Amravati Master Plan
-
రాజధాని కోసం రూ.37,112 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) రూ. 55,343 కోట్లతో రూపొందించిన సమగ్ర ఆర్థిక ప్రణాళికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధానిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.51,867 కోట్లు వ్యయం అవుతుందని.. ఇందులో రూ. 37,112 కోట్లను అప్పుగా తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న సీఆర్డీఏ ప్రతిపాదనకు అంగీకరించింది. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులను తనఖా పెట్టడం ద్వారానూ.. పబ్లిక్ బాండ్స్ ద్వారానూ రూ. 500 కోట్లను సేకరించడానికి సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. పబ్లిక్ బాండ్స్ ద్వారా సేకరించే రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి మంత్రివర్గం అంగీకరించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం మంత్రివర్గం సమావేశ మైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకుంది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, సంస్థాగత అభివృద్ధి పథకానికి 715 మిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ రుణం(ఈఏపీ) తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. రాజధానిలో సచివాలయం, శాఖాధిపతుల (హెచ్ఓడీ) కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన రూ.4,900 కోట్ల నిధుల సమీకరణకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. కేసుల ఎత్తివేత.. ఖైదీలకు క్షమాబిక్ష.. సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. పోలవరం, వంశధార ప్రాజెక్టుల నిర్వాసితులపై పెట్టిన కేసులనూ ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 33 మంది ఖైదీలకు విముక్తి కల్పించడానికి ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాలు ►వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత, ఒంటరి మహిళ, మత్స్యకారులు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, 40 నుంచి 79 శాతం అంగ వైకల్యం గల వారికి ఇస్తున్న రూ. వెయ్యి పెన్షన్‌ను రూ. 2 వేలకు పెంచాలని నిర్ణయించింది. 80 శాతం పైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు పెన్షన్ రూ.1,500 నుంచి రూ.3,000లకు పెంపు. కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటున్న వారికి పెన్షన్ రూ. 2500 నుంచి రూ. 3500లకు పెంపు. ► ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అదనంగా మరో 3.55 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతూ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వులపై ఆమోదముద్ర. ► పసుపు కుంకుమ–2 పథకం కింద అదనంగా రూ. పది వేలు మంజూరుకు ఆమోదం. ► నాయీ బ్రాహ్మణుల హెయిర్ కటింగ్ సెలూన్లకు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్. ► చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు బ్యాంకు రుణాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంచినీటి సరఫరా సంస్థకు రూ. 1,765 కోట్లు మంజూరు. ►తొమ్మిది జిల్లాలలో తారు (బిటి) రోడ్ల నిర్మాణం, పునర్నిర్మాణం, మరమ్మతు పనులకు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాల ద్వారా రూ.1500 కోట్లు పొందడానికి అనుమతి. ► పెట్రోల్, డీజిల్ ధరల ఎక్సైజ్ డ్యూటీ నుంచి 2 శాతం పన్ను తగ్గిస్తూ లోగడ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వ్యాట్ చట్టంలో సవరణల్ని ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లు ముసాయిదాకు ఆమోదం. ► ‘భూధార్’ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించేందుకు అవసరమైన సవరణ బిల్లు ముసాయిదాకు ఆమోదం. ► రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన 2092 మంది ఉద్యోగులకు తిరిగి నియామకానికి ఆమోదం. ►కర్నూలు జిల్లా బనవాసిలో ఉన్న మేకలు, గొర్రెలు పరిశోధన కేంద్రంలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది మంజూరుకు ఆమోదం. ► విశాఖలో ఐటీ పార్కు అభివృద్ధికి భీమునిపట్నం కాపులుప్పాడలో 76.88 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. ► కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో ఎకరా రూ.2.5 లక్షల చొప్పున 2,467.28 ఎకరాల భూమి గ్రీన్కో ఎనర్జీస్ సంస్థకు కేటాయింపు. ► కర్నూలు జిల్లా పెట్నికోటలో ఎకరా రూ.3,60,000 విలువకు 6.72 ఎకరాల భూమి ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి కేటాయింపు. ►సహకార చక్కెర కర్మాగారాలకు షరతులు లేకుండా రూ.200 కోట్ల రుణ సేకరణకు ఆమోదం. ► విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల గ్రామ పరిధిలో భారత మహిళా ఔత్సాహిక పారిశ్రామికేవేత్తల సంఘానికి 55 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. -
అంతా కుతంత్రం!
► రాజధాని నుంచి స్వరాజ్యమైదానం వరకు సర్కారు ‘మంత్రాం’గం ► రాజధాని నిర్మాణం జపాన్ చేతికి ► విజయవాడ స్క్వేర్ పేరుతో డ్రాగన్ పాగా ► చివరకు పుష్కర ఘాట్లు కూడా చైనా కంపెనీకే ► విస్తుపోతున్న రాజధాని ప్రాంత వాసులు వ్యాపారం కోసం వచ్చి మన సంపదను కొల్లగొట్టుకుపోయి.. మనల్ని బానిసలుగా చేసి చిత్రహింసలకు గురిచేసిన తెల్లదొరలను పడమర దారి పట్టించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రస్తుత పాలకుల తీరుతో మరోమారు వ్యాపారం కోసం పలు దేశాలు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కన్నేశాయి. ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధిలోనూ వారు పెట్టుబడుల రూపంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాజధానితో మొదలైన విదేశీ మంత్రం చివరకు స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించిన స్వరాజ్యమైదానాన్ని పరాయివారికి కట్టబెట్టే వరకు వెళ్లింది. సాక్షి, విజయవాడ బ్యూరో : చంద్రబాబు గత పాలనలో అంతా హైటెక్ నామస్మరణం చేస్తే ఇప్పుడు విదేశీ తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ నుంచి రాష్ట్రంలో ఏ చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా అంతా విదేశీ కార్పొరేట్ శక్తు విదేశీ పెత్తనం పెరిగిపోవడంతో పాటు వాటిలో సేవలు పొందాలంటే మనం నేరుగా పన్నులు చెల్లించాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఇలాగే వదిలేస్తే క్రమంగా విదేశీ కార్పొరేట్ల కబంధహస్తాల్లో చిక్కి మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అగత్యం వచ్చినా ఆశ్ఛర్యం లేదు. సింగపూర్ అన్నారు.. జపాన్‌కు కట్టబెడుతున్నారు.. అమరావతి రాజధానిని సింగపూర్ ప్రభుత్వం అద్భుతంగా నిర్మించనుందని చంద్రబాబు సర్కారు ఏడాది పాటు ఊదరగొట్టింది. గ్రాఫిక్స్‌తో రూపొందించిన చిత్రాలను విడుదల చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సింగపూర్‌తో ‘డీల్’ కుదరలేదేమో.. చివరకు నిర్మాణ బాధ్యతలు జపాన్‌కు అప్పగించే ప్రయత్నాలకు తెరలేచింది. సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్‌ప్లాన్ ఉచితంగా ఇస్తున్నట్టు తొలుత ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అటు తరువాత అందుకు కోట్లాది రూపాయలు పారితోషికంగా చెల్లించింది. అమరావతి రాజధాని నిర్మాణం సింగపూర్ ప్రభుత్వం చేపడుతుందని ఒకసారి, అటు తరువాత సింగపూర్‌లోని సంస్థ అని మరోసారి ప్రకటనలు చేసిన ప్రభుత్వం వారు పెట్టిన షరతులతో చేతులెత్తేసి జపాన్ వైపు దృష్టిపెట్టింది. ఇటీవల జపాన్‌కు చెందిన మాకీ సంస్థ అమరావతి భవనాల డిజైన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జపాన్‌కు చెందిన మాకీ సంస్థ టోక్యో నగరం మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో జపాన్ వాణిజ్య మంత్రి టాకాగి నాయకత్వంలోని 80 మందితో కూడిన ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. భవిష్యత్‌లో టోక్యో నుంచి నేరుగా అమరావతికి వచ్చేలా విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని, ఇది వారికి రెండో రాజధానిగా భావించాలని ముఖ్యమంత్రి చెప్పడం గమనార్హం. స్వరాజ్య మైదాన్ అప్పగింతపై సర్వత్రా నిరసనలు... స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించిన స్వరాజ్యమైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్)ను డ్రాగన్ (చైనా)కు అప్పగించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో చారిత్రాత్మకమైన విశాల స్థలాన్ని విదేశీ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో విజయవాడ స్క్వేర్ నమూనాలను చైనాకు చెందిన జీఐఐసీ సంస్థ రూపొందించిన నమూనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రూ.135 కోట్ల ఖర్చుతో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్, ఎంటర్టైన్మెంట్ గేమ్స్, ఎగ్జిబిషన్లు, భవనాలు, పార్కింగ్ ఏరియా నిర్మాణాలను చైనా సంస్థకే కట్టబెట్టే ప్రయత్నాల వెనుక ఏం జరిగిందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. స్క్వేర్ నిర్మాణంలో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడబోదని అధికారులు ప్రకటించడం వెనుక అసలు ఆంతర్యం ఇదే. అంటే చైనా సంస్థకు అప్పనంగా భూమి ఇచ్చి పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టి దానిపై ఆదాయం ఆ సంస్థ వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఇదో విహార కేంద్రంగా తీర్చిదిద్దినప్పటికీ పర్యాటకులపై ట్యాక్స్ రూపంలో బాదుడు తప్పదు. అధికారులు చెబుతున్న మాటలు ఇప్పుడు జనాన్ని మభ్యపెట్టడానికే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్కర ఘాట్లకూ చైనా నిపుణులే.. ‘నవ్విపోదురు గాక నాకేటి..’ అన్నట్టు ఉంది ప్రభుత్వ యంత్రాంగం తీరు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి సరిపడే డిజైన్లు ఇచ్చే సామర్థ్యం ఉన్న ఇంజనీర్లు, నిపుణులు రాష్ట్రంలో లేరని తేల్చేసిన సర్కారు కనీసం పుష్కర ఘాట్లను నిర్మించే నైపుణ్యం కూడా మనకు లేదని చెప్పకనే చెప్పింది. కృష్ణా పుష్కరాల్లో అద్భుతమైన ఘాట్లు, నిర్మాణాలు చేపట్టే పేరుతో పలు పనులను చైనాకు చెందిన జీఐఐసీ సంస్థకు అప్పగించడం గమనార్హం. 10 మీటర్ల వెడల్పు, నాలుగు అడుగుల లోతుతో స్నానఘాట్ల నిర్మాణం, ఇతర కట్టడాలకు చైనా సంస్థకు ప్రాధాన్యం ఇవ్వడం చూస్తే స్వదేశీ పరిజ్ఞానం, నైపుణ్యంపై పాలకులకు కనీస నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది. -
చతుర్ముఖ వ్యూహం
రాజధాని కేంద్ర ప్రాంతం నిర్మాణానికి చతుర్ముఖ వ్యూహంతో కూడిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. 1. ప్రధాన పరిపాలన కేంద్రం 2. అమరావతి డౌన్‌టౌన్ (ప్రధాన వాణిజ్య కేంద్రం) 3. అమరావతి గేట్‌వే (అమరావతి ముఖద్వారం) 4. అమరావతి వాటర్ ఫ్రంట్(అమరావతి నదీ ముఖం)గా రాజధాని కేంద్ర ప్రాంతాన్ని విభజించారు. 1. అమరావతి ప్రధాన పరిపాలన కేంద్రం (అమరావతి గవర్నమెంట్ కోర్) ఇది అమరావతి రాజధాని నగరంలో అత్యంత కీలకమైనది. ప్రధాన పరిపాలన కేంద్రాన్ని లింగాయపాలెం సమీపంలో నిర్మించాలని ప్రతిపాదించారు. శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ గృహాలు, ప్రాంతీయ వైద్య శాలలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, నగర గ్యాలరీలను ఈ కేంద్రంలో నిర్మిస్తారు. కార్యాలయాలకు ఉద్యోగులు సులభంగా వెళ్లడానికి వీలుగా ప్రత్యేక నడక, సైకిల్ మార్గాలు, 100 మీటర్ల వెడల్పుతో కూడిన సువిశాలమైన రహదారులు, మెట్రో రైలు మార్గాలు నిర్మిస్తారు. 2. అమరావతి డౌన్‌టౌన్ (ప్రధాన వాణిజ్య కేంద్రం) రాజధాని నగరంలో ప్రధానమైన వాణిజ్య కేంద్రం ఇది. ఉద్దండరాయనిపాలెం సమీపంలో ప్రధాన వాణిజ్య కేంద్రాన్ని నిర్మిస్తారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం భారీ భవంతులను నిర్మిస్తారు. వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లను ఏర్పాటుచేస్తారు. 3. అమరావతి గేట్‌వే (అమరావతి ముఖద్వారం) రాజధాని అమరావతికి ఇది ముఖద్వారం. తాళ్లాయపాలెం అమరావతికి ముఖద్వారం కానుంది. కృష్ణా నదిపై తాళ్లాయపాలెం సమీపంలో అత్యాధునిక హంగులతో వారధిని నిర్మిస్తారు. గన్నవరం విమానాశ్రయం, విజయవాడ నుంచి 30 నిమిషాల్లోగా రాజధాని ప్రధాన కేంద్రానికి చేరుకునేలా ఈ వారధి మీదుగా రహదారిని నిర్మిస్తారు. తాళ్లాయపాలెం వద్ద రాజధాని ప్రత్యేకతను చాటిచెప్పేలా ఐకానిక్ టవర్లను నిర్మిస్తారు. ముఖద్వారాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, వినోదం కోసం చిత్తడి నేలలతో కూడిన ఉద్యానవనం(వెట్‌ల్యాండ్ పార్క్)ను ఏర్పాటు చేయనున్నారు. 4. అమరావతి వాటర్‌ఫ్రంట్ (అమరావతి నది ముఖం) రాజధాని ప్రజల వాణిజ్య, వినోద కార్యకలాపాల కోసం అమరావతి నది ముఖంను నిర్మించనున్నారు. ఉద్దండరాయనిపాలెం, తాళ్లాయపాలెం మధ్యలో వాటర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రాజధానికి వచ్చే ప్రజలకు వినోదం పంచేలా నది ముఖాన్ని తీర్చిదిద్దనున్నారు. కన్వెన్షన్ సెంటర్, ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్, అమరావతి ప్లాజా, సాంస్కృతిక, కళా కేంద్రాలు నె లకొల్పనున్నారు. మౌలిక సదుపాయాల కల్పన ఇలా.. * అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మెరుగైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేలా అమరావతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. * తాగునీరు:ప్రజల అవసరాలకు రోజుకు 95.7 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం అవుతాయని అంచనా. అందుకు పులిచింతల ప్రాజెక్టు, కొండవీటి వాగుపై రిజర్వాయర్లు నిర్మించనున్నారు. 24 గంటల విద్యుత్: సీడ్ కేపిటల్‌కు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి 398.5 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఈ విద్యుత్‌ను సీడ్ కేపిటల్‌కు సరఫరా చేయడానికి వివిధ కెపాసిటీల్లో సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. సరఫరాకుభూమిలో(అండర్‌గ్రౌండ్) కేబుల్ వేస్తారు. రవాణా సదుపాయం: సీడ్ కేపిటల్లో 88 కిమీల పొడవున రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. -
దందాయే ‘రియల్’ ప్లాన్
రాజధాని నిర్మాణంలో లక్ష కోట్ల వ్యాపారం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి సప్తవర్ణాల ఆకాశ హర్మ్యాలతో సింగపూర్ గీసిన చిత్రాల వెనుక.. రైతుల భూములు పెట్టుబడిగా పెట్టి లక్ష కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్న ప్రణాళిక విస్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిగా నామకరణం చేసిన కొత్త రాజధాని నిర్మాణం.. మాస్టర్ ప్లాన్, మాస్టర్ డెవలపర్ దశలను దాటి ఇప్పుడు మాస్టర్ మైండ్ దశకు చేరుకుంది. రాజధానిలో ప్రభుత్వ భవనాలకు కేవలం 2,000 ఎకరాలు చాలని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. మరైతే.. ఆ ప్రాంతంలోని అమాయక రైతుల నుంచి సమీకరించిన, ప్రభుత్వ అధీనంలో ఉన్న, స్వాధీనం చేసుకోబోతున్న 57,000 ఎకరాల భూములతో ఏం చేయనున్నారు? * మాస్టర్ ప్లాన్ - మాస్టర్ డెవలపర్ వెనుక మాస్టర్ మైండ్ ఇదే * భూములు సింగపూర్ రియల్ సంస్థలకు ధారాదత్తం * రాజధానికి 2,000 ఎకరాలు సరిపోతాయన్న సీఎం * 50 వేల ఎకరాల సమీకరణ, సేకరణ ఎందుకు? * అన్నీ పోగా సర్కారు చేతిలో 25 వేల ఎకరాలు * ప్రస్తుతం ఎకరం రూ. 2 కోట్లు చొప్పున 50 వేల కోట్లు * పభుత్వం చెబుతున్నట్లుగా త్వరలో రెండు రెట్లు పెరిగినా మొత్తం లక్ష కోట్లు * ‘అభివృద్ధి’కి కట్టబెట్టి.. అత్యధిక వాటా ఇవ్వనున్న సర్కారు సర్కారు చేతిలో 25 వేల ఎకరాలు... రాజధానికి ఎంపిక చేసిన 29 గ్రామాల్లో మొత్తం 57,000 ఎకరాలకు పైగా భూములు ఉంటే.. రైతుల నుంచి 33,400 ఎకరాల పట్టా భూములు సమీకరించినట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక అటవీ, డొంక, పోరంబోకు, దేవాదాయ, అసైన్డ్ తదితర భూములన్నీ కలిపి మరో 18,116 ఎకరాలు సర్కారు అధీనంలోనే ఉన్నాయి. మొత్తం కలిపితే ప్రభుత్వ స్వాధీనంలో 51,516 ఎకరాల భూములు ఉన్నట్లు లెక్కతేలుతోంది. ఇందులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం 9,144 ఎకరాలను (అభివృద్ధి చేసిన తర్వాత) తిరిగి రైతులకు ఇస్తారు. మిగిలిన 42,372 ఎకరాల్లో 40 శాతం(16,950 ఎకరాలు) మౌలిక సదుపాయాల కల్పన పేరుతో తీసివేసినా ఇంకా 25,423 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇక రైతుల చేతుల్లోనే ఉన్న మరో 5,000 ఎకరాలను భూ సేకరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది. రాష్ట్ర రాజధానికి భూమి పూజ చేసిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తామన్న తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయనీ, కోట్లల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. ఈ రోజు ఆ ప్రాంతంలో ఉన్న ధర ఎకరా కోటి నుంచి రెండు కోట్లకు పై మాటగా ప్రభుత్వమే చెప్తోంది. ఇప్పుడున్న ధర ప్రకారం 25 వేల ఎకరాలంటే 50 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు సర్కారు చేతిలోకొచ్చినట్టు. ఇంకో ఏడాది ఆగితే ధర రెండు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న వారు లెక్కలేశారు. ఆ లెక్కన వేసుకున్నా ప్రభుత్వం చేతిలో ఉన్న భూముల ధర ఒక లక్ష కోట్ల రూపాయలు దాటిపోతోందన్నది నిజం. మరి ఆ భూములను ఏం చేస్తారంటే.. ‘అభివృద్ధి’ ముసుగులో విదేశీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ధారాదత్తం చేయబోతున్నారు. ఇక పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో కృష్ణా నదికి ఎగువ భాగాన మరో 10,000 ఎకరాలను సమీకరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించటం వేరే విషయం. ‘స్విస్ చాలెంజ్’లో వేరే సంస్థలు రాగలవా? రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ విధానంలో ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందు ఒక ప్రణాళికను రూపొందిస్తారు. దానిమేరకు మాస్టర్ డెవలపర్లను ఆహ్వానిస్తారు. కానీ.. పెద్దపెద్ద ప్రాజెక్టులు, సెజ్‌లు లేదా ఇలాంటి రాజధాని నిర్మాణం వంటి ప్రాజెక్టుల్లో.. మాస్టర్ ప్లాన్ రూపొందించిన సంస్థలే ఆ ప్రాజెక్టును ఏ మేరకు చేపట్టవచ్చన్న అవగాహన కలిగి ఉంటాయి. ఇప్పుడు సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఏ జర్మనీ లేదా ఆస్ట్రేలియా కంపెనీలు మాస్టర్ డెవలపర్‌గా రావడానికి ఇష్టపడవు. సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాబట్టి బయటి సంస్థలు పెద్దగా ఆసక్తి కనబరచవు. సింగపూర్ కంపెనీల కన్షార్షియం... అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఇన్కార్ప్) సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఐఈ-సింగపూర్)తో గత డిసెంబర్ 8వ తేదీన ఒప్పందం జరిగింది. ఆ సంస్థ.. మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యతను ఆ దేశంలోని కార్పొరేట్ సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ హోల్డింగ్స్ (సుర్బానా), జురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (జురాంగ్) సంస్థలకు అప్పగించింది. ఆ సంస్థలేమో.. రాజధాని ప్రాంత ప్రణాళిక (కేపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్), రాజధాని నగర ప్రణాళిక (కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్), సీడ్ కేపిటల్ డెవలప్మెంట్ ప్లాన్ పేరుతో మూడు ప్రణాళికలుగా విడదీసి అందించాయి. ఇప్పుడిక ఆయా మాస్టర్ ప్లాన్లలో చూపించిన చోట ఆయా నిర్మాణాలు చేపట్టడానికి, వాటికి అవసరమైన సంస్థలను ఆహ్వానించడానికి వ్యవహార కర్తగా ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ వ్యవహార కర్తే ‘మాస్టర్ డెవలపర్’. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికే ఏడు మాసాలు కసరత్తు చేసిన సింగపూర్ కార్పొరేట్ దిగ్గజాలకు మాత్రమే ఇందులోని లోగుట్టు అర్థమవుతుంది. రాజధాని ప్రాంతంలోని నేల పరిస్థితుల నుంచి నదీ ప్రవాహం, భూముల సమీకరణ, నిర్మాణాల వంటి అనేక విషయాల్లో ఎప్పటికప్పుడు సమగ్రమైన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు అందించింది. ఇప్పుడు రాజధాని లోగుట్టు ఆ సంస్థలకే తెలుసు కనుక మాస్టర్ డెవలపర్‌గా స్విస్ చాలెంజ్ విధానానికి అవే ముందుకొస్తాయి. సుర్బానా, జురాంగ్‌లు పరస్పర సహకారంతో మాస్టర్ ప్లాన్లు రూపొందించగా.. మాస్టర్ డెవలపర్‌గా రంగంలోకి దిగేందుకు రెండు సంస్థలు ఒక్కటయ్యాయి. అలాగే.. సింగపూర్‌లో మరో రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థ అసెండాస్ మాస్టర్ డెవలపర్‌గా కూడా ఆసక్తి చూపింది. ఆ దేశానికే చెందిన మరో సంస్థ సింగ్‌బ్రిడ్జి గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే అసెండాస్‌లో విలీనమైంది. అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్ ప్రతినిధి ఏపీ రాజధాని నిర్మాణానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని గత వారం సింగపూర్‌లో ప్రకటించారు. సింగపూర్ కంపెనీలకు భారీ వాటాలు... హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ సంస్థలు కార్యాలయాల కోసం చంద్రబాబు అప్పట్లో ఒక హైటెక్ సిటీ పేరుతో మాదాపూర్‌లో ఒక భవనం నిర్మించారు. ఆ భవన నిర్మాణ పనిని.. టీడీపీ ప్రధాన కార్యాలయం నడుస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనాన్ని నిర్మించి ఇచ్చిన ఎల్ అండ్ టీ కంపెనీకి అప్పగించారు. ఏపీఐఐసీ కేటాయించిన స్థలంలో హైటెక్ సిటీ నిర్మించారు. నిర్మించినందుకు ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం అందులో 89 శాతం వాటా ఇచ్చింది. ఉచితంగా నీరు, విద్యుత్ సమకూర్చడమే కాకుండా అనేక రాయితీలు ఇచ్చింది. భూమి ఇచ్చిన ఏపీఐఐసీకి అందు లో వాటా 11 శాతమే. ఆ భవనంపై సర్వహక్కులూ ఎల్ అండ్ టీ సంస్థవే. సరిగ్గా ఇప్పుడు ఇదే పద్ధతిలో అమరావతి రాజధాని నిర్మాణం జరగబోతోంది. రైతుల నుంచి ఉచితంగా భూములు తీసుకుని ఆ భూములను పూర్తిగా మాస్టర్ డెవలపర్‌కు అప్పగిస్తారు. ఆ మాస్టర్ డెవలపర్ తాను పిలుచుకున్న సంస్థకు ఒక్కో ప్రాజెక్టును కట్టబెడతారు. ఇప్పుడు ప్రభుత్వం గంపగుత్తగా మాస్టర్ డెవలపర్‌కు వాటా ఇస్తుందా? లేదా ఒక్కో కంపెనీకి ఒక్కో ప్రాజెక్టుపై వాటా(భూములు) ఇస్తుందా? తేలాల్సి ఉంది. రైతుల భూములే పెట్టుబడిగా... రాజధాని కోసం నిధులు లేవని పదే పదే చెప్తున్న చంద్రబాబు.. అక్కడ నిర్మించే ప్రభుత్వ భవనాల కోసం మొత్తం రూ. 12,356 కోట్లు వ్యయం అంచనా వేసి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. అందులో కేంద్రం ఇప్పటికే రూ. 1,500 కోట్లు విడుదల చేసిందని కూడా ఆయన ప్రకటించారు. నిర్మాణ క్రమంలో ఒత్తిడి చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశముంది. కానీ.. రాజధాని నిర్మాణం, అభివృద్ధికి డబ్బులు లేవన్న కారణం చెప్తూ.. ఆయా కంపెనీలకు భూములు ఇచ్చి నిర్మాణం చేయించే ప్రణాళిక పేరుతో ఈ రియల్ దందా మొదలుకాబోతోంది. సాధారణంగా.. నగరంలో ఒక వ్యక్తికి 500 గజాల స్థలం ఉంటే దాంట్లో అపార్ట్మెంట్ నిర్మిస్తామని ఎవరైనా బిల్డర్ ముందుకొస్తే (హైదరాబాద్ లాంటి ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల్లో) నిర్మించిన దానిలో 50 శాతం బిల్డర్‌కు మరో 50 శాతం స్థలం యజమానికి చెందేలా ఒప్పందాలు చేసుకుంటారు. ఆయా నగరాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి ఈ ఒప్పందాల్లో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. కానీ.. రాజధానిలోని ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీకి కట్టబెడితే అందులో హైటెక్ సిటీ తరహాలో నామమాత్రం వాటా ప్రభుత్వం ఉంచుకుని మిగిలిన భూమిని కంపెనీకి ధారాదత్తం చేయనున్నారు. అయితే 30:70 (ప్రభుత్వం 30 శాతం, కంపెనీ 70 శాతం) నిష్పత్తిలో వాటా నిర్ణయిస్తారా? లేక 20:80 నిష్పత్తిలో ఇవ్వాలా? అన్నది ప్రభుత్వం త్వరలోనే తేల్చబోతోంది. పెపైచ్చు నిర్మించిన భవనంలోని స్థలాన్ని (స్పేస్)ను 99 ఏళ్ల పాటు ఇతరులకు లీజుకు ఇచ్చుకునే అధికారాన్ని కూడా ఆయా కంపెనీలకే కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. - (ఆంధ్రప్రదేశ్ బ్యూరో)