'స్విస్ చాలెంజ్ వెనుక కుట్ర దాగుంది' | ysrcp leader gowtham reddy slams chandrababu naidu govenrment over swiss challenge | Sakshi
Sakshi News home page

'స్విస్ చాలెంజ్ వెనుక కుట్ర దాగుంది'

Published Mon, Jul 25 2016 1:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

'స్విస్ చాలెంజ్ వెనుక కుట్ర దాగుంది'

'స్విస్ చాలెంజ్ వెనుక కుట్ర దాగుంది'

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విస్ చాలెంజ్కు మొగ్గు చూపడం వెనుక కుట్ర దాగుందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్విస్ చాలెంజ్ విధానం అసాధ్యమని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

అయినా చంద్రబాబు సింగపూర్ కంపెనీలతో లాలూచీపడ్డారన్నారు. చంద్రబాబు, లోకేశ్ దేశీయ కంపెనీలకు దూరం పెడుతున్నారని గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్విస్ చాలెంజ్ బిడ్డింగ్లకు సీఆర్డీఏ నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement