PHD student
-
లండన్‌లో మరో భారతీయ విద్యార్థిని దుర్మరణం
లండన్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చేసితా కొచర్ దుర్మరణం పాలయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీహెచ్డీ చేస్తున్నకొచర్ వర్శిటీ నుంచి తిరిగి వెళుతూండగా ప్రమాదానికి గురయ్యారు. సైకిల్‌పై వెళుతూండగా ట్రక్ ఒకటి ఆమెను బలంగా ఢీకొంది. దీంతో కోచర్ అక్కడికక్కడే మరణించారు. కోచర్ భర్త ప్రశాంత్ ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చేసితా ఆకస్మిక మరణంపై ఆమె తండ్రి, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కోచర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చేసితా మరణం కుటుంబంతోపాటు స్నేహితులను కూడా విషాదంలోకి నెట్టేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యంత ప్రతిభావంతురాలైన చేసితా మరణంపై సన్నిహితులు, సహవిద్యార్థులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. Cheistha Kochar worked with me on the #LIFE programme in @NITIAayog She was in the #Nudge unit and had gone to do her Ph.D in behavioural science at #LSE Passed away in a terrible traffic incident while cycling in London. She was bright, brilliant & brave and always full of… pic.twitter.com/7WyyklhsTA — Amitabh Kant (@amitabhk87) March 23, 2024 నీతీ ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కూడా కొచర్‌తో తన అనుబంధాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు. కొచర్ అకాల మరణంపై సంతాపం ప్రకటించిన ఆయన ఆమె నీతి ఆయోగ్‌లో తనతో కలిసి పనిచేశారని, ధైర్యవంతురాలని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, చికాగో యూనివర్సిటీల్లో పలు కోర్సులు చేసిన చేసితా కోచర్ 2021-23 మధ్య కాలంలో నీతి ఆయోగ్‌లోని నేషనల్ బిహేవియరల్ ఇన్సైట్స్ యూనిట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్‌గా పనిచేశారు. అంతేకాదు ఆధార్ ప్రాజెక్టు వ్యవస్థాపక బృందంలో ఒకరు కూడా సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియర్ చేంజ్‌లో పని చేస్తూండగా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కూడా కలిసి పనిచేశారు. ఆర్గనైజేషనల్బిహేవియర్ మేనేజ్మెంట్లో పీహెచ్‌డీకోసం గత ఏడాది సెప్టెంబరులోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చేరారు. నాలుగేళ్ల ఈ పీహెచ్డీ కోర్సుకు పూర్తిస్థాయి స్కాలర్షిప్ లభించడం గమనార్హం. ఫీడ్ ఇండియా బిజినెస్ చదువులో కొచర్ ఎపుడూ టాపర్. గణితం, ఎకానమిక్స్ అంటే చాలా ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో తొలి బిజినెస్ ‘ఫీడ్ ఇండియా’ను ప్రారంభించింది. విశ్వవిద్యాలయ క్యాంటీన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నామమాత్రపు ధరకు విక్రయించేది. తద్వారా క్యాంటీన్లలో వృథా అవుతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయడంతోపాటు... పేద మహిళలు వంట చేసుకునే శ్రమను తగ్గించి ఎక్కువ సమయం పనిచేసి మరింత సంపాదించుకునేలా చేసింది. ఈ వ్యాపారాన్ని కొనసాగించాలని చేసితా అనుకున్నా.. కుటుంబ సభ్యుల సూచనల మేరకు చదువులు పూర్తి చేయాలన్న దిశగా అడుగులు వేసింది. కానీ ఆమె కలలు, ఆశయాలు నెరవేరకుండానే ఈ లోకాన్ని వీడడం విషాదం. -
సీఎం, డిప్యూటీ సీఎంలపై ట్విట్టర్లో అసభ్య వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్లపై గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్లో అభ్యంతరకర వ్యాఖలు చేశాడు. ఈ మేరకు అధికారులు అక్టోబర్ 14న ఒక గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్ సీఎం, డిప్యూటీ సీఎంలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్లు ఫిర్యాదు అందినట్లు చెప్పారు. ఆ నిందితులు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని ఉపయోగించి తాము ముంబై నుంచి కంటెంట్‌ని పోస్ట్ చేస్తున్నట్లుగా అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ వింగ్ దర్యాప్తులో నిందితులు అహ్మద్‌నగర్ జిల్లాలోని రాహురిలో ఉన్న మహాత్మా ఫూలే వ్యవసాయం విశ్వవిద్యాలయం నుంచి వాటిని పోస్ట్ చేస్తున్నట్లు కనుగొన్నారు. దీంతో సైబర్ బృందం శనివారం ఆ విశ్వవిద్యాలయంలో దాడులు నిర్వహించగా... ఇద్దరు అనుమానితులను అదుపులోక తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. వారివద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పీహెచ్డీ విద్యార్థిని యూనివర్సిటీ నుంచి అదుపులోకి తీసుక్నుట్లు తెలిపారు. ఐతే ట్విట్టర్లో ఇలాంటి కంటెంట్లను రూపొందించడానికి ఎవరి సాయమైనా తీసుకున్నారేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం) -
తెలుగు విభాగంలో.. మొదటి ముస్లిం యువతి
తెలంగాణ నవలా రచయిత్రుల రచనలను ఇతివృత్తంగా తీసుకొని సమగ్ర పరిశోధన జరిపిన సయ్యద్ ఆఫ్రీన్ బేగంకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దాంతో తెలంగాణ విశ్వ విద్యాలయం నుంచి తెలుగు విభాగంలో పిహెచ్డి పట్టా పొందిన మొట్టమొదటి ముస్లిం యువతిగా ఆఫ్రీన్ బేగంకు అరుదైన ఘనత దక్కింది. తండ్రి ప్రోత్సాహంతో... కామారెడ్డి బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీ లో నివసించే అబ్దుల్ లతీఫ్ కూతురు ఆఫ్రీన్ బేగంకు చిన్నప్పటి నుంచే తెలుగుపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆఫ్రీన్ బేగంను డాక్టర్ చేయాలని తండ్రి లతీఫ్‌కి ఉండేది. అయితే కుమార్తెకు తెలుగుపై ఉన్న మక్కువను గుర్తించి ఆమె తెలుగులో ప్రావీణ్యం సాధించే విధంగా వేలాది రూపాయల విలువ చేసే తెలుగు సాహిత్య పుస్తకాలను కొనుగోలు చేసి బహుమతులుగా అందించారు. ఆఫ్రీన్ బేగం 2013–14లో తెలంగాణ యూనివర్సిటీలో ప్రవేశానికి పీజీ సెట్ రాయగా, అందులోనూ మొదటి ర్యాంకు సాధించి ఎం.ఎ. తెలుగులో ప్రవేశం పొందారు. తెలుగు పై ఆమెకు ఉన్న శ్రద్ధను గ్రహించిన తెలంగాణ వర్సిటి తెలుగు విభాగం ప్రొఫెసర్లు లావణ్య, బాల శ్రీనివాస్‌మూర్తి, త్రివేణి, లక్ష్మణ చక్రవర్తి, ప్రిన్సిపాల్ కనకయ్యలు ఆమెను ఎంతో ప్రోత్సహించడంతో ఆఫ్రీన్ ప్రతిభ కనబర్చి యూనివర్సిటీలోనే టాపర్‌గా నిలిచారు. తెలుగుపై పరిశోధనాత్మక వ్యాసాలు ఆఫ్రీన్ బేగం రాసిన వ్యాసాల్లో తెలుగు సాహిత్యం పై పరిశోధనలే అధికంగా ఉన్నాయి. ఆమె ప్రాచీన కాలం నాటి పుస్తకాలు చదివి తెలుగు చరిత్రపై అనేక వ్యాసాలు రాసారు. ముఖ్యంగా ముస్లిం కథలు– జీవన వాస్తవికత, సామెతల్లో జీవన చిత్రణ, రచయిత్రుల కథల్లో తెలంగాణ జీవన చిత్రణ, తెలంగాణలో నవలా మణులు తదితర వ్యాసాలు ఉన్నాయి. తెలంగాణలో నవలా మణులు అనే పరిశోధనాత్మక కథనంలో గత 400 ఏళ్ళుగా తెలుగు సాహిత్యానికి జరుగుతున్నసేవ, రచయితలు, కనుమరుగైన పేర్లను ఆమె తన వ్యాసంలో రాసి అందరి ప్రశంసలను అందుకున్నారు. గురజాడ పురస్కారం ఆఫ్రీన్ తెలుగు సాహిత్యంపై రాసిన వ్యాసాలను పరిశీలించిన మానవ సాహిత్య సాంçస్కృతిక అకాడమి, విజయవాడ వారు ‘గురజాడ అవార్డు’ను అందజేశారు. అలాగే 2014 మార్చి నెలలో విశాఖపట్టణంలో ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ వారు నిర్వహించిన ఉమ్మడి రాష్ట్ర స్థాయి ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డుల్లో ఆఫ్రీన్ బేగంకు ప్రథమ స్థానం లభించింది. ఈ సందర్భంగా అవార్డుతో సత్కరించారు. – ఎస్. మొహియొద్దీన్, సాక్షి, బాన్సువాడ నాన్న ఇచ్చిన ప్రోత్సాహం పిహెచ్డి చేయాలని నాలో బీజం నాటి, ఆ దిశగా నన్ను విజయవంతంగా ముందుకు నడపడంలో, నాలో ఆత్మధైర్యం పెంపొందించడంలో మా నాన్నతో పాటు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. పిహెచ్డి సాధించాలనే నా కల నెరవేరింది. తెలుగు సాహిత్యంపై మరిన్ని పరిశోధనలు చేయాలనుకుంటున్నాను. – ఆఫ్రీన్ బేగం -
బాత్రూమ్లో కిందపడి విద్యార్థిని మృతి
గచ్చిబౌలి :బాత్రూమ్లో కిందపడటంతో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివాసి స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్న దీపిక మహాపాత్ర (29) ఎల్‌హెచ్1 హాస్టల్లోని రూమ్ నెంబర్ 204 లో ఉంటోంది. సోమవారం ఉదయం ఉదయం బాత్రూంలోకి వెళ్లిన దీపిక కింద పడిపోయింది. శబ్ధం రావడంతో స్నేహితులు అక్కడికి వెళ్లి పిలిచినా స్పందించలేదు. దీంతో బాత్రూం తలుపులు తోసి చూడగా ఆమె కింద పడి ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బంది ఆమెను నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్దారించారు. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు దీపిక కొంతకాలంగా ఎపిలెప్సీ (మూర్చ) వ్యాధితో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు ధృవీకరించిన కేస్ షీట్లు లభించినట్లు తెలిపారు. దీనిని బట్టి ఆమె నరాల సంబంధ వ్యాధి కారణంగానే వెనక వైపు పడిపోవడంతో మృతి చెంది ఉండవచ్చునని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఓ పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. శ్రీనివాస్ అనే యువకుడు పుణెలో పీహెచ్డీ చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా అతని మానసిక స్థితి సరిగాలేకపోవడంతో చికిత్స కోసం నెల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆత్రేయీ మజుందార్ నీవెక్కడ..?
బెంగుళూరు : గత వారం అదృశ్యమైన బెంగుళూరుకు చెందిన ఆంత్రోపాలజిస్ట్ ఆత్రేయీ మజుందార్ (35) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆమె ఆచూకీ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. అందుకోసం వారు గూగుల్ స్ప్రెడ్ షీట్స్‌ను కూడా వాడుతున్నారు. కెనడాలో పీహెచ్డీ చేస్తున్న మజుందార్ ఏప్రిల్ 4న బెంగుళూరులోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇంటికి వచ్చిన అనంతరం తన గదిలోకి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల వరకూ నిద్రపోయింది. తర్వాత తన గది నుంచి బయటకు వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. నాటి నుంచి ఈ రోజు వరకూ ఆమె ఆచూకీ తెలియలేదు. కాగా మజుందార్ కనిపించకుండా పోవడానికి ఒక్క రోజు ముందు తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. కానీ ఆమె వారితో సరిగా మాట్లడలేదు. మరుసటి రోజు ఆమె తాను ఢిల్లీలో ఉన్నట్లు తండ్రితో చెప్పింది. ఆమెను బెంగుళూరు రమ్మని తండ్రి సూచించినా కుమార్తె ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్రేయీ మజుందార్ బెంగళూరులోని బెల్లందూర్‌లో బస చేసిన నోవాటెల్, మారియట్ హోటల్ నుంచి సీసీటీవీ ఫూటేజ్ తెప్పించి పరిశీలించారు. మజుందర్ హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తనతో పాటు పాస్‌పోర్టు, డబ్బులను మాత్రమే తీసుకెళ్లింది. ఫోన్‌ను హోటల్లోనే వదిలేసి వెళ్లినట్లుగా తెలిసింది. మజుందార్ తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో ఆమె ఫోటోను షేర్ చేసి ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బెంగళూరులోని నేషనల్ లా కాలేజీలో చదువుకున్న మజుందార్ ప్రస్తుతం పీహెచ్డీ చేయడానికి టోరంటో వెళ్లింది. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఈ కింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుతున్నారు. 9845261515, 9448290990 -
నీ కూతురికి అదే గతి పట్టాలి: ఓ విద్యార్థిని
సాక్షి, న్యూఢిల్లీ : 'సార్ మీకు సభ్యత, సంస్కారం లాంటివి లేవు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా’ అంటూ వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌కి ఓ పీహెచ్డీ విద్యార్థిని ఈమెయిల్ చేసింది. ప్రొఫెసర్ ప్రవర్తన నచ్చకనే వర్సీటీ నుంచి తాను పారిపోయానని చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన ఓ 26 ఏళ్ల యువతి జేఎన్‌యూలో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్, పీహెచ్డీ చేస్తోంది. ఇటీవల ఆమె యూనివర్సిటీ నుంచి పారిపోయి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై విద్యార్థిని తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎ.కె.జోరి దురుసు ప్రవర్తన వల్లే యూనివర్సీటీని వదిలి వెళ్లాలని ఆ విద్యార్థిని లేఖ సారాంశం. ‘ గౌరవనీయులైన ప్రొఫెసర్ గారికి నమస్కారం. మీరు దేశంలోనే గొప్ప గైడ్ (నిర్దేశకుడు) అని అనుకుంటున్నారు. నేను కూడా మొదట్లో ఇలానే అనుకున్నా. మీరు మాకు గైడ్‌గా ఉండడం వరంగా భావించా. కానీ తర్వాత మీ నిజస్వరూపం తెలిసింది. మీకు సభ్యత, సంస్కారాలు తెలియవు. ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. నీ దురుసు ప్రవర్తన వల్లే నేను వర్సీటీ వదిలి వెళ్లాను. నాలాగ మరో అమ్మాయి బలి కాకుడదని అనుకుంటున్నాను. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితే రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. కనీసం అప్పుడైనా అమ్మాయిల బాధ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ మెయిల్ పంపింది. కాగా ప్రొఫెసర్ ఎ.కె.జోరి తనపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తాను గత నెల 27న వరుసగా గైర్హాజరైన తొమ్మిమంది విద్యార్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపాను. ‘మీరు సరిగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా అయితే మీ పీహెచ్‌డీని పూర్తి చేయడం కష్టం. మీరు మరో ల్యాబ్‌ను చూసుకోండి’అని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అందరు విద్యార్థుల్లాగే రెగ్యులర్‌గా హాజరు కావాలని కోరానన్నారు. అందరితో ప్రవర్తించినట్లే ఆమెతోను వ్యవహరించానని తెలిపారు. ఆ విద్యార్థిని తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని ప్రొఫెసర్ ఎ.కె.జోరి అన్నారు. -
పీహెచ్డీ చదువొదిలి.. ప్రకృతి సేద్యంలోకి..!
ఆంగ్ల సాహిత్యంపై మక్కువతో హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (‘ఇఫ్లూ’)లో పీహెచ్డీ చేస్తున్న ఓ యువకుడు.. ఉన్నట్టుండి ఒక రోజున భార్యా బిడ్డలతోపాటు తిరిగి ఇంటికెళ్లి.. అంతే మక్కువతో రెండున్నరేళ్లుగా, ప్రశాంతంగా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారు. అందుకు దారితీసిన బలమైన కారణం ఏమై ఉంటుంది? ‘‘మట్టి ఆరోగ్యంపైనే మనుషులు సహా సకల జీవరాశి ఆరోగ్యం, జీవావరణం శ్రేయస్సు ఆధారపడి ఉన్నాయని గ్రహించా. పరిశోధన కొనసాగించి అధ్యాపకుడిగా జీవించే కన్నా.. నేలతల్లికి ప్రణమిల్లి.. ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకుంటూ మట్టిని నెమ్మదిగా బాగు చేసుకుంటూనే ఆయురారోగ్య సిరులనిచ్చే చిరు(సిరి)ధాన్యాలను సాగు చేస్తున్నా..’’ అంటున్నారు కిశోర్ చంద్ర (38). శిక్షణ పొంది ప్రకృతి సేద్యంలోకి.. ఆంగ్ల సాహిత్యంలో ఎమ్.ఎ, ఎంఫిల్, బీఈడీ చేసి దేశ విదేశాల్లో ఐదేళ్లు అధ్యాపకుడిగా పనిచేసి.. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ‘ఇఫ్లూ’లో పరిశోధన విద్యార్థిగా చేరారు. ఆ కొత్తలోనే అమీర్‌ఖాన్ ‘సత్యమేవ జయతే’ టీవీ షోలో విషతుల్య ఆహారంపై స్ఫూర్తి పొందారు. ఒకవైపు ఆంగ్ల భాషా బోధనపై పరిశోధనను కొనసాగిస్తూనే.. అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ సంస్థలో పర్మాకల్చర్‌లో, భూమి కాలేజీ (బెంగళూరు)లో ఆహారం–వ్యవసాయంపైన, మనసబు ఫుకుఓకా ప్రకృతి వ్యవసాయంపైన శిక్షణ పొంది అవగాహనను పరిపుష్టం చేసుకున్నారు. 2015 ఏప్రిల్‌లో తన జీవితాన్ని అర్థవంతమైన మలుపుతిప్పే నిర్ణయం తీసుకున్నారు! నాలుగేళ్లు కొనసాగించిన పరిశోధనకు స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. ఉన్నత విద్యావంతులైన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు ఆయన నిర్ణయాన్ని స్వాగతించి తోడ్పాటునందించడం విశేషం. రసాయనిక వ్యవసాయానికి స్వస్తి కిశోర్‌చంద్ర స్వస్థలం డా. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు. తండ్రి డాక్టర్ పాతకోట చిన్నగురివిరెడ్డి ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసి, శ్రీహరికోట ‘ఇస్రో’లో కొంతకాలం యానాదులపై పరిశోధన చేశారు. కుటుంబ కారణాల వల్ల ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రొద్దుటూరులోనే ఉంటున్నారు. అక్కడికి సమీపంలోని తాళ్లమాపురం గ్రామంలో వారికి మెట్ట భూమి ఉంది. పదేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేయిస్తున్నారు. ఆరేడేళ్ల క్రితం వారి పొలంలో పురుగులమందు పిచికారీ చేసిన ఇద్దరు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురైతే.. రూ. 50 వేల ఖర్చుతో వైద్యం చేయించి వారి ప్రాణాలను కాపాడారు. రసాయనిక వ్యవసాయం కొనసాగింపు సరికాదన్న భావం బలపడడానికి ఈ సంఘటన కూడా ఒక కారణమని కిశోర్ చంద్ర వివరించారు. ఆ నేపథ్యంలో రసాయన రహిత సేద్యం వైపు మళ్లిన ఆయన తండ్రితో కలసి గత రెండున్నరేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. అండుకొర్రల సాగుపై దృష్టి సాగునీటి వసతి లేని తమ పొలాన్ని అందుబాటులోని ప్రకృతి వనరులతోనే సారవంతం చేసుకుంటూనే తమ ప్రాంతానికి అనువైన చిరుధాన్యాల సాగును కిశోర్ చంద్ర చేపట్టారు. పచ్చిరొట్ట ఎరువులతోపాటు ‘రామబాణం’ పద్ధతిలో భూసారాన్ని పెంపొందిస్తున్నారు. జీవామృతం, పంచగవ్యలతో కొర్రలు, ఊదలతోపాటు అరుదైన సిరిధాన్య పంట అండుకొర్రలు(బ్రౌన్‌టాప్ మిల్లెట్) సాగు చేస్తూ.. తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 10 ఎకరాల్లో ఏకపంటగా అండుకొర్రలు సాగు చేశారు. ఇది 80–90 రోజుల పంట. పంట మూడు అడుగుల ఎత్తు పెరిగింది. కోతకు వచ్చే దశలో ఎడతెగని వర్షాల వల్ల దిగుబడి ఎకరానికి 9 క్వింటాళ్ల నుంచి 6 క్వింటాళ్లకు తగ్గింది. అండుకొర్ర ధాన్యం క్వింటాల్‌కు రూ. 3,500కు అమ్మారు. రబీలో 14 ఎకరాల్లో అండుకొర్రలను సాగు చేస్తున్నారు. డిసెంబర్ 15న చాడ గట్టి(బోరు నీటిని పారగట్టి్ట) గొర్రుతో ఇరుసాళ్లు విత్తనం విత్తారు. ఎకరానికి రెండుంపావు కిలోల విత్తనం వాడారు. దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేప పిండి, 100 కిలోల ఆముదం పిండి చల్లారు. విత్తిన ఐదు వారాలకు బోరు నీటితోపాటు జీవామృతం పారగట్టారు. 8 వారాలకు ఎకరానికి రెండున్నర లీటర్ల పంచగవ్యను వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశారు. మార్చిలో నూర్పిడి చేయనున్నారు. రబీ పంట వేశాక వర్షం పడకపోవడం వల్ల పంట అడుగున్నర ఎత్తు మాత్రమే ఎదిగింది. ఎకరానికి 6 క్వింటాళ్ల అండుకొర్రల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది ఊదలు, కొర్రలు, జొన్నలు సాగు చేసినప్పుడు.. ఊదలను సగం వరకు పక్షులు తిన్నాయని, అండుకొర్రలకు పక్షుల బెడద లేదన్నారు. సిరిధాన్యాల్లోకెల్లా అత్యధికంగా 12.5% పీచు కలిగి ఉండటం అండుకొర్రల విశిష్టత. ఇంటిల్లిపాదికీ సిరిధాన్యాలే ఆహారం.. ప్రొద్దుటూరులో జన్మించి మైసూరులో స్థిరపడిన సుప్రసిద్ధ స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలి సూచనల మేరకు 8 నెలలుగా తమ 8, 2 ఏళ్ల పిల్లలతోపాటు ఇంటిల్లిపాదీ సిరిధాన్యాలనే ప్రధాన ఆహారంగా తింటూ ఆరోగ్యంగా ఉన్నామని కిశోర్ చంద్ర ఆనందంగా తెలిపారు. జలవనరులు తక్కువగా ఉన్న తమ పొలంలో అతి తక్కువ నీటితో పండే సిరిధాన్యాలను సాగు చేయడంతోపాటు.. వాటినే ప్రధాన ఆహారంగా తినటం ద్వారా విద్యాధిక రైతు కిశోర్‌చంద్ర యువ రైతాంగానికి ఆదర్శంగా నిలవడం విశేషం. ఇటీవల సేంద్రియ గ్రామసభలో కిశోర్చంద్రను అధికారులు ఘనంగా సత్కరించారు. బాధ్యతగల రైతుగా సిరిధాన్యాలు పండిస్తున్నా.. వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం మట్టిని, నీటిని, వాతావరణాన్ని, మొత్తం జీవావరణాన్ని నాశనం చేసే రసాయనిక సేద్యమేనని.. అతిగా నీటిని తాగే పంటలేనని అర్థం చేసుకున్నా. మనకూ భూమి ఉంది కదా. బాధ్యతగల పౌరుడిగా ఏం చేయొచ్చు? ఏం చేయగలం? అని ఆలోచించా. నాన్నతో కలిసి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టా. తినే పంటలనే పండిస్తున్నాం. తినగా మిగిలినది అమ్ముతున్నాం. నిదానంగా భూమి సారవంతమవుతోంది. సీతాకోకచిలుకలు, తేనెటీగలు, వానపాములు, పీతలు కనిపిస్తుంటే సంతోషంగా ఉంది. సిరిధాన్యాలతోపాటు పండ్లు, కూరగాయలూ పండించి నలుగురికీ అందించాలన్నది లక్ష్యం. – పాతకోట కిశోర్‌చంద్ర (94900 28642), ప్రొద్దుటూరు, డా.వైఎస్సార్ కడప జిల్లా – కుడుముల వీరారెడ్డి, సాక్షి, ప్రొద్దుటూరు, డా.వైఎస్సార్ కడప జిల్లా -
దత్తాత్రేయ ఇంటి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్మ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో రాంనగర్ లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రోహిత్ ఆత్మహత్మ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ జాగృతి దత్తాత్రేయ ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జాగృతి కార్యకర్తలు, ఆందోళన కారులు పెద్ద ఎత్తున ఇంటి వద్దకు తరలి వచ్చారు. మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ కి వ్యకతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన ఎక్కువకావడంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రోహిత్ చావుకు ఎవరు బాధ్యులు?
‘చావు లాంఛనాల గురించి రాయడం మర్చిపోయాను. ఎవరూ నా ఆత్మహత్యకు బాధ్యులు కాదు. వారి చర్యల ద్వారాగానీ, మాటల ద్వారాగానీ నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు. ఇది పూర్తిగా నా స్వనిర్ణయం. నా చావుకు నేనే బాధ్యుడిని. నా స్నేహితులనుగానీ, నా శత్రువులగానీ నా ఆత్మహత్య కారణంగా వేధించకూడదు’ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ సూసైడ్ నోట్ సారాంశం ఇదీ. ఓ దళిత విద్యార్థి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నుంచి అతడితో గొడవ పడిన ఏబీవీపీ, నాడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి స్వయంగా లేఖ రాసిన సాక్షాత్తు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తప్పించుకునేందుకు ఈ సూసైడ్ నోట్ రక్షణ కవచంలా ఉపయోగపడొచ్చు. బోల్డంతా భవిష్యత్తుకు తిలోదకాలిచ్చి అర్ధాంతరంగా వెళ్లిపోయిన వేముల ఆత్మహత్యలో దాగున్న వేదన, వాస్తవ పరిస్థితులు మనందరిని వేటాడుతూనే ఉంటాయి. మన పిరికితనం వల్ల వేముల చనిపోయాడు. తోటి అకాడమిక్ విద్యార్థుల పిరికితనం. యూనివర్శిటీ అధికారుల పిరికితనం. రోహిత్, అతడి సహచరులను క్యాంపస్ నుంచి వెళ్లగొట్టాల్సిందిగా వచ్చిన ఆదేశాలకు లొంగిపోయిన పిరికితనం, ఓ బీజేపీ కార్యకర్తను గాయపరిచారనే ఆరోపణలకు సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని విచారణ కమిటీ నిగ్గు తేల్చినా పట్టించుకోని యూనివర్శిటీ అధికారుల పిరికితనం ఇవన్నీ కారణమే. రోహిత్ తోపాటు మరో నలుగురు అనుచరులను క్యాంపస్ నుంచి తరిమేసిన అధికారుల చర్యా కారణం. ఆత్మహత్య చేసుకోవాలని విపరీత నిర్ణయానికి రావడానికి దోహదం చేసిన పరిణామాలేమిటో వేముల రోహిత్ తన సూసైడ్ నోట్లో వెల్లడించకపోవచ్చు. అలాగే, ముంబై బాంబు పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన యాకూబ్ మెమన్ ను గత ఏడాది ఉరితీయవద్దంటూ తన గ్రూప్ ప్రదర్శన జరపలేదని చెప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మతహింసపై ‘ముజఫర్ నగర్ బాకీ హై’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదనీ చెప్పలేదు. ఈ చర్యల కారణంగా ఏబీవీపీ విద్యార్థులకు కోపం వచ్చిన విషయాన్ని చెప్పలేదు. వారి ప్రోద్బలంతో ఈ జాతి విద్రోహులపై చర్య తీసుకోమంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి బండారు దత్తాత్రేయ లేఖ రాసిని విషయాన్నీ చెప్పలేదు. గత రెండు వారాలుగా క్యాంపస్ ఆరుబయట నిద్రిస్తున్న విషయాన్నీ రోహిత్ చెప్పలేదు. దానికి బదులుగా ‘ఈ క్షణంలో నేను బాధ పడటం లేదు. విచారించడమూ లేదు. నా హృదయం ఖాళీ. నా పట్ల నాకు ఆందోళన లేదు. నేనెందుకు ఇలా చేస్తున్నాను’ అని లోలోన బాధపడిన రోహిత్, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడన్న విషయం చెప్పలేదు. కానీ ప్రేమ, బాధ, జీవితం, చావు గురించి చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు, ఈ క్షణం తన గుర్తింపు ఏమిటీ అన్న స్థాయికి పడిపోయిన ప్రపంచ విలువల గురించి చెప్పాడు. మనిషి మేథస్సును కాకుండా, ఒక ఓటరుగా, జనాభాలో ఒక అంకెగా, ఓ వస్తువుగా మనిషి మారిపోయిన విషయాన్ని చెప్పాడు. తోటి మనుషులను ఓ మేధస్సు కలిగిన వ్యక్తులుగా చూడాలని చెప్పాడు. నక్షత్ర ధూళి నుంచి చదువులో, వీధుల్లో, జీవితాల్లో, ఆఖరికి చావులోనూ అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని చెప్పాడు. ఓ దళితుడిగా వేముల రోహిత్ చనిపోదల్చుకోలేదు. సైన్స్ రైటర్ కావాలనుకున్నాడు. నక్షత్రాలను తాకాలనుకున్నాడు. అంబేడ్కర్ విద్యార్థుల సంఘం సభ్యుడిగా జాతీయ స్ఫూర్తికి కట్టుబడ్డాడు. భారతీయ ముస్లింల తరఫున నిలబడ్డాడు. అన్ని వర్గాల నుంచి సంఘీభావాన్ని కూడగట్టాలనుకున్నాడు. అతడితో నడిచేందుకు ప్రపంచం విఫలమైంది. అందుకని రోహిత్ తన తనువు చాలించుకున్నాడు. వేముల రోహిత్ వంటి కలలను నిజం చేయాలని తపన పడేవారికి ఒక్క హైదరాబాద్ యూనివర్శిటీలోనే కాదు, ఏ యూనివర్శిటీలోనూ చోటు ఉండకపోవచ్చు. మనలాంటి పిరికివాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో ఒంటరినని, తానొక ఖాళీ అని వేముల రోహిత్ ఎందుక భావించారు? -
రోహిత్ తల్లిని ఎంత ఓదార్చినా తక్కువే: వీసీ
హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ సస్పెన్షన్ వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించలేదని హెచ్‌సీయూ వైస్ ఛాన్సులర్ అప్పారావు తెలిపారు. ఆయన సోమవారం సాక్షి టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ...'రోహిత్ సస్పెన్షన్ పీరియడ్ తగ్గించడానికి చివరి వరకూ ప్రయత్నించాను. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ ప్రభావం ఎంతమాత్రం లేదు. ఆయన లేఖ కారణంగానే రోహిత్‌ను సస్పెండ్ చేయలేదు. వర్సిటీలో కుల శక్తులు, అసాంఘిక శక్తులు లేవు. రోహిత్ తల్లి బాధ ఎంతకు తీరనిది. ఆమెను ఎంత ఓదార్చినా తక్కువే. రోహిత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వర్సిటీలో ఉద్రిక్తత కారణంగా రోహిత్ తల్లిని కలవలేకపోయాను. విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నందువల్లే నా రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. నేను వీసీగా రాకముందే... విద్యార్థుల మధ్య గొడవ ఉంది. 14 రోజులపాటు విద్యార్థుల ఆందోళనపై ఇతర ప్రొఫెసర్లతో మాట్లాడుతూనే ఉన్నా' అని తెలిపారు. -
నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి: స్మృతి
న్యూఢిల్లీ : పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇద్దరు సభ్యుల బృందాన్ని పంపించామని, నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయని ఆమె సోమవారమిక్కడ అన్నారు. యూనివర్సిటీల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ప్రస్తుతం హెచ్‌సీయూలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె తెలిపారు. రోహిత్ కుటుంబసభ్యులకు స్మృతి ఇరానీ ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఇదే ఘటనపై ఢిల్లీలోని స్మృతి ఇరానీ నివాసాన్ని ఇవాళ విద్యార్థులు ముట్టడించారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యపై సహ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
రోహిత్ మృతిపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతిపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ...ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు షకీలా శంషూ, సురత్ సింగ్ లు సోమవారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. హెచ్‌సీయూలో ఏం జరిగిందన్న అంశంపై కమిటీ సభ్యులు విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు రోహిత్ భౌతికకాయానికి ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం ఉప్పల్‌లోని అతని స్వగృహానికి తరలించారు. కాగా రోహిత్ కేసులో వీసీ అప్పారావును బర్తరఫ్ చేయాలని, రోహిత్ మృతికి కారణమైన దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత, అధ్యాపక సంఘాలు సోమవారం విశాఖ త్రి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. -
రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదు: దత్తాత్రేయ
న్యూఢిల్లీ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సోమవారమిక్కడ స్పష్టం చేశారు. 'యూనివర్సిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని నాకు విజ్ఞాపన వచ్చింది. సంఘ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఏబీవీపీ కార్యకర్తలను బాగా కొట్టినట్లుగా నాకు వినతిపత్రం వచ్చింది. దాన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖకు యథావిధిగా పంపించాను. వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. బీజేపీకి గాని, నాకుగాని ఎలాంటి సంబంధం లేదు. విచారణ జరుగుతోంది, అసలు విషయాలు బయటకు వస్తాయి. నాపై నమోదైన కేసులు గురించి నేను కామెంట్ చేయను' అని బండారు దత్రాత్తేయ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ...హెచ్‌సీయూకి అధికారులను పంపించనుంది. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంపై ఆ బృందం రేపు నివేదిక సమర్పించనుంది. -
'రోహిత్ ఆత్మహత్యకు వారిద్దరే కారణం'
హైదరాబాద్ : పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు ఇద్దరు బీజేపీ నేతలే కారణమని యూనివర్సిటీ అధ్యాపక సంఘం ఆరోపించింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు తమ పరిధులు దాటారని అధ్యాపక సంఘం వ్యాఖ్యానించింది. యూనివర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని యూనివర్సిటీ అధ్యాపక సంఘం తీవ్రంగా ఖండించింది. యూనివర్సిటీ పాలనా విభాగం మొదటి నుంచీ తప్పులు చేస్తోందని, కమిటీలు విచారిస్తున్న తీరుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, విద్యార్థుల మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని, కేసులు విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు అంటూ వర్సిటీ విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రమంత్రితో పాటు వీసీ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హెచ్సీయూకు కేంద్ర బృందం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటన, అనంతరం హెచ్‌సీయూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. అధికారులతో కూడిన బృందాన్ని హెచ్సీయూకు పంపారు. హెచ్‌సీయూ పరిణామాలపై కేంద్ర బృందం విచారించి మంగళవారం నివేదిక సమర్పించనుంది. హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. -
రోహిత్ ఆత్మహత్య; దత్తాత్రేయపై కేసు నమోదు
హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై కేసు నమోదు అయింది. దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది. ఏ1 వీసీ అప్పారావు, ఏ2 బండారు దత్తాత్రేయ, ఏ3 సుశీల్ కుమార్, ఏ4 విష్ణుపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం కూడా ...రోహిత్ ఘటనపై ఎలాంటి కమిటీ వేయకుండా చర్యలు తీసుకున్నారని, అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ఈ రోజు యూనివర్సిటీల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపునిచ్చాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. హెచ్‌సీయూలో పీహెచ్డీ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్థి రోహిత్ కలత చెంది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోహిత్ మృతదేహాన్ని తరలించకుండా విద్యార్థులు అడ్డుకోవడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో మృతదేహన్ని ఉంచి ధర్నాకు దిగారు. విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ దశలో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలని అతని తల్లి రాధిక డిమాండ్ చేసింది. వీసీ సమాధానం చెప్పేవరకు తాను యూనివర్సిటీ నుంచి వెళ్లనని, వీసీ వచ్చే వరకు రోహిత్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేయరాదని చెప్పింది. తాను టైలరింగ్ చేస్తూ తన కొడుకును చదివించానని, తన కొడుకుని సస్పెండ్ చేసి మనస్థాపానికి గురి చేశారని రాధిక కన్నీటిపర్యంతమైంది. -
'నా కొడుకు ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలి'
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలని అతని తల్లి రాధిక డిమాండ్ చేసింది. వీసీ సమాధానం చెప్పేవరకు తాను యూనివర్సిటీ నుంచి వెళ్లనని, వీసీ వచ్చే వరకు రోహిత్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేయరాదని చెప్పింది. తాను టైలరింగ్ చేస్తూ తన కొడుకును చదివించానని, తన కొడుకుని సస్పెండ్ చేసి మనస్థాపానికి గురి చేశారని రాధిక కన్నీటిపర్యంతమైంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో పీహెచ్డీ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్థి రోహిత్ కలత చెంది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోహిత్ మృతదేహాన్ని తరలించకుండా విద్యార్థులు అడ్డుకోవడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో మృతదేహన్ని ఉంచి ధర్నాకు దిగారు. విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
సెంట్రల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
* సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్న రోహిత్ * ఉరివేసుకొని పీహెచ్డీ విద్యార్థి బలవన్మరణం హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో పీహెచ్డీ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్థి రోహిత్ కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని తరలించకుండా విద్యార్థులు పోలీసులను అడ్డుకొని హాస్టల్ ఆవరణలోకి తరలించారు. దీంతో వర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో మృతదేహన్ని ఉంచి ధర్నాకు దిగారు. గుంటూరుకు చెందిన వేముల రోహిత్ (27) సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఎన్ఆర్ఎస్ఐ వింగ్ హాస్టల్లో 207 నంబర్ రూమ్‌లో ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫ్యాన్‌కు కండువాతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయంత్రం స్నేహితులు ఎంతగా పిలిచినా తలుపు తీయకపోవడంతో వెంటిలేటర్ నుంచి చూడగా, రోహిత్ ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు మృతదేహాన్ని బయటకు వెళ్లనీయబోమంటూ విద్యార్థులు భీష్మించుకొని కూర్చున్నారు. ఆదివారం రాత్రి వరకు కూడా మృతదేహం హాస్టల్ ఆవరణలో ఉంది. పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. బహిష్కరణ వెనుక... గత ఆగస్టులో సుశీల్ కుమార్ అనే విద్యార్థి తన ఫేస్బుక్ ఖాతాలో అంబేడ్కర్ స్టూడెం ట్స్ అసోసియేషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. దానిపై అతనిని నిలదీయగా క్షమాపణ చెప్పారు. అనంతరం తనపై ఐదుగురు విద్యార్థులు దాడి చేశారంటూ సుశీల్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డిసెంబర్ 18న పీెహ చ్‌డీ విద్యార్థులు రోహిత్‌తోపాటు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సుంకన్నలను వర్సిటీ వీసీ సస్పెండ్ చేశారు. దీంతో వారంతా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ 14 రోజులుగా వర్సిటీలో ధర్నా చేస్తున్నారు. సోమవారం ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో రోహిత్ తీవ్ర మనోవేదనకు లోనయ్యారని తోటి విద్యార్థులు చెప్పారు. వీసీ పట్టించుకోవడం లేదని, రేపు ఎలా ఉంటుందో అని రోహిత్ ఆదివారం ఉదయం స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐదు పేజీల సూసైడ్ నోట్ ఆత్మహత్యకు పాల్పడే ముందు రోహిత్ ఐదు పేజీల సూసైడ్ నోట్ రాశారు. శరీరం, హృదయానికి ఘర్షణ జరుగుతుందని ఆనోట్లో పేర్కొన్నారు. మనిషిని మనిషిగా చూడటం లేదు, పుట్టుక తీరునే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలియడంతో వందలాది మంది విద్యార్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీసీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంఎల్సీ రాంచందర్‌రావులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టాలన్న డిమాండ్‌తో అన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో సోమవారం బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యత వహించి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని భద్రం డిమాండ్ చేశారు. వీసీని సస్పెండ్ చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) స్టీరింగ్ కమిటీ సభ్యులు మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ, ఓయూ జాక్ చైర్మన్ మానవతా రాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రాజీనామా బాటలో ఢిల్లీ ఐఐటీ డీన్లు!
న్యూఢిల్లీ: అకడమిక్ వ్యవహారాలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (హెచ్చార్డీ) జోక్యం చేసుకోవడంపై ఢిల్లీ ఐఐటీ సెనేట్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది. హెచ్చార్డీ తీరు మారకపోతే రాజీనామా చేస్తామని ఢిల్లీ ఐఐటీకి చెందిన ముగ్గురు డీన్లు హెచ్చరించారు. ఒక పార్ట్ టైం పీహెచ్డీ విద్యార్థిని అడ్మిషన్ ను రద్దుచేయడంపై పునరాలోచన చేయాలని ఢిల్లీ ఐఐటీ సెనేట్ ను హెచ్చార్డీ కోరింది. అలీషా తంగ్రీ అనే విద్యార్థిని తన ఉద్యోగ అనుభవం గురించి వాస్తవాలు దాచిపెట్టడంతో ఆమె అడ్మిషన్ ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తరఫున తండ్రి అలీషా తంగ్రీ పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ పై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం.. ఈ అంశాన్ని హెచ్చార్డీకి నివేదిస్తూ.. సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో ఈ పిటిషన్‌ను పరిష్కరించాల్సిందిగా కోరుతూ హెచ్చార్డీ .. ఢిల్లీ ఐఐటీ సెనేట్ కు పంపింది. దీనిని సెనేట్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఆ విద్యార్థిని పిటిషన్‌ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి లేదా ఐఐటీ డైరెక్టర్ కు నివేదించాల్సి ఉండాలని, అకడమిక్ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని సెనేట్ భావిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జోక్యాన్ని నిరసిస్తూ సెనేట్ లోని ఆరుగురు డీన్లలో ముగ్గురు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. దీంతో హెచ్చార్డీ, ఢిల్లీ ఐఐటీ మధ్య మరోసారి వివాదం తలెత్తే పరిస్థితి కనిపిస్తున్నది. -
విద్యావంతుడి విషాదాంతం
మంచాల, న్యూస్‌లైన్: ‘చదువుకున్నోడు, శాస్త్రవేత్త కావాల్సిన నా బిడ్డ శవమై వచ్చాడు..అయ్యో మాకేంటి ఈ గతి?’ అంటూ వెంకటేష్ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. వారిని ఓదార్చడం బంధువుల తరంకాలేదు. ఆదివారం నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి వెంకటేష్ బలవన్మరణంతో స్వగ్రామం మంచాల మండలం లింగంపల్లి శోకసంద్రమైంది. గ్రామానికి చెందిన మాదారి అంజయ్య, వెంకటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అంజయ్య రిటైర్డ్ ఏఎస్ఐ. వెంకటమ్మ గృహిణి. వీరి రెండో కుమారుడు వెంకటేష్(25) చురుకైన విద్యార్థి. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే అహర్నిషలు శ్రమించేవాడు. నగరంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. ఎంబీబీఎస్‌కు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని కొద్ది మార్కుల తేడాతో డాక్టర్ చదవలేకపోయాడు. దీంతో ఆయన జేఎన్టీయూలో పీజీ చదివాడు. అనంతరం సెంట్రల్ యూనివర్సిటీలో బయో కెమెస్ట్రీలో పీహెచ్‌డీలో చేరి ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్నాడు. తరచూ తనను గైడ్ రవి వేధిస్తున్నాడని వెంకటేష్ కుటుంబీకులతో చెబుతుండేవాడు. కాగా గ్రామంలో ఆదివారం రాత్రి వెంకటేష్ అంత్యక్రియలు నిర్వహించారు. శోకసంద్రమైన లింగంపల్లి.. వెంకటేష్ మృతితో కుటుంబీకులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఉన్నత లక్ష్యానికి చేరుకుంటాడనుకున్న వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం ఉదయం తనకు జేఎల్(జూనియర్ లెక్చరర్) పరీక్ష ఉందని, సెంటర్ వరకు తీసుకెళ్తానని చెప్పిన తమ్ముడు వెంకటేష్ అంతలోనే విగత జీవి అయ్యాడని అక్క రాణి గుండెలుబాదుకుంది. వెంకటేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.