
లక్నో : పుల్వామా ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తమవుతుంటే జైషే దాడిని సమర్ధిస్తూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్ధి ట్విటర్‌లో చేసిన అభ్యంతరకర పోస్ట్ వివాదాస్పదమైంది. ఏఎంయూలో బీఎస్సీ మేథమేటిక్స్ అభ్యసిస్తున్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన బాసిం హిలాల్ ట్విటర్‌లో చేసిన పోస్ట్‌పై వర్సిటీ తీవ్రంగా స్పందించింది.
ఏఎంయూ ఫిర్యాదు నేపథ్యంలో హిలాల్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అభ్యంతరకర పోస్ట్ చేసిన విద్యార్ధిని సస్సెండ్ చేస్తున్నట్టు ఏఎంయూ వెల్లడించింది. జైషే దాడి ఎలా ఉంది..? గ్రేట్ సర్. అంటూ హిలాల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్‌ను హిలాల్ తర్వాత తొలగించినా అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment