
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లపై గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్‌లో అభ్యంతరకర వ్యాఖలు చేశాడు. ఈ మేరకు అధికారులు అక్టోబర్ 14న ఒక గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్ సీఎం, డిప్యూటీ సీఎంలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్లు ఫిర్యాదు అందినట్లు చెప్పారు. ఆ నిందితులు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ని ఉపయోగించి తాము ముంబై నుంచి కంటెంట్‌ని పోస్ట్ చేస్తున్నట్లుగా అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.
సైబర్ వింగ్ దర్యాప్తులో నిందితులు అహ్మద్‌నగర్ జిల్లాలోని రాహురిలో ఉన్న మహాత్మా ఫూలే వ్యవసాయం విశ్వవిద్యాలయం నుంచి వాటిని పోస్ట్ చేస్తున్నట్లు కనుగొన్నారు. దీంతో సైబర్ బృందం శనివారం ఆ విశ్వవిద్యాలయంలో దాడులు నిర్వహించగా... ఇద్దరు అనుమానితులను అదుపులోక తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించింది.
వారివద్ద ఉన్న మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పీహెచ్‌డీ విద్యార్థిని యూనివర్సిటీ నుంచి అదుపులోకి తీసుక్నుట్లు తెలిపారు. ఐతే ట్విట్టర్‌లో ఇలాంటి కంటెంట్‌లను రూపొందించడానికి ఎవరి సాయమైనా తీసుకున్నారేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment