సాక్షి, న్యూఢిల్లీ : 'సార్ మీకు సభ్యత, సంస్కారం లాంటివి లేవు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా’ అంటూ వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌కి ఓ పీహెచ్‌డీ విద్యార్థిని ఈమెయిల్ చేసింది. ప్రొఫెసర్ ప్రవర్తన నచ్చకనే వర్సీటీ నుంచి తాను పారిపోయానని చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన ఓ 26 ఏళ్ల యువతి జేఎన్‌యూలో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తోంది. ఇటీవల ఆమె యూనివర్సిటీ నుంచి పారిపోయి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై విద్యార్థిని తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎ.కె.జోరి దురుసు ప్రవర్తన వల్లే యూనివర్సీటీని వదిలి వెళ్లాలని ఆ విద్యార్థిని లేఖ సారాంశం.
‘ గౌరవనీయులైన ప్రొఫెసర్ గారికి నమస్కారం. మీరు దేశంలోనే గొప్ప గైడ్ (నిర్దేశకుడు) అని అనుకుంటున్నారు. నేను కూడా మొదట్లో ఇలానే అనుకున్నా. మీరు మాకు గైడ్‌గా ఉండడం వరంగా భావించా. కానీ తర్వాత మీ నిజస్వరూపం తెలిసింది. మీకు సభ్యత, సంస్కారాలు తెలియవు. ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. నీ దురుసు ప్రవర్తన వల్లే నేను వర్సీటీ వదిలి వెళ్లాను. నాలాగ మరో అమ్మాయి బలి కాకుడదని అనుకుంటున్నాను. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితే రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. కనీసం అప్పుడైనా అమ్మాయిల బాధ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ మెయిల్ పంపింది.
కాగా ప్రొఫెసర్ ఎ.కె.జోరి తనపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తాను గత నెల 27న వరుసగా గైర్హాజరైన తొమ్మిమంది విద్యార్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపాను. ‘మీరు సరిగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా అయితే మీ పీహెచ్‌డీని పూర్తి చేయడం కష్టం. మీరు మరో ల్యాబ్‌ను చూసుకోండి’అని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అందరు విద్యార్థుల్లాగే రెగ్యులర్‌గా హాజరు కావాలని కోరానన్నారు. అందరితో ప్రవర్తించినట్లే ఆమెతోను వ్యవహరించానని తెలిపారు. ఆ విద్యార్థిని తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని ప్రొఫెసర్ ఎ.కె.జోరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment