రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదు: దత్తాత్రేయ | HCU phd student rohit suicide:nothing to do with death, says bandaru dattatreya | Sakshi
Sakshi News home page

రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదు: దత్తాత్రేయ

Published Mon, Jan 18 2016 2:41 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదు: దత్తాత్రేయ - Sakshi

రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదు: దత్తాత్రేయ

న్యూఢిల్లీ : హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సోమవారమిక్కడ స్పష్టం చేశారు. 'యూనివర్సిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని నాకు విజ్ఞాపన వచ్చింది.  సంఘ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా నా దృష్టికి వచ్చింది.

ఏబీవీపీ కార్యకర్తలను బాగా కొట్టినట్లుగా నాకు వినతిపత్రం వచ్చింది. దాన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖకు యథావిధిగా పంపించాను. వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. బీజేపీకి గాని, నాకుగాని ఎలాంటి సంబంధం లేదు. విచారణ జరుగుతోంది, అసలు విషయాలు బయటకు వస్తాయి. నాపై నమోదైన కేసులు గురించి నేను కామెంట్ చేయను' అని బండారు దత్రాత్తేయ తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ...హెచ్సీయూకి అధికారులను పంపించనుంది. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంపై ఆ బృందం రేపు నివేదిక సమర్పించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement