Air Cooler
-
ఎయిర్ కూలర్ కమ్ హీటర్: చల్లగా.. వెచ్చగా.. ఎలా కావాలంటే అలా..
ఎండాకాలంలో ఎయిర్ కూలర్, చలికాలంలో రూమ్ హీటర్ వాడుకోవడం మామూలే! ఎండాకాలంలో రూమ్ హీటర్‌ను, చలికాలంలో ఎయిర్ కూలర్‌ను వాడుకోలేం. ఇకపై బయట వేడిగా ఉన్నప్పుడు గదిని చల్లబరచడానికి, చలి వణికిస్తున్నప్పుడు గదిని వెచ్చబరచడానికి వేర్వేరు పరికరాలు వాడుకోనక్కర్లేదు. రెండు సౌకర్యాలూ ఇమిడి ఉన్న పరికరం అందుబాటులోకి వచ్చింది. సింగపూర్ కంపెనీ ‘ఎయిర్లియో’ ఈ డ్యుయో ఎకో మొబైల్ ఎయిర్ కూలర్ కమ్ హీటర్‌ను రూపొందించింది. ఇది ‘లో టెంపరేచర్ ఎవల్యూషనరీ ఓజోన్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ఇది గది వాతావరణాన్ని 18 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా, 28 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా ఉంచుతుంది. దీని ధర 299 డాలర్లు (రూ.24,604) మాత్రమే! -
అదిరిపోయే గాడ్జెట్.. ఎక్కడైనా చల్లదనం మీ వెంటే
ఎయిర్ కండిషనర్ల చల్లదనం కావాలనుకుంటే, వాటిని అమర్చిన గదుల్లోనే కాలక్షేపం చేయక తప్పని పరిస్థితి. విండో ఏసీ అయినా, స్పి›్లట్ ఏసీ అయినా కావలసిన గదిలో అమర్చుకోగలమే తప్ప వాటిని ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోయే వీలులేదు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకపోయే పోర్టబుల్ ఏసీలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రాజస్థాన్‌కు చెందిన ‘ఇవాపోలార్’ సంస్థ ఇటీవల ‘ఇవాచిల్’ పేరుతో పోర్టబుల్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. చిన్నసైజు సూట్‌కేసు మాదిరిగానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఆరుబయట కూడా దీనిని నిక్షేపంగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ కూలర్ మాదిరిగానే దీనికి వాటర్ ట్యాంకు ఉంటుంది. దీనిని నింపుకోవలసి ఉంటుంది. గాలిలో తేమను వ్యాపింపజేసి, ఇది పరిసరాలను నిమిషాల్లోనే చల్లబరుస్తుంది. దీని ధర సైజును బట్టి రూ.15,669 నుంచి రూ.44,669 వరకు ఉంటుంది. చదవండి: ChatGPT: యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు! -
భగవంతుడా ఇంత ఘోరమా.. వేకువ జామున విషాదం
హొసపేటె(బెంగళూరు): ఎంతో నెమ్మదస్తులు.. అందరితో సౌమ్యంగా మెలిగే కుటుంబం.. వైశ్య సముదాయంలో మంచి పేరు గడించిన ఆ ఇంట్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. దంపతుల సహా నలుగురు మృత్యువాతపడ్డారు. విజయనగర జిల్లా మరియమ్మనహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న రాఘవేంద్రశెట్టి, రాజశ్రీ దంపతుల ఇంటిలో శుక్రవారం వేకువజామున ఏసీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సిలిండర్ పేలి మంటలు చెలరేగి ఊపిరి ఆడక అతని కుమారుడు వెంకట ప్రశాంత్ (42), కోడలు చంద్రకళ (38), మనవడు అద్విక్ (16), మనవరాలు ప్రేరణ (14)లు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాఘవేంద్ర శెట్టికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకట ప్రశాంత్ స్థానికంగా కిరాణా వ్యాపారం చేస్తుండగా మరో కుమారుడు అమెరికాలో ఉన్నాడు. కుమార్తె కర్నూలులో ఉంది. వెంకట ప్రశాంత్‌కు కిరాణా వ్యాపారం ఉండటంతో మరియమ్మనహళ్లితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కడసారి చూపు కోసం వందలాదిగా జనం తరలివచ్చారు. ఎంతో మంచి కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడని విలపించారు. బంధువులు ఇంటివద్దకు చేరుకొని గుండెలు బద్దలయ్యేలా రోదించారు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలిని పోగొట్టుకొన్న రాఘవేంద్ర శెట్టి, రాజశ్రీ దంపతులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. చదవండి: వివాహేతర సంబంధం..భార్య, అత్త, ప్రియుడు, మరో మిత్రుడితో కలిసి.. -
ఎయిర్ కూలర్‌ను నేరుగా వాడొద్దు!
ఎండలు బాగా ముదురుతున్నాయి కదా. ఇక చాలాకాలం పాటు వాడకుండా ఎప్పటినుంచో అలా ఓ మూల పడి ఉన్న వాటర్‌కూలర్ తీసి వాడాలనుకుంటున్నారా? దాన్ని అలా తీసేసి, వెంటనే ఇలా వాడేయకండి. నిద్రపోతున్నప్పుడు గదిని చల్లబరిచేందుకు వాడే ఎయిర్‌కూలర్ విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించడం అవసరం. గతేడాదో లేదా చాలాకాలం కిందటో వాటర్‌కూలర్ వాడటం మానేసిన సమయంలో దాని కింది భాగంలో ఎన్నో కొన్ని నీళ్లు ఉన్నాయనుకోండి. అక్కడ లీజియోనెల్లా అనే ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ బ్యాక్టీరియా కారణంగా ‘వాటర్ కూలర్ నిమోనియా’ అని వాడుక భాషలో పిలిచే ప్రమాదకరమైన నిమోనియా రావచ్చు. అందుకే అట్టడుగున ఎంత మాత్రమూ చెమ్మలేకుండా చేసేందుకు ఓసారి వాటర్‌కూలర్‌ను లోపలి చెమ్మ అంతా ఇగిరిపోయేలా చూడాలి. ఆ తర్వాతే వాటర్ కూలర్‌ను వాడాలి. ఎయిర్ కూలర్ విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించాలి. ఇక ఎయిర్‌కూలర్‌లో అడుగున నీరు ఉంటే ఇదే లీజియోనెల్లా బ్యాక్టీరియా ఇక్కడ కూడా చేరవచ్చు. అందుకే ఇలా ఎయిర్ కూలర్‌ను వాడేముందు ఒకసారి ఆరుబయటకు తీసుకొచ్చి, కాసేపు ఆన్ చేసి, అడుగున ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చూడాలి. ఇలా ఆన్ చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. కూలర్ తాలూకు పాత తడికల్లోనూ డస్ట్‌మైట్స్ ఉండవచ్చు. నేరుగా ఆన్ చేయడం వల్ల వాటి కారణంగా ఆస్తమా రోగుల్లో... (ఆ మాటకొస్తే కొందరు సాధారణ వ్యక్తుల్లో సైతం) దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ట్రిగర్ అయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఈ జాగ్రత్తలు. చదవండి: మీ తలగడ, పరుపు సౌకర్యంగా ఉన్నాయా? -
ఏసీ స్క్వేర్.. చివరికి మట్టితో సక్సెస్!
గదిని చల్లబరచడానికి ఏసీ ఆన్ చేస్తాం. ఏసీ నుంచి వెలువడే వేడి నుంచి వాతావరణాన్ని చల్లబరచడం ఎలాగో చేసి చూపించారు అంతర, ప్రీష. ఇందుకోసం హరప్పా నాగరకత కాలం నాటి పద్ధతులను అవలంబించారు! ఈ ప్రయోగం చేయడానికి వాళ్లను ప్రభావితం చేసిన సంఘటన ఆలోచించి తీరాల్సిన విషయం. అందరికీ తెలిసినదే, అయితే ఎవరూ దృష్టి పెట్టనిది. ‘‘ముంబయిలో ఒక భవనం వెనుక నుంచి నడుస్తున్నాం. ఆ భవనంలో సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్ లోపల చల్లగా ఉంటుంది. నిత్యం వచ్చిపోయే వాళ్ల కోసం ఏసీ నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటుంది. ఏసీ పని చేసినంత సేపూ అవుట్లెట్ నుంచి విడుదలయ్యే వేడి గాలి భవనం వెనుక వైపు ప్రదేశంలోని ఉష్ణోగ్రతలను పెంచేస్తోంది. అక్కడ నడిచి వెళ్లేవాళ్లు కూడా ఆ వేడిని భరిస్తూ ముందుకు వెళ్లిపోతున్నారు. కానీ ఆ సమస్య ఆ క్షణంతో తీరేది కాదు. ఆ వేడిగాలి వాతావరణంలో కలిసిపోతుంది. పర్యావరణానికి హాని కలిగిస్తుంది. పైగా ఇంట్లో వాడే వస్తువుల్లో ఎక్కువ మోతాదులో పర్యావరణ హానికారక వాయువులను విడుదల చేసేది ఏసీ మాత్రమే. పర్యావరణానికి హాని కలుగుతుంది కాబట్టి ఏసీ వాడవద్దు అని ఎంతగా ప్రచారం చేసినా ఫలితం ఉండదు. సమస్యను గుర్తించినప్పుడు ఆ పని చేయవద్దని చెప్పడం కాదు, ప్రత్యామ్నాయం చూపించగలగాలి. మేము అదే చేశాం. రోబోటిక్ టెక్నాలజీతో ప్రయోగాలు చేశాం. మొదట కాంక్రీట్‌తో ప్రయత్నించాం, తర్వాత ప్లాస్టిక్ వాడాం. అవేవీ మేము అనుకున్న ఫలితాలనివ్వలేదు. చివరగా మట్టితో చేసిన ప్రయోగం విజయవంతమైంది’’ అని చెప్పారు అంతర పటేల్, ప్రీషా పటేల్. వీళ్లిద్దరూ ముంబయిలోని జమ్నాబాయి నార్సీ స్కూల్ విద్యార్థినులు. మట్టి మంత్రం ఏసీ నుంచి విడుదలయ్యే వేడి గాలిని పర్యావరణంలో కలవకుండా నిలువరించడానికి ఈ అమ్మాయిలు మట్టి కోన్లను ఉపయోగించారు. మట్టితో ప్రమిదలు చేసినట్లే... వీళ్లు ఐస్‌క్రీమ్ కోన్ల ఆకారంలో చేశారు. ఆ మట్టి కోన్లను ఒక అల్యూమినియం ఫ్రేమ్‌లో అమర్చి ఏసీ బయట విభాగానికి అమర్చారు. ఏసీ నుంచి విడుదలయ్యే తేమతో మట్టి కోన్లు చల్లబడతాయి, ఏసీ నుంచి విడుదలయ్యే వేడిని కూడా ఈ మట్టి కోన్లు పీల్చుకుంటాయి. మట్టి కోన్లు చల్లబడడం, వేడెక్కడం రెండూ ఏసీ మెషీన్ ఆధారంగానే జరుగుతాయి. ప్రత్యేక యంత్రాంగం అవసరం లేదు. వేడిగాలిని ఎప్పటికప్పుడు మట్టి కోన్లు పీల్చుకుంటూ ఉంటాయి. కాబట్టి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగవు. ఈ అమ్మాయిలిద్దరూ పన్నెండేళ్ల లోపు వాళ్లే. వయసు చిన్నదే కానీ ఆలోచనలు పెద్దవి. ఇలాంటి పిల్లల చేతుల్లో భూగోళం చల్లగా ఉంటుంది. భవిష్యత్తు తరాలు ఆహ్లాదంగా జీవిస్తాయి. ఈ ఏటి వేదిక కెనడా వరల్డ్ రోబో ఒలింపియాడ్ ఏటా అక్టోబర్‌లో జరుగుతుంది. మొదట 2004లో సింగపూర్‌లో మొదలైన ఈ ఒలింపియాడ్‌ను ఈ ఏడాది కెనడా, మాంట్రియల్లో నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఎంట్రీలు వస్తాయి. ఈ ఏడాది అంశం ‘క్లైమేట్ స్క్వాడ్, ఈ పోటీలో 75 దేశాల నుంచి 26 వేల బృందాలు తమ ప్రయోగాలను ప్రదర్శించగా అంతర, ప్రీషాల ప్రయోగం ప్రథమ స్థానంలో నిలిచింది. కరోనా కారణంగా ఈ ఏడాది కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహించారు. నవంబర్ 15వ తేదీన విజేతలను ప్రకటించారు. భావితరం భవిష్యత్తు చల్లగా ఉండాలంటే భూగోళం చల్లగా ఉండాలి. అయితే భూగోళం భవిష్యత్తు భావి తరం చేతుల్లోనే చల్లగా ఉంటుందని నిరూపించారు ముంబయిలోని అంతర, ప్రీష. ఏసీల వల్ల వాతావరణంలోకి వెలువడే వాయువ్యర్థాలను నివారించడానికి వీళ్లు ఒక చక్కటి ప్రత్యామ్నాయాన్ని సూచించారు. కరోనా విరామంలో ఆరు నెలల పాటు శ్రమించి రూపొందించిన ‘ఏసీ స్క్వేర్’ అనే ఆ సాధనాన్ని వరల్డ్ రోబో ఒలింపియాడ్ 2020 లో ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచారు. -
కూల్ టిప్స్
మండుటెండల్లో మలయ సమీరాలను మరిపించే గాలితో చల్లబరిచే ఎయిర్ కూలర్... ఇప్పుడు మన జీవితాల్లో భాగమైపోయింది. అయితే అది ఎప్పుడూ అంతే చల్లదనాన్ని ఇవ్వాలంటే మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కూలర్లో ఎప్పుడూ మంచినీరే నింపాలి. మురికి నీరు వేస్తే ప్యాడ్స్‌తో పాటు లోపలి ట్యాంక్ కూడా మురికిపట్టిపోతుంది. కూలర్‌లోని ఆటోగ్రిల్ పని చేయడానికి ఒక బెల్ట్ ఉంటుంది. దాని పనితనాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అది పాడైతే ఇక కూలర్ నుంచి చల్లదనం అందదు. కొన్ని కూలర్లలో గడ్డి ఉంటుంది. దాన్ని కూడా ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. అది పాడైతే నీళ్లు లీకయ్యే ప్రమాదం ఉంది. కూలర్ ఉంది కదా అని కొందరు తలుపులు, కిటికీలన్నీ మూసేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. కచ్చితంగా ఒక్క కిటికీనైనా తెరిచి ఉండాలి. వేసవి అయిపోయింది కదా అని కూలర్ని ఓ మూలన పడేయకండి. అప్పుడప్పుడూ ఆన్ చేస్తూ ఉండండి. లేదంటే కొన్ని కూలర్లు తర్వాత పనిచేయకుండా మొండికేస్తాయి. -
ఎయిర్ కూలర్లో ఉపయోగించే గడ్డి?
సహజ ఉద్భిజ సంపద భారతదేశంలోని అతి ముఖ్యమైన సహజ వనరుల్లో అడవులు ఒకటి. ఇవి స్పష్టమైన ఆవరణ వ్యవస్థలుగా ఏర్పడ్డాయి. వర్షపాతం కలగడానికి, జలగ్రాహక ప్రాంతాల్లో మృత్తికల పరిరక్షణ, అభివృద్ధి, ప్రవాహాల క్రమబద్ధీకరణ, నీటిని నిల్వ చేసే శక్తి పెంపుదల, ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటంలో అటవీ వనరులు ఉపయోగపడుతున్నాయి. భూ స్వరూపం, శీతోష్ణస్థితి, మృత్తికలు, జల పరిస్థితులు వంటివి అడవుల రకం, లక్షణాలను అధికంగా ప్రభావితం చేస్తాయి. హిమాలయాల్లోని ఆల్ఫైన్ ఉద్భిజాలు దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో సతతహరిత, అర్థ సతత హరిత, శుష్క ఆకురాల్చే, తృణ భూములు, పొద అడవులు, ఆల్ఫైన్ ఉద్భిజాలు వంటి అడవులున్నాయి. మృత్తికలు, పరీవాహాలు వంటి స్థానిక పరిస్థితుల వల్ల వీటి రకాల్లో కొద్దిపాటి మార్పులుండవచ్చు. కోస్తా తీరాల్లోని ఉపాంత, వరద ప్రాంతాల్లో మడ అడవుల వంటి రకాలున్నాయి. రాష్ట్రాల్లో అటవీ విస్తరణ 2000 - 2001వ సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో 6,75,538 చ.కి.మీ. అటవీ భూమి ఉంది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 77,265 చ.కి.మీ., హర్యానాలో అత్యల్పంగా 1754 చ.కి.మీ. అటవీ భూమి ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ర్ట, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చెప్పుకోదగినంత అటవీ భూమి ఉంది. ఆయా రాష్ట్రాల వైశాల్యంతో పోల్చినప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా (62.1%), హర్యానాలో అత్యల్పంగా (3.8%) అడవులు ఉన్నాయి. మొత్తం మీద అడవుల సాంద్రత ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో అత్యధికంగా ఉంది. దీనికి భిన్నంగా హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలున్న వాయువ్య భారతదేశంలో చాలా తక్కువగా అడవులు ఉన్నాయి. భారతదేశ సగటు అటవీ ప్రాంత శాతం (20.55%) కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు 16. అవి.. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, ఒడిశా, మధ్యప్రదేశ్, గోవా, కేరళ, మణిపూర్, అసోం, కర్ణాటక, మహారాష్ర్ట, ఛత్తీగఢ్, జార్ఖండ్. మిగిలిన రాష్ట్రాల్లో దేశ సగటు అటవీ విస్తీర్ణం కంటే తక్కువగా ఉంది. అండమాన్, నికోబార్ దీవుల్లో కూడా అటవీ ప్రాంతం ఎక్కువగానే ఉంది. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి మైదానాల్లో 20%; పర్వతాలు, కొండ ప్రాంతాల్లో 60% మొత్తం మీద సగటున భౌగోళిక విస్తీర్ణంలో 33% భూభాగంలో అడవులు ఉండాలి. మనదేశంలో అడవుల విస్తీర్ణం చాలా తక్కువ. కాబట్టి పర్యావరణ పరిరక్షణ, అటవీ ఆధార పరిశ్రమల అభివృద్ధి కోసం అడవుల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనిలో భాగంగా పలచగా, అల్పంగా అడవులున్న అనార్ధ్ర, ఆర్ధ్ర అనార్ధ్ర ప్రాంతాలైన వాయువ్య భారతదేశం, దక్కన్ పీఠభూమిలో తుమ్మ, వేప, చింత, పండ్ల మొక్కలు వంటి శుష్కతను తట్టుకునే అడవుల అభివృద్ధికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. తుఫాను సమయాల్లో వచ్చే ఉప్పెనలను అడ్డుకోవడానికి కోస్తా ప్రాంతాల్లోని లోతట్టు మైదానాల్లో సరుగుడు, కొబ్బరి, జీడిమామిడి, తాటి, ఈత వంటి వనాలను అభివృద్ధి చేయాలి. పురాతన అభయారణ్యాల్లో టేకు, గుగ్గిలం, మంచిగంధం, రోజ్‌వుడ్, చిర్, దేవదారు, పైన్ మొదలైన అధిక వాణిజ్య విలువలు ఉన్న మొక్కలను నాటి ఎస్టేట్లను అభివృద్ధి చేయాలి. సామాజిక అడవుల పెంపకం, వ్యవసాయ ప్రాంతాల పరిసరాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రోత్సహించాలి. ప్రజలకు పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలియజేసి, వారందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. దీనికి అవసరమైన భూమి, ధనం, నారు, రాయితీలు, రుణాలు, సాంకేతిక సహాయం అందజేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అడవుల విస్తీర్ణం - రకాలు ఉష్ణమండల తేమ సతత హరిత అడవులు: వీటినే అర్ధ సతత హరిత అడవులు అని కూడా అంటారు. 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతమున్న కొండ ప్రాంతాల్లో ఈ అరణ్యాలు ఉంటాయి. 500 - 1500 మీ.ల ఎత్తయిన కొండ ప్రాంతాల్లో 45 - 70 మీ.ఎత్తు వరకు ఈ వృక్షాలు పెరుగుతాయి. ఉదా: పశ్చిమ కనుమల్లో ఉన్న రోజ్‌వుడ్, నల్లతుమ్మ, తెల్సూర్ జాతులు; పశ్చిమ బెంగాల్, షిల్లాంగ్ పీఠభూమి ప్రాంతాల్లో ఉండే గురుజాన్, టూన్, ఐరన్‌వుడ్, ఎబొనీ, చంపక వృక్షం, సిమార్, లారెన్ జాతులు. ఈ వృక్షజాతుల నుంచి లభించే అటవీ ఉత్పత్తులైన కలప, వెదురు, వంట చెరకును కాగితం, అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ఎత్తయిన ప్రాంతాల్లో వృక్షాలను వినియోగించుకోవడం కష్టతరమైన పని కాబట్టి వీటి వాణిజ్య విలువ తక్కువ. అర్ధ సతత హరిత అడవులు పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. 1. పశ్చిమ కనుమల దక్షిణ భాగం - కేరళ, కర్ణాటక 2. ఈశాన్య రాష్ట్రాలు - అసోం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్ 3. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అండమాన్ - నికోబార్ దీవుల్లోని మైదానాల్లో ఈ అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులు: 100 - 200 సెం.మీ. వర్షపాతం కురిసే కొండ, పీఠభూమి ఉపరితల ప్రాంతాల్లో ఈ ఉద్భిజాలు ఉంటాయి. ఇవి ఆర్థికంగా ముఖ్యమైన అడవులు. వీటిలో ప్రధానమైన వృక్షజాతి - టేకు, మంచిగంధం. ఈ అడవులు ఎక్కువగా పశ్చిమ కనుమలు, శివాలిక్ కొండలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఛోటానాగ్పూర్ పీఠభూమిలో ఉన్నాయి. కొయ్య సామగ్రి, సబ్బులు, కాగితం వంటివి వీటి ప్రధాన అటవీ ఆధార పరిశ్రమలు. ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవులు: ఈ ఉద్భిజాలు 70 - 100 సెం.మీ. వర్షపాతం ఉండే పీఠభూమి, మైదానాల్లో, ద్వీపకల్ప పీఠభూముల్లో అధికంగా పెరుగుతాయి. గంగా మైదానం; థార్ ఎడారి, హిమాలయాలు, పశ్చిమ కనుమల మధ్య ఉన్న విశాల భాగంలో ఈ అడవులు పెరుగుతాయి. కలప, కాగితం, కొయ్య సామగ్రి వంటి పరిశ్రమల్లో ఈ అడవులు ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఉష్ణమండల ముళ్ల జాతి అడవులు: ఈ ఉద్భిజాలు 70 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటిల్లో మృత్తిక సంబంధ కారణాల వల్ల అకేసియా, బ్రహ్మజెముడు, నాగజెముడు, నల్లతుమ్మ వృక్షాలు వంటి రకాలు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మైదానాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, సముద్రానికి దగ్గరగా ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో పెరుగుతాయి. మడ అడవులు: ఇవి ఎక్కువగా బురద, ఒండ్రుతో కూడిన సముద్ర తరంగాలు. పోటుపాట్లకు గురయ్యే ఉప్పు, మంచినీటి ప్రాంతాల్లో పెరుగుతాయి.వీటిలో ఎక్కువగా మడచెట్లు ఉంటాయి. బెంగాల్ డెల్టాలో ఉండే మడ అడవుల్లో ఎక్కువగా సుంద్రినివా వృక్ష జాతులు పెరుగుతాయి. కాబట్టి వీటిని సుందర వనాలు అంటారు. సమశీతోష్ణ అడవులు: వీటినే అల్ఫైన్ రకపు అడవులు అని కూడా అంటారు. ఇవి హిమాలయాల్లో 1600 - 3000 మీ.ల వరకు ఎత్తు ఉన్న ప్రాంతాల్లో, 100 - 200 సెం.మీ.ల వర్షపాతం కలిగే పర్వతాల్లో తేమతో కూడిన సమశీతోష్ణ మండల అడవులు ఉంటాయి. ఇవి మధ్య హిమాలయ శ్రేణుల్లో ఏర్పాటవుతాయి. సమశీతల సతత హరిత, శృంగాకార వృక్షాల్లో ముఖ్యమైన జాతులు.. దేవదారు, సిడార్, వెదురు, జూనిఫర్, సిల్వర్ఫెర్లు మొదలైనవి పెరుగుతాయి. ఇవి కర్రగుజ్జు, అగ్గిపెట్టెలు, హస్తకళలు, టర్పన్ టైన్, రైల్వే స్వీపర్లు వంటి పరిశ్రమలకు ఉపయోగపడుతూ ఆర్థిక, వాణిజ్య విలువలు కలిగి ఉన్నాయి. గతంలో అడిగిన ప్రశ్నలు 1. రూసా గడ్డి అధికంగా లభించే జిల్లా ఏది? (డీఎస్సీ 2002) 1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్ 3) విశాఖపట్నం 4) మహబూబ్‌నగర్ 2. మనదేశంలో అడవులు అత్యధిక శాతం ఉన్న రాష్ర్టం ఏది? (డీఎస్సీ 2008) 1) మధ్యప్రదేశ్ 2) అరుణాచల్ ప్రదేశ్ 3) హర్యాన 4) హిమాచల్‌ప్రదేశ్ 3. జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? (డీఎస్సీ 2006) 1) 1951 2) 1952 3) 1954 4) 1958 సమాధానాలు: 1) 2; 2) 2; 3)2. ప్రాక్టీస్ బిట్స్ 1. భారతదేశంలో ప్రధానంగా ఎన్ని రకాల అడవులు ఉన్నాయి? 1) 6 2) 7 3) 8 4) 9 2. సుందర వనాలు ఉన్న రాష్ర్టం ఏది? 1) అసోం 2) బీహార్ 3) పశ్చిమ బెంగాల్ 4) 1, 3 3. పొద అడవులు అధికంగా ఉన్న రాష్ర్టం? 1) మిజోరాం 2) హర్యానా 3) రాజస్థాన్ 4) ఉత్తరాంచల్ 4. ఎయిర్ కూలర్లో ఉపయోగించే గడ్డి? 1) సైప్రస్ 2) చిర్ 3) కుష్ 4) సెమూల్ 5. ఆల్ఫైన్ వృక్ష జాతులను ఎక్కువగా ప్రభావితం చేసే అంశం? 1) పవనాలు 2) ఎత్తు 3) సూర్యరశ్మి 4) తీర ప్రాంతం 6. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్‌ను ఎప్పుడు ప్రారంభించారు? 1) 1973 2) 1975 3) 1976 4) 1977 7. సిమ్లిపాల్ పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది? 1) జార్ఖండ్ 2) ఛత్తీస్‌గఢ్ 3) ఒడిశా 4) అసోం 8. బీడీ పరిశ్రమల్లో ఉపయోగించే ఆకు? 1) మహల్ 2) కెందు 3) కిర్ 4) మోదుగ 9. ఘనా పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? 1) గుజరాత్ 2) మహారాష్ర్ట 3) అసోం 4) రాజస్థాన్ 10. నందాదేవి బయోస్పియర్ రిజర్వ ఏ రాష్ర్టంలో ఉంది? 1) సిక్కిం 2) హిమాచల్ ప్రదేశ్ 3) ఉత్తరాఖండ్ 4) జమ్మూ కాశ్మీర్ సమాధానాలు: 1) 1; 2) 3; 3) 2; 4) 3; 5) 2; 6) 1; 7) 3; 8) 2; 9) 4; 10) 3.