Heater
-
Water Heater: విద్యుత్ షాక్‌తో నర్సు మృతి
ఖైరతాబాద్: గదిలో హీటర్ పెట్టుకునే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై యువతి మృతిచెందిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన కె.సౌమ్య (20) ఖైరతాబాద్‌లో నివాసం ఉంటూ వాసవీ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా సౌమ్య స్నేహితుడు ప్రశాంత్ ఆమెకు ఫోన్‌చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో రాత్రి 7.30గంటల ప్రాంతంలో గదికి వచ్చి తలుపు తట్టగా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా గదిలో బాత్రూం పక్కనే సౌమ్య హీటర్ మీదపడి అచేతనంగా కని్పంచింది. వెంటనే హీటర్ స్విచ్ ఆఫ్ చేసి ఆమెను హాస్పిటల్‌కు తరలించగా డ్యూటీ డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. గదిలో హీటర్ స్విచ్ఆన్ చేసి బకెట్లో వేసే క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. శరీరంపై హీటర్ వల్ల కాలిన గాయాలు ఉన్నాయి. ఈ మేరకు మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణాలు తీసిన రూమ్ హీటర్.. తండ్రితో సహా 3 నెలల చిన్నారి మృతి
చలి వణికిస్తోంది. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా చలి తీవ్రంగా ఉంది. ఈ కారణంగా చాలా మంది ఇంట్లో ఉపశమనం కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తారు. అయితే రూమ్ హీటర్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా ప్రాణాలకే రిస్క్. ఈ మధ్య కాలంలో హీటర్ల వల్ల కలుగుతున్న ప్రమాదాల గురించి వింటూనే ఉన్నాం. రూమ్ హీటర్లు గాలిలో తేమను తగ్గించగలవు. దీంతో ఆక్సిజన్ తగ్గిపోయి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు అగ్ని ప్రమాదానికి కారణమై ప్రాణాలు కోల్పోవం వంటి ఘటనలు కూడా జరిగాయి. తాజాగా రాజస్థాన్‌లోనూ వాటర్ హీటర్ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. హీటర్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఓ తండ్రి, మూడు నెలల చిన్నారి మృత్యువాతపడ్డారు. భార్య చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. దీపక్ యాదవ్ అనే వ్యక్తి స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో చలిగా ఉందని రూమ్ హీటర్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో హీట్ ఎక్కువై ఇంట్లో ఉన్న దూదికి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు చెలరేగడంతో దీపక్, అతని మూడు నెలల కుమార్తె నిషిక సజీవ దహనమయ్యారు. భార్య సంజు తీవ్రంగా గాయడింది. వీరి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, దీపక్ మరియు నిషిక మరణించినట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
ఎయిర్ కూలర్ కమ్ హీటర్: చల్లగా.. వెచ్చగా.. ఎలా కావాలంటే అలా..
ఎండాకాలంలో ఎయిర్ కూలర్, చలికాలంలో రూమ్ హీటర్ వాడుకోవడం మామూలే! ఎండాకాలంలో రూమ్ హీటర్‌ను, చలికాలంలో ఎయిర్ కూలర్‌ను వాడుకోలేం. ఇకపై బయట వేడిగా ఉన్నప్పుడు గదిని చల్లబరచడానికి, చలి వణికిస్తున్నప్పుడు గదిని వెచ్చబరచడానికి వేర్వేరు పరికరాలు వాడుకోనక్కర్లేదు. రెండు సౌకర్యాలూ ఇమిడి ఉన్న పరికరం అందుబాటులోకి వచ్చింది. సింగపూర్ కంపెనీ ‘ఎయిర్లియో’ ఈ డ్యుయో ఎకో మొబైల్ ఎయిర్ కూలర్ కమ్ హీటర్‌ను రూపొందించింది. ఇది ‘లో టెంపరేచర్ ఎవల్యూషనరీ ఓజోన్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ఇది గది వాతావరణాన్ని 18 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా, 28 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా ఉంచుతుంది. దీని ధర 299 డాలర్లు (రూ.24,604) మాత్రమే! -
చలికాలం వచ్చేసింది.. నిశ్శబ్దంగా వెచ్చదనం ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకం
అసలే చలికాలం వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో చలి మరీ వణికించేస్తుంది. అతిగా చలి వణికించే ప్రాంతాల్లో చలి నుంచి రక్షణ కోసం జనాలు రూమ్హీటర్లను వాడుతుంటారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది. పైగా వీటి నుంచి వెలువడే సన్నని రొద సరిగా నిద్రపట్టనివ్వదు. అలాంటి ఇబ్బందులేవీ లేని అధునాతన పోర్టబుల్ రూమ్ హీటర్‌ను రష్యన్ బహుళ జాతి సంస్థ ‘బల్లూ గ్రూప్’ అందుబాటులోకి తెచ్చింది. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ‘అపోలో బల్లు కన్వెక్షన్ హీటర్’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ 1500 వాట్ల రూమ్ హీటర్‌ను తేలికగా ఎక్కడికైనా తీసుకుపోయిన కోరుకున్న చోటు అమర్చుకోవచ్చు. సాధారణ రూమ్ హీటర్లతో పోలిస్తే, ఇది వినియోగించుకునే విద్యుత్తు దాదాపు సగానికి సగం తక్కువ. మూడువందల చదరపు అడుగుల గదిని ఇది వెచ్చగా ఉంచగలదు. ఇందులో 24 గంటల టైమర్ కూడా ఉంది. గదిలో ఎంతసేపు వెచ్చదనం కావాలో ఈ టైమర్‌లో సెట్ చేసుకోవచ్చు కూడా. దీని ధర 179.99 డాలర్లు (సుమారు రూ.15 వేలు) మాత్రమే! చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు! -
న్యూయార్క్ అపార్ట్మెంట్లో అగ్నికీలలు
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రోన్స్ ప్రాంతంలోని 19 అంతస్తుల భవంతిలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు మంటలు వ్యాపించడం మొదలైంది. భారీ స్థాయిలో మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ వేగంగా విస్తరించడంతో వాటిల్లో చిక్కుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. ఆఫ్రికాలోని గాంబియా నుంచి వలస వచ్చిన ముస్లిం కుటుంబాలు ఆ డూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ట్వీట్ చేశారు. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. ఒక బెడ్రూమ్లోని ‘గదిని వేడిగా ఉంచే ఎలక్ట్రిక్ హీటర్’ నుంచి మంటలు మొదలై గది మొత్తం విస్తరించి, తర్వాత అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని న్యూయార్క్ అగ్నిమాపక విభాగం కమిషనర్ డేనియల్ నీగ్రో వివరించారు. బిల్డింగ్‌లోని ప్రతీ ఫ్లోర్‌లోని మెట్ల వద్ద అపార్ట్మెంట్ వాసులు విగతజీవులై కనిపించారని ఆయన తెలిపారు. విపరీతంగా కమ్మేసిన పొగకు ఊపిరాడక, గుండె ఆగిపోవడంతో కొందరు మరణించారని కమిషనర్ వెల్లడించారు. 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. -
వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..
సాక్షి, గోపాల్పేట (వనపర్తి): నాలుగు నెలల ఆ గర్భిణి, కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా కాలం గడుపుతుండగా వాటర్ హీటర్ రూపంలో మృత్యువు గర్భిణిని కబళించింది. ఈ విషాదకర సంఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ నవీద్ తెలిపిన వివరాలిలా.. బుద్దారానికి చెందిన అంజన్నమ్మ, తిరుపతిగౌడ్ కూతురు రవిసుధ (22)ను మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ జీవితం సంతోషంగా సాగుతోంది. వారికి ఇప్పటికే 14నెలల బాబు ఉండగా.. ప్రస్తుతం రవిసుధ నాలుగు నెలల గర్భిణి. ఈక్రమంలో రోజులానే ఇంట్లో శనివారం నీరు వేడి చేసేందుకు నీటితో నిండిన బకెట్లో హీటర్‌ను ఉంచారు. అదే సమయంలో ఇల్లు శుభ్రం చేస్తున్న రవిసుధ చెయ్యి అనుకోకుండా హీటర్ ఉంచిన బకెట్‌కు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. చదవండి: (చిట్టమ్మ పెంచుకున్న పొట్టేలే.. ‘ఊపిరి’ తీసింది!) భర్త నరేందర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా, రవిసుధ తల్లిదండ్రులు.. తమ కూతురు వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలన్న ఆశతో సొంత గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ, అనుకోని రీతిలో తమ కూతురు వారిని వీడిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
గీజర్ నుంచి విషవాయువు.. బాలిక మృతి
ముంబై : గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బొరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 5న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన ధృవి గోహిల్ (15) ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 10న మృతిచెందింది. కార్బన్ మోనాక్సైడ్‌ను అధికంగా పీల్చడం వల్లే ఈ ఘోరం జరగినట్లు వైద్యులు తెలిపారు. -
పెళ్లయిన నాలుగు రోజులకే నవవధువు మృతి
రాంగోపాల్‌పేట్: కాళ్ల పారాణి ఆరలేదు...పెళ్లి తంతూ ఇంకా పూర్తికాలేదు. అంతలోనే ఓ నవ వధువును కరెంటు కాటేసింది. పెళ్లయిన నాలుగు రోజులకే ఆమెకు నూరేళ్లు నిండాయి. హీటర్ షాక్ కొట్టి నవవధువు మృతి చెందిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ కళాసీగూడ ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతానికి చెందిన పరమేశ్వర్, షీమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం జరిగింది. పరమేశ్వర్ మృతి చెందగా, షీమాదేవి కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటోంది. రెండో కుమార్తె మనీషా ఈ నెల 22న నాంపల్లికి చెందిన కృష్ణ శర్మతో వివాహం జరిగింది. సికింద్రాబాద్‌లోని సిక్‌వాలా సమాజ్‌లో ఘనంగా వివాహం జరిపించారు. శుక్రవారం పుట్టింట్లో పగిరిరథం (ఫంక్షన్) ఉండటంతో ఆమెను కళాసీగూడకు తీసుకుని వచ్చారు. రాత్రి కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుక జరిగింది. శనివారం ఉదయం స్నానం చేసేందుకు బాత్ రూమ్‌లో బకెట్లో హీటర్ పెట్టుకున్న ఆమె నీళ్లు వేడి అయ్యాయో లేదో చూసేందుకు కరెంట్ స్విచ్ ఆఫ్ చేయకుండా హీటర్‌ను బయటికి తీసింది. అదే సమయంలో హీటర్ ఆమెకు నడుముకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. బాత్రూమ్లో కిందపడి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పెళ్లింట్లో విషాదం... బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో ఘనంగా పెళ్లి జరిపించగా పెళ్లైన నాలుగు రోజులకే వధువు మృతి చెందడంతో విషాదం నెలకొంది. మనీషా కుటుంబ సభ్యులు, ఆమె భర్త బోరున విలపించారు. -
ఊరికి దూరంగా... దేవునికి దగ్గరగా.. క్రిస్మస్!
తెల్లారితే క్రిస్మస్... ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఉన్న ఒక పాత ఇల్లు... దాన్ని ఆనుకొని ఒక కార్ రిపేర్ షాపు... చిమ్మచీకటి, భోరున కురుస్తున్న మంచు.. బయటి ప్రపంచం, కాలం అతనికి ఎప్పుడో అతని భార్య చనిపోయినప్పుడే పదేళ్ల క్రితమే స్తంభించింది ఆ ఇంట్లోని 70 ఏళ్ళ ముసలాయన జార్జ్‌కి ... క్రిస్మస్ అంటే అయిష్టమేమీ లేదు, కాకపోతే ఆనందమూ లేదు. ఏడాదిలో అదీ ఒక రోజు అంతే!! ఇంతరాత్రి కస్టమర్లెవరొస్తారులే అనుకొంటున్న సమయంలో ఒక అపరిచితుడు తలుపు తోసుకొని లోనికి వచ్చాడు. అతనూ వయసులో పెద్దవాడే. పాపం! బాగా అలసిపోయి బలహీనంగా ఉన్నాడు... ‘‘చలిగా ఉంది, వచ్చి హీటర్ వద్ద కూర్చోండి’’ అన్నాడు జార్జ్ జాలిగా... చలికి గడ్డకట్టుకుపోతున్న ఆ వ్యక్తికి ఆ మాటలు గుడిగంటల్లా వినిపించాయి. హీటర్ వద్ద కూర్చున్న ఆ అపరిచితునికి ఆ రాత్రి తన కోసం చేసుకున్న వేడి వేడి సూప్‌ను ఫ్లాస్కులో నుండి పోసి ఇచ్చాడు. ‘‘బయట చలి భరించలేక లోనికి వచ్చాను... మీరేమో నాకింత మంచి ఆతిథ్యమిస్తున్నారు’’ అన్నాడా అపరిచితుడు. సరిగ్గా అదే సమయంలో అతని ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఎవరో కస్టమర్ వచ్చాడన్న మాట!! తలుపు తీసి చూస్తే ఒక పాత కారు, దాని డ్రైవింగ్ సీట్లో ఒక యువకుడు... ‘‘నా భార్య నిండు చూలాలు, నొప్పులొస్తున్నాయి. కానీ నా కార్ ముందుకు సాగడం లేదు... కాస్త రిపేర్ చేస్తారా?’’ అనడిగాడా వ్యక్తి ఎంతో దీనంగా. అది రిపేరయ్యే కారు కాదని అతనికి అర్ధమై ఆ మాటే అతనితో అన్నాడు జార్జ్. ‘‘ప్లీజ్... నా భార్య చాలా ప్రమాదంలో ఉంది. సాయం చెయ్యండి’’ అంటూ ప్రాధేయపడుతున్నాడతను. జార్జ్ తలుపేసి లోపలికొచ్చి గోడకున్న తాళపు చెవుల గుత్తిలో నుండి తన కారు తాళం చెవులు తీసుకొని బయటికెళ్లి షెడ్డులోనుండి తన కార్ బయటికి తీసి అతనిముందు పెట్టి ‘‘నా ఈ కార్ తీసుకెళ్లండి. పాతదే కానీ బాగా పరుగెత్తుతుంది’’ అన్నాడు. అతని కారులోనుండి భార్యను ఎత్తి తన కారులో కూర్చోబెట్టడంలో సాయం చేసి...‘‘కంగారు పడొద్దు. నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్ళు. నీ భార్యకేమీ కాదు’’ అన్నాడు జార్జ్. అతని కారు వెళ్లిన తర్వాత ఇంట్లోకి వస్తూ ‘‘నా కాఫీ ఎలా ఉంది?’ అనడగబోతూ ఆగిపోయాడు. అపరిచితుడక్కడ లేడు, వెళ్ళిపోయాడు. పోనీలే అనుకొంటూ జార్జ్ సర్దుకొంటుండగా, తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. బయటికి పరుగెత్తాడు. ఎవరో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు ఆఫీసర్ గాయపడ్డాడు. అతను పోలీసు కారులో ఉన్నాడు. కాల్పులు జరిపిన వాడు పారిపోయాడు. జార్జ్ గతంలో సైన్యంలో పనిచేశాడు. ప్రథమ చికిత్స చెయ్యడం అతనికి తెలుసు. మెల్లిగా పోలీసు ఆఫీసర్‌ను లోనికి తెచ్చి పడుకోబెట్టి కట్టుకట్టాడు. నొప్పి తగ్గడానికి కొన్ని మాత్రలిచ్చి ‘మీ వాళ్లకు కబురు చేసి ఆంబులెన్స్ పిలిపిస్తాను’ అంటూ బయటికెళ్లి పోలీసు కారులోని వైర్లెస్ ద్వారా సమాచారం పంపి మళ్ళీ లోపలికొచ్చాడు. ‘‘థాంక్యూ. మీరు నాకు ఎంతో సాయం చేశారు, నా ప్రాణాలు కాపాడారు’’ అన్నాడా పోలీసు ఆఫీసర్ ఎంతో కృతజ్ఞతగా.. ‘‘ఇందులో నేను పెద్దగా చేసిందేమీ లేదు. గాయాలతో నిస్సహాయ స్థితిలో ఒక వ్యక్తి బయట పడి ఉంటే నేను విస్మరించలేను... నేను చెయ్యగలిగింది నేను చేశాను’’ అన్నాడు జార్జ్. అతనికీ కాఫీ కప్పు ఇచ్చాడు. అతను కాఫీ తాగుతోంటే విసురుగా తలుపు తెరుచుకొని ఒక యువకుడు చేతిలో తుపాకీతో లోనికొచ్చాడు. ‘‘మీ వద్ద ఉన్న డబ్బులన్నీ బయటికి తీయండి’’ అంటూ తుపాకీతో బెదిరించాడు. ‘‘నన్ను ఇందాక గాయపర్చింది ఇతనే’’ అన్నాడు పోలీసు అధికారి. ‘‘బాబూ ముందా తుపాకీ పక్కన పెట్టు, నీకు కావలసింది ఇస్తాం’’ అన్నాడు జార్జ్. ‘‘ముసలోడా!! నోరు మూసుకొని ముందు డబ్బంతా బయటికి తియ్యి’’ అన్నాడా యువకుడు. పోలీసు అధికారి తన తుపాకీ తియ్యబోతుండగా ‘ఆ అవసరం లేదు’ అని అతన్ని వారించాడు జార్జ్. ‘‘ఈ రోజు క్రిస్మస్ ఈవ్ కదా... ఈ డబ్బంతా తీసుకో. దయచేసి నీ తుపాకీ మాత్రం పక్కన పెట్టు’’ అన్నాడు జార్జ్ అనునయంగా. తన వద్ద ఉన్న 150 డాలర్లు తీసుకెళ్లి జార్జ్ అతని చేతిలోపెట్టి, ‘‘చాలా ఇంకా కావాలా?’’ అనడిగాడు. ఆ యువకుడు అలసిపోయినవాడిలాగా తుపాకీ వదిలేసి మోకాళ్ళ మీద కుప్ప కూలిపోయాడు. ‘‘నాకిలాంటి పనులు అలవాటు లేదు. నా ఉద్యోగం పోయింది, ఆరు నెలలు ఇంటి అద్దె బకాయిపడ్డాను. ఫైనాన్స్ వాళ్ళు నా కార్ తీసుకెళ్లిపోయారు. ఈ క్రిస్టమస్ కోసం నా భార్యకు, కొడుక్కు ఏమైనా కొందామనుకున్నానంతే’’ అంటూ ఆ యువకుడు ఏడుస్తున్నాడు. జార్జి అతని తుపాకీ తీసి పోలీసు ఆఫీసర్‌కి ఇచ్చాడు. ‘‘బాబూ! తప్పులు చేయడం మానవ సహజం. మనం ప్రయాణిస్తున్న దారిలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ పట్టుదలతో, కష్టపడే తత్వంతో వాటిని ఎదుర్కోవాలి, సమస్యలు తీర్చుకోవాలి, కానీ ఇలా కాదు’’ అని చెప్పాడు జార్జ్. అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి అతనికీ ఒక కప్పు కాఫీ ఇచ్చాడు. ‘‘కాస్త అలసట తీర్చుకో... అన్నీ కుదుటపడతాయి..’’ అన్నాడాయన.ఆ యువకుడు భోరున ఏడుస్తూ ‘‘సారీ, మిమ్మల్ని తుపాకీతో కాల్చాను’’ అంటూ పోలీసు అధికారికి క్షమాపణ చెప్పాడు. ‘‘నోరు మూసుకొని కాఫీ తాగు’’ అని బెదిరించాడా అధికారి. ఇంతలో ఆంబులెన్స్ వచ్చింది. ఇతర పోలీసు అధికారులొచ్చారు. ‘‘నీ మీద కాల్పులు జరిపింది వీడేనా?’’ అని ఆ యువకుని చూపిస్తూ వాళ్లడిగారు. ‘‘అతను కాదు... వాడు తుపాకీ ఇక్కడ పారేసి పారిపోయాడు’’ అని అధికారి జవాబిచ్చాడు. జార్జి, ఆ యువకుడు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ‘‘మరి ఇతనెవరు?’’ అని వాళ్లడిగారు అనుమానంగా. ‘‘ఈ రోజే కొత్తగా నావద్ద పనిలో చేరాడు’’ అని జార్జ్ వారికి బదులిచ్చాడు. అతన్ని ఆంబులెన్స్‌లోకి ఎత్తడంలో ఆ యువకుడు కూడా సాయం చేస్తూ ‘‘నన్నెందుకు క్షమించారు?’’ అని గుసగుసగా అడిగాడు. పోలీసు అధికారి చిన్నగా నవ్వుతూ ‘‘హ్యాపీ క్రిస్మస్’’ అన్నాడు. ‘‘నీకు కూడా జార్జ్... నాకెంతో సాయం చేశావు’’ అన్నాడతను. వాళ్ళు వెళ్లిపోయాక, జార్జ్ ఇంటిలోనికి వెళ్లి ఒక చిన్న పెట్టెలాంటిది తెచ్చి ఆ యువకునికిచ్చాడు. ‘‘నేనెంతో కాలం బతకను. కానీ దీంట్లోనివి నీకు అక్కరకొస్తాయి. నా భార్య మార్త బతికుంటే సరిగ్గా ఇదే పని చేసి ఉండేది’’ అన్నాడు జార్జ్. దాంట్లో చూస్తే అతని భార్య తాలూకు పెద్ద వజ్రపుటుంగరం అందులో ఉంది. ‘‘అయ్యో ఇంత ఖరీదైనది నేను తీసుకోలేను’’ అన్నాడా యువకుడు. ‘‘నువ్వు తప్పక దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దాని అవసరం నీకు ఉంది. నాకు అత్యంత విలువైన నా భార్య జ్ఞాపకాలు చాలు’’ అన్నాడు జార్జ్. ‘‘నీకున్న 150 డాలర్లు నాకిచ్చేశావు. ఇవి మాత్రం తీసుకోవాలి’’ అన్నాడా యువకుడు. సరేనంటూ అతన్ని వీధిలోకి సాగనంపి ఇంట్లోకి వచ్చి మంచం మీద అతను మేను వాలుస్తూ ఉండగా ఆ యువకుడు నవ్వుతూ మళ్ళీ లొనికొచ్చాడు. ‘‘నేను తలుపేశానుగా, లోనికెలా వచ్చావు?’’ అనడిగాడు జార్జ్ ఆశ్చర్యంగా. ‘‘నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకోవా?’’ అనడిగాడా యువకుడు. ‘‘నా భార్య మార్తతోటే ఆ ఆనందమంతా ఆవిరైపోయింది. క్రిస్మస్ చేసుకునే ఓపిక నాకిప్పుడు లేదు’’ అన్నాడు జార్జ్. ఆ యువకుడు జార్జ్ భుజాలమీద చెయ్యి వేసి ‘‘కానీ నీ భార్య జ్ఞాపకాలతో నీవింకా అద్భుతంగా క్రిస్మస్ చేసుకుంటున్నావు జార్జ్. నీలాంటి వారు చాలా అరుదు. నీవు నాకు ఆహారమిచ్చావు, తాగడానికి కాఫీ ఇచ్చావు, హీటర్ వెచ్చదనాన్నిచ్చావు. నీవు సాయం చేసిన ఆ జంటకు కొడుకు పుట్టి గొప్ప డాక్టర్ అయి ఎంతో మందికి సేవచేస్తాడు. నీవు ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారి మరెంతోమంది ప్రాణాలు కాపాడుతాడు. నీవు దారిచూపించిన నాలాంటి యువకుడు మరెంతో మందికి దారి చూపించి యేసుక్రీస్తు ప్రేమను, క్షమాపణను లోకానికంతటికీ చాటిచెప్పుతాడు...’’ అని అతను చెబుతుంటే ‘‘నీకివన్నీ ఎలా తెలుసు?’’ అనడిగాడు జార్జ్ ఆశ్చర్యంగా. ‘‘నేను ఎప్పుడూ నీవెంటే ఉంటాను జార్జ్, సదా నిన్ను నేను ఆవరించి ఉంటాను. ఇక వెళ్తాను మరి. లోకమంతా నా జన్మదినం జరుపుకోవడానికి సంసిద్ధమవుతోంది మరి, నేను లేకపోతే ఎలా?’’ అంటూ అతను నవ్వుతూ వెళ్లిపోతుండగా అతని చిరిగిపోయిన వస్త్రాలు తెల్లబడి బంగారు రంగులో మారి ధగధగా మెరిసిపోయాయి... ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోగా జార్జ్ మోకాళ్ళ మీదుం ‘‘హ్యాపీ బర్త్‌డే జీసస్’’ అన్నాడు. ‘జీసస్‌ను నా మార్త కూడా చూసి ఉంటే ఎంత బావుండేది’ అని జార్జ్ అనుకొంటూ ఉండగా, ‘‘నీ ప్రియమైన మార్త ఇపుడు నాకు ప్రియమైన కుమార్తె. ఆమె నాతోపాటే ఉంది జార్జ్’’ అంటూ ఆయన వెళ్ళిపోయాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఇది హీటర్ లాంటిదే
ఇప్పుడంటే గీజర్లు కానీ.. దానికి ముందు మొత్తం ఇమ్మర్షన్ హీటర్లే కదా.. ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబాల్లో వేడినీళ్లు కావాలంటే హీటర్లనే వాడతారు. ఈ ఇమ్మర్షన్ సూత్రంతో వచ్చిందే ఈ ‘ఇమ్మర్షన్ సర్కులేటర్’. లైట్ వెయిట్‌తో కాంపాక్ట్ సైజులో ఉన్న ఈ పరికరం గ్యాస్ అవసరం లేకుండా మీ వంటను త్వరగా, సులువుగా పూర్తి చేస్తుంది. ఎలా అంటే... గుడ్లు, కూరగాయలు లేదా మాంసాన్ని ఉడికించాలంటే, వాటిని నీళ్లు పోసిన గిన్నెలో వేయాలి. తర్వాత దానికి ఈ ఇమ్మర్షన్ సర్కులేటర్ను తగిలించాలి (వీటికి ఉన్న క్లిప్స్‌తో). ఇప్పుడు ఎలక్ట్రిక్ సప్లై ఇస్తే సరిపోతుంది. టెంపరేచర్‌ను కూడా మనం ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. అలాగే సాంబార్, పాలు లాంటివి వేడి చేసుకోవాలన్నా... ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది.