'నా కొడుకు ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలి'
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలని అతని తల్లి రాధిక డిమాండ్ చేసింది. వీసీ సమాధానం చెప్పేవరకు తాను యూనివర్సిటీ నుంచి వెళ్లనని, వీసీ వచ్చే వరకు రోహిత్ మృతదేహానికి పోస్ట్మార్టమ్ చేయరాదని చెప్పింది. తాను టైలరింగ్ చేస్తూ తన కొడుకును చదివించానని, తన కొడుకుని సస్పెండ్ చేసి మనస్థాపానికి గురి చేశారని రాధిక కన్నీటిపర్యంతమైంది.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్థి రోహిత్ కలత చెంది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోహిత్ మృతదేహాన్ని తరలించకుండా విద్యార్థులు అడ్డుకోవడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో మృతదేహన్ని ఉంచి ధర్నాకు దిగారు. విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.