అసలే చలికాలం వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో చలి మరీ వణికించేస్తుంది. అతిగా చలి వణికించే ప్రాంతాల్లో చలి నుంచి రక్షణ కోసం జనాలు రూమ్‌హీటర్లను వాడుతుంటారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది. పైగా వీటి నుంచి వెలువడే సన్నని రొద సరిగా నిద్రపట్టనివ్వదు. అలాంటి ఇబ్బందులేవీ లేని అధునాతన పోర్టబుల్ రూమ్ హీటర్‌ను రష్యన్ బహుళ జాతి సంస్థ ‘బల్లూ గ్రూప్’ అందుబాటులోకి తెచ్చింది.
ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ‘అపోలో బల్లు కన్వెక్షన్ హీటర్’ పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ 1500 వాట్ల రూమ్ హీటర్‌ను తేలికగా ఎక్కడికైనా తీసుకుపోయిన కోరుకున్న చోటు అమర్చుకోవచ్చు. సాధారణ రూమ్ హీటర్లతో పోలిస్తే, ఇది వినియోగించుకునే విద్యుత్తు దాదాపు సగానికి సగం తక్కువ. మూడువందల చదరపు అడుగుల గదిని ఇది వెచ్చగా ఉంచగలదు. ఇందులో 24 గంటల టైమర్ కూడా ఉంది. గదిలో ఎంతసేపు వెచ్చదనం కావాలో ఈ టైమర్‌లో సెట్ చేసుకోవచ్చు కూడా. దీని ధర 179.99 డాలర్లు (సుమారు రూ.15 వేలు) మాత్రమే!
చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment