
'స్విస్ చాలెంజ్'కు నోటిఫికేషన్
ఎన్నిఅభ్యంతరాలు వ్యక్తమైనా స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం.
అమరావతి: ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్విస్ చాలెంజ్ బిడ్డింగ్ లకు సీఆర్డీఏ నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6.84 చదరపు కిలోమీటర్ల అమరావతి సిటీ నిర్మాణానికి బిడ్డింగ్ వెలువరించింది. 45 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం పేర్కొంది. స్విస్ ఛాలెంజ్ పద్థతిలో రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది.
స్విస్ చాలెంజ్ విధానంలో పాలకులు పక్షపాతంగా వ్యవ హరించే అవకాశం ఉన్నదనీ, ఆశ్రీత పెట్టుబడిదారులు (క్రోనీ కేపిటలిస్టులు) లబ్ధిపొందే వీలున్నదనీ, అవినీతికి ఆస్కారం ఉన్నదని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ నిర్ధారించినా చంద్రబాబు సర్కారు దీనికే ఓటు వేయడం గమనార్హం.