ముంబయి:అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెలలు గడిచిన తర్వాత కూడా మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌షిండే గైర్హాజరయ్యారు. గత వారం కూడా క్యాబినెట్ భేటీకి షిండే హాజరు కాలేదు.
సీఎం పదవి దక్కకపోవడం,ఇంఛార్జ్ మంత్రుల నియామకాలపై అసంతృప్తితో ఉండడం వల్లే షిండే వరుసగా సీఎం సమావేశాలకు రావడంలేదన్న ప్రచారం జరుగుతోంది. సీఎం ఫడ్నవీస్‌తో విభేదాల వల్లే షిండే సమావేశాలకు రావడం లేదన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే షిండే సీఎం ఫడ్నవీస్‌తో సమావేశాలకు గైర్హాజరవడంపై శివసేన ఎంపీ నరేష్ మస్కే క్లారిటీ ఇచ్చారు. షిండే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేదు. ఇందుకే సీఎంతో సమావేశాలకు రాలేదు.ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వారే దీనిపై లేనిపోనివి కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు’అని మస్కే తెలిపారు.
గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ(అజిత్‌పవార్) పార్టీల మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తర్వాత శివసేన అధినేత అప్పటి సీఎం షిండే కూడా మళ్లీ తనకు ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే సీఎం పదవి బీజేపీకి వెళ్లడంతో డిప్యూటీ సీఎం పదవితో సర్దుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment