central university of hyderabad
-
విద్యార్థుల మరణాలు దురదృష్టకరం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెట్(ఐఐఎంల)లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల నివారణకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. ఐఐటీలు, ఐఐఎంల్లో గడిచిన 14 నెలల్లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ తెలపడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఈ అంశానికి న్యాయపరమైన ముగింపు ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల 2017లో, మహారాష్ట్రలోని టీఎన్ టోపీవాలా మెడికల్ కాలేజీ విద్యార్థిని పాయల్ తాడ్వి 2019లో బలవన్మరణం చెందారు. తమ విద్యాసంస్థల్లో కులపరమైన వివక్షను భరించలేకే ప్రాణాలు తీసుకున్నారంటూ వీరి తల్లులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి ఘటనల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, కోర్టు ఆదేశాలున్నా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల వివరాలను ఇచ్చేందుకు విద్యాసంస్థలు ససేమిరా అంటున్నాయని లాయర్ జైసింగ్ శుక్రవారం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
Foreign Students: వుయ్ ఆర్ విదేశీ
భాగ్యనగరం.. రోజూ వేలాది మంది నగరానికి వస్తుంటారు. వారందరికీ హైదరాబాద్ పట్నం.. ఓ కల్పతరువులా మారుతోంది. ఎవరు వచి్చనా అందరినీ ఆదుకుంటుంది.. ఆదరిస్తుంటుంది. ఇలా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, వేరే రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. వారందరినీ హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది.. వ్యాపారం, పర్యాటకం కోసమే కాకుండా పై చదువుల కోసం కూడా ఇక్కడికి వస్తున్నారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తోంది భాగ్యనగరం.. వారంతా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాషపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. మన సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇక్కడి వారితో స్నేహం చేస్తూ.. కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. వేర్వేరు దేశాల నుంచి.. వేర్వేరు సంస్కృతుల నుంచి తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎల్లలు దాటి ఇక్కడికి వచ్చిన కొందరు విదేశీ విద్యార్థుల మనోగతం తెలుసుకుందాం.. దేశం కాని, దేశం.. భాష కాని భాష.. అనుకోకుండా కొందరు.. ఇష్టంతో కొందరు ఇలా ఎంతో మంది భాగ్యనగరం గడ్డపై అడుగుపెట్టారు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త ఆహారం ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం.. అనుమానం.. వాటన్నింటినీ భాగ్యనగరం ప్రజలు, వాతావరణం పటాపంచలు చేశాయి. కొత్త, వింత అనుకున్న సంస్కృతి, సంప్రదాయమే ఇప్పుడు వారికి ఎంతో ఇష్టంగా మారిపోయింది. ఈ సంస్కృతిలో భాగమవుతున్నారు. ఎలాంటి భయం లేకుండా మాతృభూమిపై ఉన్నట్టుగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తెలుగుతో పాటు ఉర్దూ భాషలపై మమకారం పెంచుకుని వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మురిసిపోతున్నారు. ఎంతోమంది స్నేహితులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీల్లో విదేశీ విద్యార్థులకు డిగ్రీ, పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు వేలాది మంది ఇక్కడికి వచ్చి కాలేజీల్లో చేరుతున్నారు. నిజాం కాలేజీలోనే దాదాపు 300 మంది విద్యార్థులు ఏటా వస్తున్నారని చెబుతున్నారు. ఇక, వేరే కాలేజీలు, యూనివర్సిటీలు కలిపి 2 వేలకు పైగా విద్యార్థులు ఏటా వస్తున్నారు. నిబద్ధతతో నేర్చుకుంటారు.. ఇక్కడికి వచ్చే విదేశీ విద్యార్థులు పాఠాలను ఎంతో నిబద్ధతతో నేర్చుకుంటారు. ఏటా వందలాది మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ చదువుకుని వెళ్లిన వారు వారి బంధువులకు కూడా ఈ కాలేజీ గురించి చెప్పి ఇక్కడికి పంపిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు మంచి ఉద్యోగాలు సాధించామని ఫోన్ చేసి చెబుతుంటారు. ఇక్కడి పిల్లలతో కలిసిపోతుంటారు. విదేశీ విద్యార్థులకు కాలేజీలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మేం చూసుకుంటాం. – ప్రొ.మహ్మద్ అబ్దుల్ అలీ, విదేశీ విద్యార్థలు కో–ఆర్డినేటర్, నిజాం కాలేజీ ఫీజులు కాస్త తక్కువ.. తమ దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు కాస్త తక్కువగా ఉండటమే కాకుండా, చదువు కూడా క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. సుడాన్, తుర్కెమెనిస్తాన్, యెమెన్, సోమాలియా వంటి దేశాల నుంచి ఎక్కువగా వస్తుంటారని నిజాం కాలేజీ విదేశీ విద్యార్థుల కో–ఆర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ అలీ తెలిపారు. స్థానిక విద్యార్థులు కూడా విదేశీ విద్యార్థులతో కలివిడిగా ఉంటూ, వారికి ఏ అవసరం ఉన్నా కూడా సాయపడుతున్నారు. భాష సమస్య ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉంటామని, ఇంగ్లి‹Ùలో కమ్యూనికేట్ అవుతుంటామని నిజాం కాలేజీలోని పలువురు విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. తమకు ఇక్కడి వారు చాలా మంది స్నేహితులు ఉన్నారని, సెలవులు ఉన్నప్పుడు వారితో హైదరాబాద్‌లోని సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లి వస్తుంటామని వివరించారు.సంస్కృతి చాలా ఇష్టం..హైదరాబాద్ సంస్కృతి అంటే చాలా ఇష్టం. మట్టిగాజులు, మెహందీ మా దేశంలో ఎవరూ వేసుకోరు. కానీ నాకు వాటిపై ఎంతో ఇష్టం పెరిగింది. అందుకే ఎప్పుడూ మెహందీ పెట్టుకుంటాను. గాజులు వేసుకుంటాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి ఫ్రెండ్స్‌ను అప్పుడప్పుడూ అడిగి తెలుసుకుంటాను. భారత్‌కు ముఖ్యంగా హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది. – దుర్సుంజెమల్ ఇమ్రుజకోవా, బీఏ ఫస్ట్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్సొంతూర్లో ఉన్నట్టే.. ఇక్కడ చదువుకున్న ఓ బంధువు నిజాం కాలేజీ గురించి చెబితే ఇక్కడ చేరాను. మొదట్లో ఇక్కడి వాతావరణం, ఆహరంతో కాస్త ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు అలవాటైంది. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటాం. మా వంట మేమే చేసుకుంటాం. అప్పుడప్పుడూ ఇక్కడి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి.. హైదరాబాద్ రుచులను ఆస్వాదిస్తుంటాం. చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రదేశాలకు చాలాసార్లు వెళ్లాం. – మహ్రీ అమన్దుర్దీయువా, బీఏ థర్డ్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్చాలా సంతోషంగా ఉంది.. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఇక్కడి వారితో పాటు మా దేశం నుంచి వచి్చన ఫ్రెండ్స్‌తో టైం పాస్ చేస్తుంటాం. ఇక్కడి ఫుడ్, కల్చర్ చాలా నచి్చంది. – అనస్, బీఏ ఫస్ట్ ఇయర్, సూడాన్ -
హెచ్‌సీయూలో మత్తు దందా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టును సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు రట్టు చేశారు. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ పోలీసుల నిఘాను తప్పించుకోవడానికి డార్క్‌నెట్ నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ (చిన్న టాబ్లెట్ మాదిరిగా ఉండే మత్తుపదార్థం) ఖరీదు చేసి విక్రయిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. హెచ్–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డార్క్‌నెట్‌పై నిఘాతో పట్టుకున్న తొలి కేసు ఇదేనని తెలిపారు. అరెస్టయిన, వాంటెడ్‌గా ఉన్న వారిలో యువతులూ ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. బిట్కాయిన్ల రూపంలో చెల్లింపు గాజులరామారానికి చెందిన విఘ్నేష్ హెచ్‌సీయూలో చదువుతున్నాడు. తన స్నేహితుల ద్వారా డార్క్‌నెట్‌పై పట్టు సంపాదించాడు. అందులోని గ్రూపుల్లో చేరి ఎల్ఎస్డీ బ్లాట్స్ ఖరీదు చేస్తూ బిట్కాయిన్ల రూపంలో నగదు చెల్లిస్తున్నాడు. ఆ డ్రగ్ కొరియర్ ద్వారా ఇతడికి వచ్చి చేరుతోంది. జనవరిలో 20 బ్లాట్స్ కొన్న విఘ్నేష్ పది మంది స్నేహితులతో కలిసి రేవ్ పార్టీ నిర్వహించాడు. అందులో ఇతడితో పాటు అనుదీప్, తేజస్వీ కుమార్ (ఐటీ ఉద్యోగులు), నిఖిల్ (జంషెడ్‌పూర్‌లో ఎంబీఏ విద్యార్థి), ప్రీతమ్ (ఇటీవలే అమెరికా వెళ్లాడు), వంశీ (హెచ్‌సీయూ విద్యార్థి), రాహుల్, తేజ, సుష్మ (బీటెక్ విద్యార్థులు), ఎలిజబెత్ (హెచ్‌సీయూ విద్యార్థిని) ఉన్నారు. రూ. 3 వేలకు విక్రయం ►ఇటీవల మరో పది బ్లాట్స్ ఖరీదు చేసిన విఘ్నేష్ వాటిని బీకాం విద్యార్థి నాగార్జున్‌రెడ్డికి విక్రయించాడు. ఇతడి నుంచి వీటిని ఐటీ ఉద్యోగి వనం సాయి బాలాజీతోపాటు డిగ్రీ విద్యార్థిని చైత్ర వర్మ ఖరీదు చేశారు. చైత్ర తానే వినియోగించగా... సాయి బాలాజీ మాత్రం ఐటీ ఉద్యోగి హేమంత్, తేజస్వీ కుమార్‌లకు విక్రయించి, కొంత వినియోగించాడు. ►డార్క్ నెట్లో ఒక్కో బ్లాట్ను రూ.600 ఖరీదు చేస్తున్న విఘ్నేష్ ఇతరులకు రూ.3 వేలకు విక్రయిస్తున్నాడు. చిన్న టాబ్లెట్ మాదిరిగా ఉండే బ్లాట్స్ను వినియోగిస్తే దాదాపు ఆరు గంటలపాటు మత్తులో జోగుతారు. కొన్నాళ్లుగా వీరం తా ఈ డ్రగ్‌కు అలవాటుపడి బానిసలుగా మారా రు. ఈ డ్రగ్‌ను వీళ్లు తమ స్నేహితుల ఇళ్లలో జరిగే రేవ్ పార్టీల్లో లేదా కార్లలో సేవిస్తున్నారు. ఆపై పబ్స్‌కు వెళ్లి ట్రాన్స్ మ్యూజిక్ ఏర్పాటు చేయించుకుని మరో లోకంలో తేలుతున్నారు. ►వీరి వ్యవహారాలపై హెచ్–న్యూకు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్‌రావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్‌రెడ్డిలతో కూడిన బృందం వరుస దాడులు చేసింది. విఘ్నేష్, చైత్ర, నాగార్జున్‌రెడ్డి, హేమంత్, బాలాజీ, అనుదీప్, తేజస్విలను అరెస్టు చేసింది. వీరి నుంచి 19 బ్లాట్స్ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తోంది. -
దత్తాత్రేయ ఇంటి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్మ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో రాంనగర్ లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రోహిత్ ఆత్మహత్మ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ జాగృతి దత్తాత్రేయ ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జాగృతి కార్యకర్తలు, ఆందోళన కారులు పెద్ద ఎత్తున ఇంటి వద్దకు తరలి వచ్చారు. మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ కి వ్యకతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన ఎక్కువకావడంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రోహిత్ చావుకు ఎవరు బాధ్యులు?
‘చావు లాంఛనాల గురించి రాయడం మర్చిపోయాను. ఎవరూ నా ఆత్మహత్యకు బాధ్యులు కాదు. వారి చర్యల ద్వారాగానీ, మాటల ద్వారాగానీ నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు. ఇది పూర్తిగా నా స్వనిర్ణయం. నా చావుకు నేనే బాధ్యుడిని. నా స్నేహితులనుగానీ, నా శత్రువులగానీ నా ఆత్మహత్య కారణంగా వేధించకూడదు’ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ సూసైడ్ నోట్ సారాంశం ఇదీ. ఓ దళిత విద్యార్థి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నుంచి అతడితో గొడవ పడిన ఏబీవీపీ, నాడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి స్వయంగా లేఖ రాసిన సాక్షాత్తు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తప్పించుకునేందుకు ఈ సూసైడ్ నోట్ రక్షణ కవచంలా ఉపయోగపడొచ్చు. బోల్డంతా భవిష్యత్తుకు తిలోదకాలిచ్చి అర్ధాంతరంగా వెళ్లిపోయిన వేముల ఆత్మహత్యలో దాగున్న వేదన, వాస్తవ పరిస్థితులు మనందరిని వేటాడుతూనే ఉంటాయి. మన పిరికితనం వల్ల వేముల చనిపోయాడు. తోటి అకాడమిక్ విద్యార్థుల పిరికితనం. యూనివర్శిటీ అధికారుల పిరికితనం. రోహిత్, అతడి సహచరులను క్యాంపస్ నుంచి వెళ్లగొట్టాల్సిందిగా వచ్చిన ఆదేశాలకు లొంగిపోయిన పిరికితనం, ఓ బీజేపీ కార్యకర్తను గాయపరిచారనే ఆరోపణలకు సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని విచారణ కమిటీ నిగ్గు తేల్చినా పట్టించుకోని యూనివర్శిటీ అధికారుల పిరికితనం ఇవన్నీ కారణమే. రోహిత్ తోపాటు మరో నలుగురు అనుచరులను క్యాంపస్ నుంచి తరిమేసిన అధికారుల చర్యా కారణం. ఆత్మహత్య చేసుకోవాలని విపరీత నిర్ణయానికి రావడానికి దోహదం చేసిన పరిణామాలేమిటో వేముల రోహిత్ తన సూసైడ్ నోట్లో వెల్లడించకపోవచ్చు. అలాగే, ముంబై బాంబు పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన యాకూబ్ మెమన్ ను గత ఏడాది ఉరితీయవద్దంటూ తన గ్రూప్ ప్రదర్శన జరపలేదని చెప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మతహింసపై ‘ముజఫర్ నగర్ బాకీ హై’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదనీ చెప్పలేదు. ఈ చర్యల కారణంగా ఏబీవీపీ విద్యార్థులకు కోపం వచ్చిన విషయాన్ని చెప్పలేదు. వారి ప్రోద్బలంతో ఈ జాతి విద్రోహులపై చర్య తీసుకోమంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి బండారు దత్తాత్రేయ లేఖ రాసిని విషయాన్నీ చెప్పలేదు. గత రెండు వారాలుగా క్యాంపస్ ఆరుబయట నిద్రిస్తున్న విషయాన్నీ రోహిత్ చెప్పలేదు. దానికి బదులుగా ‘ఈ క్షణంలో నేను బాధ పడటం లేదు. విచారించడమూ లేదు. నా హృదయం ఖాళీ. నా పట్ల నాకు ఆందోళన లేదు. నేనెందుకు ఇలా చేస్తున్నాను’ అని లోలోన బాధపడిన రోహిత్, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడన్న విషయం చెప్పలేదు. కానీ ప్రేమ, బాధ, జీవితం, చావు గురించి చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు, ఈ క్షణం తన గుర్తింపు ఏమిటీ అన్న స్థాయికి పడిపోయిన ప్రపంచ విలువల గురించి చెప్పాడు. మనిషి మేథస్సును కాకుండా, ఒక ఓటరుగా, జనాభాలో ఒక అంకెగా, ఓ వస్తువుగా మనిషి మారిపోయిన విషయాన్ని చెప్పాడు. తోటి మనుషులను ఓ మేధస్సు కలిగిన వ్యక్తులుగా చూడాలని చెప్పాడు. నక్షత్ర ధూళి నుంచి చదువులో, వీధుల్లో, జీవితాల్లో, ఆఖరికి చావులోనూ అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని చెప్పాడు. ఓ దళితుడిగా వేముల రోహిత్ చనిపోదల్చుకోలేదు. సైన్స్ రైటర్ కావాలనుకున్నాడు. నక్షత్రాలను తాకాలనుకున్నాడు. అంబేడ్కర్ విద్యార్థుల సంఘం సభ్యుడిగా జాతీయ స్ఫూర్తికి కట్టుబడ్డాడు. భారతీయ ముస్లింల తరఫున నిలబడ్డాడు. అన్ని వర్గాల నుంచి సంఘీభావాన్ని కూడగట్టాలనుకున్నాడు. అతడితో నడిచేందుకు ప్రపంచం విఫలమైంది. అందుకని రోహిత్ తన తనువు చాలించుకున్నాడు. వేముల రోహిత్ వంటి కలలను నిజం చేయాలని తపన పడేవారికి ఒక్క హైదరాబాద్ యూనివర్శిటీలోనే కాదు, ఏ యూనివర్శిటీలోనూ చోటు ఉండకపోవచ్చు. మనలాంటి పిరికివాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో ఒంటరినని, తానొక ఖాళీ అని వేముల రోహిత్ ఎందుక భావించారు? -
రోహిత్ తల్లిని ఎంత ఓదార్చినా తక్కువే: వీసీ
హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ సస్పెన్షన్ వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించలేదని హెచ్‌సీయూ వైస్ ఛాన్సులర్ అప్పారావు తెలిపారు. ఆయన సోమవారం సాక్షి టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ...'రోహిత్ సస్పెన్షన్ పీరియడ్ తగ్గించడానికి చివరి వరకూ ప్రయత్నించాను. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ ప్రభావం ఎంతమాత్రం లేదు. ఆయన లేఖ కారణంగానే రోహిత్‌ను సస్పెండ్ చేయలేదు. వర్సిటీలో కుల శక్తులు, అసాంఘిక శక్తులు లేవు. రోహిత్ తల్లి బాధ ఎంతకు తీరనిది. ఆమెను ఎంత ఓదార్చినా తక్కువే. రోహిత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వర్సిటీలో ఉద్రిక్తత కారణంగా రోహిత్ తల్లిని కలవలేకపోయాను. విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నందువల్లే నా రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. నేను వీసీగా రాకముందే... విద్యార్థుల మధ్య గొడవ ఉంది. 14 రోజులపాటు విద్యార్థుల ఆందోళనపై ఇతర ప్రొఫెసర్లతో మాట్లాడుతూనే ఉన్నా' అని తెలిపారు. -
నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి: స్మృతి
న్యూఢిల్లీ : పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇద్దరు సభ్యుల బృందాన్ని పంపించామని, నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయని ఆమె సోమవారమిక్కడ అన్నారు. యూనివర్సిటీల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ప్రస్తుతం హెచ్‌సీయూలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె తెలిపారు. రోహిత్ కుటుంబసభ్యులకు స్మృతి ఇరానీ ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఇదే ఘటనపై ఢిల్లీలోని స్మృతి ఇరానీ నివాసాన్ని ఇవాళ విద్యార్థులు ముట్టడించారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యపై సహ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
'రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదు'
-
రోహిత్ మృతిపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతిపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ...ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు షకీలా శంషూ, సురత్ సింగ్ లు సోమవారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. హెచ్‌సీయూలో ఏం జరిగిందన్న అంశంపై కమిటీ సభ్యులు విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు రోహిత్ భౌతికకాయానికి ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం ఉప్పల్‌లోని అతని స్వగృహానికి తరలించారు. కాగా రోహిత్ కేసులో వీసీ అప్పారావును బర్తరఫ్ చేయాలని, రోహిత్ మృతికి కారణమైన దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత, అధ్యాపక సంఘాలు సోమవారం విశాఖ త్రి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. -
రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదు: దత్తాత్రేయ
న్యూఢిల్లీ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సోమవారమిక్కడ స్పష్టం చేశారు. 'యూనివర్సిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని నాకు విజ్ఞాపన వచ్చింది. సంఘ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఏబీవీపీ కార్యకర్తలను బాగా కొట్టినట్లుగా నాకు వినతిపత్రం వచ్చింది. దాన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖకు యథావిధిగా పంపించాను. వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. బీజేపీకి గాని, నాకుగాని ఎలాంటి సంబంధం లేదు. విచారణ జరుగుతోంది, అసలు విషయాలు బయటకు వస్తాయి. నాపై నమోదైన కేసులు గురించి నేను కామెంట్ చేయను' అని బండారు దత్రాత్తేయ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ...హెచ్‌సీయూకి అధికారులను పంపించనుంది. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంపై ఆ బృందం రేపు నివేదిక సమర్పించనుంది. -
'రోహిత్ ఆత్మహత్యకు వారిద్దరే కారణం'
హైదరాబాద్ : పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు ఇద్దరు బీజేపీ నేతలే కారణమని యూనివర్సిటీ అధ్యాపక సంఘం ఆరోపించింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు తమ పరిధులు దాటారని అధ్యాపక సంఘం వ్యాఖ్యానించింది. యూనివర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని యూనివర్సిటీ అధ్యాపక సంఘం తీవ్రంగా ఖండించింది. యూనివర్సిటీ పాలనా విభాగం మొదటి నుంచీ తప్పులు చేస్తోందని, కమిటీలు విచారిస్తున్న తీరుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, విద్యార్థుల మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని, కేసులు విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు అంటూ వర్సిటీ విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రమంత్రితో పాటు వీసీ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హెచ్సీయూకు కేంద్ర బృందం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటన, అనంతరం హెచ్‌సీయూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. అధికారులతో కూడిన బృందాన్ని హెచ్సీయూకు పంపారు. హెచ్‌సీయూ పరిణామాలపై కేంద్ర బృందం విచారించి మంగళవారం నివేదిక సమర్పించనుంది. హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. -
రోహిత్ ఆత్మహత్య; దత్తాత్రేయపై కేసు నమోదు
హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై కేసు నమోదు అయింది. దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది. ఏ1 వీసీ అప్పారావు, ఏ2 బండారు దత్తాత్రేయ, ఏ3 సుశీల్ కుమార్, ఏ4 విష్ణుపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం కూడా ...రోహిత్ ఘటనపై ఎలాంటి కమిటీ వేయకుండా చర్యలు తీసుకున్నారని, అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ఈ రోజు యూనివర్సిటీల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపునిచ్చాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. హెచ్‌సీయూలో పీహెచ్డీ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్థి రోహిత్ కలత చెంది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోహిత్ మృతదేహాన్ని తరలించకుండా విద్యార్థులు అడ్డుకోవడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో మృతదేహన్ని ఉంచి ధర్నాకు దిగారు. విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ దశలో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలని అతని తల్లి రాధిక డిమాండ్ చేసింది. వీసీ సమాధానం చెప్పేవరకు తాను యూనివర్సిటీ నుంచి వెళ్లనని, వీసీ వచ్చే వరకు రోహిత్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేయరాదని చెప్పింది. తాను టైలరింగ్ చేస్తూ తన కొడుకును చదివించానని, తన కొడుకుని సస్పెండ్ చేసి మనస్థాపానికి గురి చేశారని రాధిక కన్నీటిపర్యంతమైంది. -
'నా కొడుకు ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలి'
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలని అతని తల్లి రాధిక డిమాండ్ చేసింది. వీసీ సమాధానం చెప్పేవరకు తాను యూనివర్సిటీ నుంచి వెళ్లనని, వీసీ వచ్చే వరకు రోహిత్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేయరాదని చెప్పింది. తాను టైలరింగ్ చేస్తూ తన కొడుకును చదివించానని, తన కొడుకుని సస్పెండ్ చేసి మనస్థాపానికి గురి చేశారని రాధిక కన్నీటిపర్యంతమైంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో పీహెచ్డీ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్థి రోహిత్ కలత చెంది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోహిత్ మృతదేహాన్ని తరలించకుండా విద్యార్థులు అడ్డుకోవడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో మృతదేహన్ని ఉంచి ధర్నాకు దిగారు. విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
సెంట్రల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
* సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్న రోహిత్ * ఉరివేసుకొని పీహెచ్డీ విద్యార్థి బలవన్మరణం హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో పీహెచ్డీ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్థి రోహిత్ కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని తరలించకుండా విద్యార్థులు పోలీసులను అడ్డుకొని హాస్టల్ ఆవరణలోకి తరలించారు. దీంతో వర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో మృతదేహన్ని ఉంచి ధర్నాకు దిగారు. గుంటూరుకు చెందిన వేముల రోహిత్ (27) సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఎన్ఆర్ఎస్ఐ వింగ్ హాస్టల్లో 207 నంబర్ రూమ్‌లో ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫ్యాన్‌కు కండువాతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయంత్రం స్నేహితులు ఎంతగా పిలిచినా తలుపు తీయకపోవడంతో వెంటిలేటర్ నుంచి చూడగా, రోహిత్ ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు మృతదేహాన్ని బయటకు వెళ్లనీయబోమంటూ విద్యార్థులు భీష్మించుకొని కూర్చున్నారు. ఆదివారం రాత్రి వరకు కూడా మృతదేహం హాస్టల్ ఆవరణలో ఉంది. పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. బహిష్కరణ వెనుక... గత ఆగస్టులో సుశీల్ కుమార్ అనే విద్యార్థి తన ఫేస్బుక్ ఖాతాలో అంబేడ్కర్ స్టూడెం ట్స్ అసోసియేషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. దానిపై అతనిని నిలదీయగా క్షమాపణ చెప్పారు. అనంతరం తనపై ఐదుగురు విద్యార్థులు దాడి చేశారంటూ సుశీల్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డిసెంబర్ 18న పీెహ చ్‌డీ విద్యార్థులు రోహిత్‌తోపాటు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సుంకన్నలను వర్సిటీ వీసీ సస్పెండ్ చేశారు. దీంతో వారంతా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ 14 రోజులుగా వర్సిటీలో ధర్నా చేస్తున్నారు. సోమవారం ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో రోహిత్ తీవ్ర మనోవేదనకు లోనయ్యారని తోటి విద్యార్థులు చెప్పారు. వీసీ పట్టించుకోవడం లేదని, రేపు ఎలా ఉంటుందో అని రోహిత్ ఆదివారం ఉదయం స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐదు పేజీల సూసైడ్ నోట్ ఆత్మహత్యకు పాల్పడే ముందు రోహిత్ ఐదు పేజీల సూసైడ్ నోట్ రాశారు. శరీరం, హృదయానికి ఘర్షణ జరుగుతుందని ఆనోట్లో పేర్కొన్నారు. మనిషిని మనిషిగా చూడటం లేదు, పుట్టుక తీరునే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలియడంతో వందలాది మంది విద్యార్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీసీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంఎల్సీ రాంచందర్‌రావులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టాలన్న డిమాండ్‌తో అన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో సోమవారం బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యత వహించి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని భద్రం డిమాండ్ చేశారు. వీసీని సస్పెండ్ చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) స్టీరింగ్ కమిటీ సభ్యులు మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ, ఓయూ జాక్ చైర్మన్ మానవతా రాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.