కూల్ టిప్స్
మండుటెండల్లో మలయ సమీరాలను మరిపించే గాలితో చల్లబరిచే ఎయిర్ కూలర్... ఇప్పుడు మన జీవితాల్లో భాగమైపోయింది. అయితే అది ఎప్పుడూ అంతే చల్లదనాన్ని ఇవ్వాలంటే మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కూలర్‌లో ఎప్పుడూ మంచినీరే నింపాలి. మురికి నీరు వేస్తే ప్యాడ్స్‌తో పాటు లోపలి ట్యాంక్ కూడా మురికిపట్టిపోతుంది. కూలర్‌లోని ఆటోగ్రిల్ పని చేయడానికి ఒక బెల్ట్ ఉంటుంది. దాని పనితనాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అది పాడైతే ఇక కూలర్ నుంచి చల్లదనం అందదు. కొన్ని కూలర్లలో గడ్డి ఉంటుంది. దాన్ని కూడా ఎప్పటికప్పుడు గమనించుకోవాలి.
అది పాడైతే నీళ్లు లీకయ్యే ప్రమాదం ఉంది. కూలర్ ఉంది కదా అని కొందరు తలుపులు, కిటికీలన్నీ మూసేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. కచ్చితంగా ఒక్క కిటికీనైనా తెరిచి ఉండాలి. వేసవి అయిపోయింది కదా అని కూలర్‌ని ఓ మూలన పడేయకండి. అప్పుడప్పుడూ ఆన్ చేస్తూ ఉండండి. లేదంటే కొన్ని కూలర్లు తర్వాత పనిచేయకుండా మొండికేస్తాయి.