
– అనస్, బీఏ ఫస్ట్‌ ఇయర్, సూడాన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement