హైదరాబాద్ : పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు ఇద్దరు బీజేపీ నేతలే కారణమని యూనివర్సిటీ అధ్యాపక సంఘం ఆరోపించింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు తమ పరిధులు దాటారని అధ్యాపక సంఘం వ్యాఖ్యానించింది. యూనివర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని యూనివర్సిటీ అధ్యాపక సంఘం తీవ్రంగా ఖండించింది.
యూనివర్సిటీ పాలనా విభాగం మొదటి నుంచీ తప్పులు చేస్తోందని, కమిటీలు విచారిస్తున్న తీరుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, విద్యార్థుల మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని, కేసులు విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు అంటూ వర్సిటీ విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రమంత్రితో పాటు వీసీ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.