ఎండాకాలంలో ఎయిర్ కూలర్, చలికాలంలో రూమ్ హీటర్ వాడుకోవడం మామూలే! ఎండాకాలంలో రూమ్ హీటర్‌ను, చలికాలంలో ఎయిర్ కూలర్‌ను వాడుకోలేం. ఇకపై బయట వేడిగా ఉన్నప్పుడు గదిని చల్లబరచడానికి, చలి వణికిస్తున్నప్పుడు గదిని వెచ్చబరచడానికి వేర్వేరు పరికరాలు వాడుకోనక్కర్లేదు. రెండు సౌకర్యాలూ ఇమిడి ఉన్న పరికరం అందుబాటులోకి వచ్చింది.
సింగపూర్ కంపెనీ ‘ఎయిర్‌లియో’ ఈ డ్యుయో ఎకో మొబైల్ ఎయిర్ కూలర్ కమ్ హీటర్‌ను రూపొందించింది. ఇది ‘లో టెంపరేచర్ ఎవల్యూషనరీ ఓజోన్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ఇది గది వాతావరణాన్ని 18 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా, 28 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా ఉంచుతుంది. దీని ధర 299 డాలర్లు (రూ.24,604) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment