
గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీపై దాడులు
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి సరఫరా చేస్తున్న 8మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. కళాశాల విద్యార్థులతో పాటు బయటి వ్యక్తులకు వీరు గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ దాడులు చేశారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను ఇబ్రహీంపట్నం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.