objectionable post
-
సీఎం, డిప్యూటీ సీఎంలపై ట్విట్టర్లో అసభ్య వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్లపై గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్లో అభ్యంతరకర వ్యాఖలు చేశాడు. ఈ మేరకు అధికారులు అక్టోబర్ 14న ఒక గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్ సీఎం, డిప్యూటీ సీఎంలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్లు ఫిర్యాదు అందినట్లు చెప్పారు. ఆ నిందితులు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని ఉపయోగించి తాము ముంబై నుంచి కంటెంట్‌ని పోస్ట్ చేస్తున్నట్లుగా అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ వింగ్ దర్యాప్తులో నిందితులు అహ్మద్‌నగర్ జిల్లాలోని రాహురిలో ఉన్న మహాత్మా ఫూలే వ్యవసాయం విశ్వవిద్యాలయం నుంచి వాటిని పోస్ట్ చేస్తున్నట్లు కనుగొన్నారు. దీంతో సైబర్ బృందం శనివారం ఆ విశ్వవిద్యాలయంలో దాడులు నిర్వహించగా... ఇద్దరు అనుమానితులను అదుపులోక తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. వారివద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పీహెచ్డీ విద్యార్థిని యూనివర్సిటీ నుంచి అదుపులోకి తీసుక్నుట్లు తెలిపారు. ఐతే ట్విట్టర్లో ఇలాంటి కంటెంట్లను రూపొందించడానికి ఎవరి సాయమైనా తీసుకున్నారేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం) -
ఎమ్మెల్యే రోజాపై అసభ్య పోస్టింగ్‌లు.. ఫిర్యాదు
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే.రోజాతో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు, పార్టీ మహిళా కార్యకర్తలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఒక ఫిర్యాదును రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ రవిశంకర్‌కు గురువారం అందజేశారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళా నేతలపై అభ్యంతరకరమైన దూషణలతో కూడిన పోస్టింగ్‌లు పెట్టడం అవమానకరమని పేర్కొన్నారు. అసభ్య పోస్టులు పెట్టే వారిని గుర్తించి శిక్షించాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన అదనపు డీజీపీ నిందితులు ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల మహిళా విభాగం సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, ఏపీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, ఇతర నేతలు జమ్మలమడక నాగమణి, బొట్టా కనకదుర్గ ,సుధారాణి, హిమబిందు, అనిత, శ్రీలక్ష్మీ, విజయలక్ష్మి ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు. -
దేవెగౌడపై అభ్యంతరకర వీడియో : ఇద్దరి అరెస్ట్
బెంగళూర్ : మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడతో పాటు ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తూ అభ్యంతరకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి జేడీ(ఎస్)లో కుటుంబ రాజకీయాలే కారణమని నిందించేలా ఈ వీడియోలను పోస్ట్ చేశారని చెప్పారు. జేడీ(ఎస్) నేత ఫిర్యాదుపై నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని తెలిపారు. కాగా నిందితులు ఆ పార్టీ కార్యకర్తలేనని వీరిని పెట్రోల్ పంప్లో పనిచేసే సిద్దరాజు, క్యాబ్ డ్రైవర్ చామరాజులుగా గుర్తించామని తెలిపారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకర పోస్ట్‌లను షేర్ చేశారంటూ ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తింది. ఇది నెటిజన్ల స్వేచ్ఛను హరించడమేననే వాదన ముందుకొచ్చింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను తక్షణమే విడుదల చేయాలని యూపీ పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది. -
ఉగ్రదాడిపై అభ్యంతరకర ట్వీట్
లక్నో : పుల్వామా ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తమవుతుంటే జైషే దాడిని సమర్ధిస్తూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్ధి ట్విటర్లో చేసిన అభ్యంతరకర పోస్ట్ వివాదాస్పదమైంది. ఏఎంయూలో బీఎస్సీ మేథమేటిక్స్ అభ్యసిస్తున్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన బాసిం హిలాల్ ట్విటర్లో చేసిన పోస్ట్‌పై వర్సిటీ తీవ్రంగా స్పందించింది. ఏఎంయూ ఫిర్యాదు నేపథ్యంలో హిలాల్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అభ్యంతరకర పోస్ట్ చేసిన విద్యార్ధిని సస్సెండ్ చేస్తున్నట్టు ఏఎంయూ వెల్లడించింది. జైషే దాడి ఎలా ఉంది..? గ్రేట్ సర్. అంటూ హిలాల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్‌ను హిలాల్ తర్వాత తొలగించినా అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
మహిళా ఎంపీపై అభ్యంతరకర ట్వీట్లు, కేసు నమోదు
థానే : ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలేకి వ్యతిరేకంగా మైక్రో-బ్లాగింగ్ సైటులో అభ్యంతరకర ట్వీట్లు పోస్టు చేయడంతో ఓ ట్విట్టర్ యూజర్‌పై కేసు నమోదైంది. ఎన్సీపీ ఎంఎల్ఏ జితేంద్ర అవధ్ద్ నమోదుచేసిన ఫిర్యాదు మేరకు వర్తక్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు రిజిస్ట్రర్ అయింది. ఎన్సీపీ నేత సుప్రియ సూలేపై ఓ ట్విట్టర్ యూజర్ అభ్యంతరకర పోస్టులు చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు. ఐపీసీ సెక్షన్స్ 354(డీ), 509(పదం, సంజ్ఞ లేదా చట్టం ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా ఒక మహిళ వినయాన్ని అవమానపరచడం), 500(పరువునష్టం), ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద ఈ విషయంపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఆమె ట్విట్టర్ అకౌంట్‌పై నిందితుడు అభ్యంతరకర ట్వీట్లను పోస్టు చేసినట్టు ఫిర్యాదులో అవద్ద్ చెప్పారు. సూలేకి వ్యతిరేకంగా చేసిన ఈ ట్వీట్ల వల్ల ఎన్సీపీ నేతల మనోభావాలు దెబ్బతిన్నాయని లిజిస్లేటర్ పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు సూలే కూతురు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని బారమతి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఏడుగురిపై కేసు
ఒక మతాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలను ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఏడుగురు యువకులపై కేసు నమోదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ ప్రాంతంలో జరిగింది. ఐపీసీ సెక్షన్లు 153 బి, 295ఎ, 504తో పాటు ఐటీ చట్టం కింద ఈ కేసులు నమోదు చేశారు. విపుల్ సింగ్ అనే వ్యక్తి ఈ పోస్ట్ రాయడంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 20వ తేదీన విపుల్ సింగ్ ఫేస్బుక్ అకౌంటులో ఈ కామెంట్లు పోస్ట్ చేయగా, మిగిలిన ఆరుగురు దాన్ని లైక్ చేయడమో, కామెంట్లు పెట్టడమో చేశారని ఏఎస్పీ దినేష్ త్రిపాఠీ చెప్పారు. బీఎస్పీ నాయకుడి నేతృత్వంలోని ఓ వర్గం సభ్యులు కొత్వాలీ పోలీసు స్టేషన్‌కు చేరుకుని నినాదాలు చేస్తూ విపుల్ సింగ్ ఫేస్బుక్ కామెంట్లపై ఫిర్యాదు చేశారు. వెంటనే వివిధ స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.