న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటన, అనంతరం హెచ్సీయూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. అధికారులతో కూడిన బృందాన్ని హెచ్సీయూకు పంపారు. హెచ్సీయూ పరిణామాలపై కేంద్ర బృందం విచారించి మంగళవారం నివేదిక సమర్పించనుంది.
హెచ్సీయూ స్కాలర్ రోహిత్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్సీయూలో ఉద్రిక్తత నెలకొంది.
హెచ్సీయూకు కేంద్ర బృందం
Published Mon, Jan 18 2016 1:53 PM | Last Updated on Mon, Oct 22 2018 2:09 PM
Advertisement