Mobile Cooler
-
ఎయిర్ కూలర్ కమ్ హీటర్: చల్లగా.. వెచ్చగా.. ఎలా కావాలంటే అలా..
ఎండాకాలంలో ఎయిర్ కూలర్, చలికాలంలో రూమ్ హీటర్ వాడుకోవడం మామూలే! ఎండాకాలంలో రూమ్ హీటర్‌ను, చలికాలంలో ఎయిర్ కూలర్‌ను వాడుకోలేం. ఇకపై బయట వేడిగా ఉన్నప్పుడు గదిని చల్లబరచడానికి, చలి వణికిస్తున్నప్పుడు గదిని వెచ్చబరచడానికి వేర్వేరు పరికరాలు వాడుకోనక్కర్లేదు. రెండు సౌకర్యాలూ ఇమిడి ఉన్న పరికరం అందుబాటులోకి వచ్చింది. సింగపూర్ కంపెనీ ‘ఎయిర్లియో’ ఈ డ్యుయో ఎకో మొబైల్ ఎయిర్ కూలర్ కమ్ హీటర్‌ను రూపొందించింది. ఇది ‘లో టెంపరేచర్ ఎవల్యూషనరీ ఓజోన్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ఇది గది వాతావరణాన్ని 18 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా, 28 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా ఉంచుతుంది. దీని ధర 299 డాలర్లు (రూ.24,604) మాత్రమే! -
ఒళ్లంత చల్లంత..
వేసవి తాపాన్ని తగ్గించే పనిలో ఇంట్లో కూలర్లు.. ఏసీలు.. నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉండగా భానుడి భగభగల నుంచి తప్పించుకున్నా.. బయటకు వెళ్లినప్పుడు మాత్రం మండుటెండకు మాడక తప్పదు. వడగాలికి వాడిపోకుండా కూల్‌గా ఉండేలా మొబైల్ కూలర్‌ను కనుగొన్నాడు మల్కాజిగిరికి చెందిన పోసూరి రవికిరణ్. బస్‌లో, కారులో వెళ్లేటప్పుడు ఈ ట్రావెల్ కూలర్ మీకు చల్లదనాన్ని అందిస్తుంది. అరచేతిలో ఇమిడే బుల్లి కూలర్ లో అరగ్లాస్ నీరు పోస్తే చాలు. బ్యాటరీతో నడిచే ఈ కూలర్‌ను పీవీసీ పైపు, బుల్లి ఫ్యాన్ బ్లేడ్ వంటి ఇతర పరికరాలతో రూపొందించాడు. దీన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు రూ.150 మాత్రమే. - అల్వాల్