gowtham reddy
-
సుప్రీంకోర్టులో YSRCP నేత గౌతంరెడ్డికి ఊరట
-
సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట
-
గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు
-
Mekapati Goutham Reddy Death: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక లేరు
-
చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌నెట్ లో అవకతవకలు : గౌతమ్ రెడ్డి
-
ఏపీ ఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ ను విస్తరిస్తాం : గౌతమ్ రెడ్డి
-
అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం
-
సీఎంఆర్ఎఫ్లో భాగస్వాములుకండి: మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి : కరోనా విపత్తను ఎదుర్కోవడానికి సీఎంఆర్ఎఫ్లో భాగస్వాములు కావాలని మంత్రి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు పరిశ్రమలు అండగా ఉంటాయని, ఆక్సిజన్ పాలసీ, ఆక్సిజన్ తయారీ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. సీఎంఆర్ఎఫ్కు తన సొంత సంస్థ కేఎంసీ నుంచి రూ.కోటిన్నర ప్రకటించారు. మంత్రి పిలుపు మేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ముందుకొచ్చాయి. అమరరాజ బ్యాటరీ సంస్థ సీఎంఆర్ఎఫ్కు రూ.కోటి విరాళం ప్రకటించింది. చిత్తూరు జిల్లాలో 500 బెడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపింది. హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ తూ.గో.జిల్లాకు 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇస్తామని ప్రకటించింది. సీసీఎల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీఎంఆర్ఎఫ్కు రూ.కోటి 11 లక్షలు.. డిక్సస్ కంపెనీ రూ.75 లక్షలు విరాళం ప్రకటించాయి. -
నిమ్మగడ్డకు షాకిచ్చిన కంపసముద్రం గ్రామస్తులు
సాక్షి, నెల్లూరు: మంత్రి గౌతమ్‌రెడ్డి ఇలాకలో పంచయతీ ఎన్నికలు సంచలనంగా మారాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాలలో పెద్ద సంఖ్యలో జరిగిన ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలపై కంపసముద్రం గ్రామస్తులు తిరగుబాటు చేశారు. ఏకగ్రీవాలపై ఆయన చేసిన ప్రకటన నేపథ్యంలో ఎన్నికలు బహిష్కరించాలని గ్రామస్తులు తీర్మాణం తీసుకుని ఎస్ఈసీకి షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డ ఎసీఈసీగా ఉన్నంతకాలం పంచాయతీ ఎన్నిక వద్దంటూ గ్రామస్తులు తీర్మాణించడంతో అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్ స్థానానికి మొదట 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా వారంతా గ్రామస్తుల తీర్మాణంతో నామినేషన్‌ను ఉపంసహరించుకున్నారు. -
ఏపీలో సాంకేతిక విప్లవం తీసుకువస్తాం: గౌతమ్ రెడ్డి
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తామని, సాంకేతిక విప్లవం తీసుకువస్తామని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ మొత్తం విశాఖపట్నం నుంచే మొదలవుతుంది. ఫైబర్ నెట్ వర్క్ సేవల్ని మరింత పటిష్టం చేస్తాం. ఫైబర్ నెట్‌కు రెండు ఎకరాలు కేటాయించారు. ప్రతి పల్లెకు ఇంటర్ నెట్ సేవలు అందిస్తాం. గూగుల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బ్యాండ్ విడ్త్ స్పీడ్ పెంచుతాం. 10 లక్షల కనెక్షన్లు ఉన్న వాటిని 50-70 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయి. విచారణ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారి ఆలోచనలకు అనుగుణంగా ఏపీ ఫైబర్ నెట్ సేవలు ఉంటాయి. మారుమూల పల్లెల్లో కూడా ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 599 రూపాయలు చెల్లిస్తే ఆన్ లిమిటెడ్ ఇంటర్ నెట్. చాలా క్వాలిటీతో కూడిన సేవల్ని అందిస్తాం. పోల్ ఉచితంగా అందిస్తా’’ మన్నారు. -
నారాయణ స్కూల్ ర్యాంకుల్లా లోకేష్ ప్రచారం
సాక్షి, అమరావతి : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెట్‌లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానం సాధించడంపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి తప్పుబట్టారు. గత టీడీపీ పాలన వల్లనే మొదటి ర్యాంక్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ నేతల దిగజారుడు తననానికి నిదర్శమన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్లు దిగజారి ఉన్నాయని, 10వ తరగతి ఫలితాల రోజు నారాయణ స్కూల్ ర్యాంకులు ప్రచార చేసినట్టు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.సర్వే ప్రక్రియ 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు జరిగిందని, ఈ సమయంలో రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందో చూసుకోవాలిన హితవుపలికారు. అబద్ధాలతో లోకేష్ భవిష్యత్కే నష్టమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎంఎస్ఈలకు ఉపయోగపడుతుందని, 2019 ఆగస్ట్‌లో రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణల డేటా పంపినట్లు వివరించారు. (సీఎం జగన్ సంకల్పం.. ఏపీ నెంబర్ వన్) సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. ‘గతంలో ర్యాంక్‌కు, ఇప్పుడొచ్చిన ర్యాంక్‌కు చాలా తేడా ఉంది. మొట్టమొదటి సారి సర్వే చేసి ఫలితాలు ఇచ్చారు. గతంలో ప్రభుత్వం ఎవరిని సూచిస్తే వారితోనే సర్వే చేశారు. అది కూడా కేవలం 10శాతం మాత్రమే సర్వే చేశారు. 32లక్షల కోట్ల ఎంవోయూలు అన్నారు. 50వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. ప్రభుత్వం 20 ఏళ్లూ పెనాల్టీ కట్టే రీతిలో రాయితీలు పెట్టారు. మా వల్ల పరిశ్రమలు, పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?. సీఎం జగన్ పారదర్శక పాలన వల్ల ఇది సాధ్యమైంది. సీఎం జగన్ విధానాలపై పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నారు’ గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. (జగన్ పాలనపై 100% సంతృప్తి) -
సీఎం జగన్ చర్యల వల్లే ఏపీకి టాప్ ర్యాంక్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెంబర్ వన్ ర్యాంకు రావడంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యల వల్లే టాప్ ర్యాంక్ వచ్చిందని ఆయన అన్నారు. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి శనివారమిక్కడ మాట్లాడుతూ... కరోనా దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటునిచ్చారని పేర్కొన్నారు. పరిశ్రమలు మళ్లీ నడిచేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను ముఖ్యమంత్రి కల్పించారని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారన్నారు. (ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌వన్) సింగిల్ డెస్క్ పోర్టల్‌లో పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు వాణిజ్య వివాదాలకు ఈ ఫైలింగ్ సౌకర్యం ఉందని మంత్రి మేకపాటి తెలిపారు. విజయవాడ, విశాఖలో వాణిజ్య వివాదాలకు ప్రత్యేక న్యాయస్థానం, ఔషధాల విక్రయ లైసెన్స్ ఆన్లైన్లోనే పొందే సౌకర్యం ఉందన్నారు. ఏటా రెన్యువల్ చేసుకునే అవసరం లేకుండా షాపులకు మినహాయింపు, కార్మిక చట్టాల కింద సింగిల్ ఇంటిగ్రేటెడ్ రిటర్న్స్ దాఖలుకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. ప్రతి పరిశ్రమలో స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తున్నామని అన్నారు. హిందూపురం, విజయవాడ, విశాఖ ఇండస్ట్రీయల్ పార్క్‌ల్లో వాణిజ్యవేత్తలతో పలుమార్లు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి మేకపాటి తెలిపారు. -
కార్మిక సంక్షేమానికి నిర్వచనంగా జగన్ పాలన
మే ఒకటో తేదీ రాగానే కార్మికుడి హృదయం విజయగర్వంతో ఉప్పొంగు తుంది. పెట్టుబడిదారీకి పుట్టినిల్లునైన అమెరికాలో దాదాపు 130 ఏళ్ల క్రితం శ్రమ దోపిడీపై కార్మికులు ఉద్యమిం చారు. 1886 మే 1న చికాగో కార్మికులు రోజుకు 8 గంటల పనిదినం కోసం ఉద్య మించిన రోజే ప్రపంచ కార్మిక దినో త్సవం మేడేగా ప్రసిద్ధికెక్కింది. ఆ నెల లోనే 3వ తేదీన సమ్మెచేస్తున్న కార్మికులపై అమెరికన్ పోలీసులు కాల్పులు జరిపి కార్మికులను పొట్టన బెట్టుకున్న ఘటనకు నిరస నగా మే 4న హేమార్కెట్ ప్రాంతంలో కార్మికులు చేస్తున్న శాంతి యుత ఆందోళనపై పోలీసులు తుపాకీ గుళ్లవర్షం కురిపించిన ప్పుడు హే మార్కెట్ ప్రాంతం మొత్తం కార్మికుల రక్తంతో తడిసి పోయింది. నాటి స్ఫూర్తితో నేటికీ కార్మికవర్గాలు మేడే పండుగ ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కార్మికుల హక్కును కాలరాసే కుట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడూ, అలాగే 2014లో విభజనానంతరం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నిలువునా వంచి స్తూనే వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికవర్గానికి వంద లాదిగా హామీలిచ్చి ఓట్లేయించుకుని గెలిచిన తరువాత ఆ ఊసే ఎత్తలేదు సరికదా, అదేమని గొంతెత్తి అడిగితే వారిపై ఉక్కు పాదం మోపారు. సమ్మిట్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్విని యోగం చేసి ఒక్క ఉద్యోగం కూడా లేకుండా చేశారు. రాజధాని పేరిటా మోసం.. ఏడాదికి మూడు పంటలు పండే ప్రాంతంలో రైతుల నుండి బల వంతంగా భూములు లాక్కుని రైతు కూలీలకు ఉపాధిని బల వంతంగా తీసేశారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు కూడా ఆల్విన్, హెచ్ఎంటీ వంటి ప్రభుత్వ రంగ సంస్థ లను, నిజాం షుగర్స్‌ను బలవంతంగా మూసేయించి వేలాది మంది కార్మిక కుటుంబాలను రోడ్డున పడేశారు. రాజధాని పేరుతో వ్యవసాయ కార్మికుల నోటికాడి కూడును బలవంతంగా లాగేసి కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచారు. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని ఇప్పటి ప్రభుత్వం చెబితే అక్కడ రాజధాని ప్రాంత పరిధిలో ఎలా ఇస్తారంటూ తన అనుయాయు లతో కోర్టుకెక్కారు. అంటే తనకు అవసరమైన చాకలి, మంగలి, వడ్రంగి, సఫాయి వంటి కార్మికులు అక్కడ నివాసం ఉండేందుకు మాత్రం అర్హులుకారని, కేవలం వారి అవసరాలనుతీర్చే యంత్రా లుగానే ఆయన చూసినట్లు మనకు స్పష్టంగా అర్థమౌతోంది. 'నేనున్నానంటూ... ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ నాటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిగారు సుదీర్ఘ పాదయాత్ర చేసి వారి కష్టాలను కళ్లారా చూశారు. తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 10 వేల వంతున ఇస్తామని, బీమా సౌకర్యం కల్పిస్తామని, కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా మని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈలను ప్రోత్స హించి మరింత మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నియో జకవర్గానికి ఎంఎస్ఎంఈల ఏర్పాటుతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. అంతే.. ఆయన మాటలను నమ్మిన కార్మిక వర్గం 2019 ఎన్నికల్లో ఆయనకు వెన్ను దన్నుగా నిలిచింది. ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ఆటో కార్మికులకు రూ. 10 వేల హామీని అమలు చేసి చూపించారు. ప్రమాద భీమాను రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మిక పక్షపాతి నని రుజువు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఎంచుకున్న రంగాల్లో శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి అవకాశాలను మెరుగు పర్చేందుకు కార్యాచరణ రూపొందించారు. పైగా ఏపీలో ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చారు. అధికారం లోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నాలుగు లక్షల మందికి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాలను ఇచ్చారు. పైగా ప్రతి ఏడాది మార్చి నెలలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నియా మకాలకు కేలండర్ విడుదల చేస్తున్నారు. కార్మికులు, కర్షకులు మద్యం మహమ్మారి బారినపడి వారి కుటుంబాలు ఛిద్రం కాకుండా దశలవారీగా మద్య నియంత్రణ చేస్తామని చెప్పి చేతల్లో చూపించారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని బెల్టు షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారు. బార్లను 40 శాతం కుదించారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించేలా చేసి చూపారు. ఆదర్శ వంతమైన పాలనకు ఊపిరిలూదారు. కార్మికులకు అన్నగా, తమ్ము డిగా కొమ్ముగాస్తూ అండగా నిలిచారు. కరోనా ప్రభావం ... రెక్కాడితేగాని డొక్కాడని కార్మిక, కర్షక, తాడిత, పీడిత వర్గాలపై కరోనా మహమ్మారి కోరలు చాచింది. కరోనా ప్రభావంతో షాపిం గ్మాల్స్, సినిమా హాల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వీటిల్లో పనిచేసే చిరుద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి ప్రదేశాలు కూడా మూతపడటంతో ఆయా ప్రాంతాల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ పనులు కోల్పో యారు. కూరగాయల మార్కెట్లు, దుకాణాలపైనా కరోనా ప్రభావం పడింది. ఆటో కార్మికులు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడంలేదు. సరుకులు అమ్ముడు పోక వ్యాపారాలు తగ్గడంతో పరిశ్రమల యజమానులు ఉత్పత్తి తగ్గించి, ఆ మేరకు కార్మికులకు సెలవులు ఇస్తున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కోట్లాది మంది కార్మికులు, రైతులు, కూలీల జీవన స్థితిగతులు అతలాకుతలం అయ్యాయి. పనిచేస్తేనే పూట గడిచే వారి జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22 నుండి లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. అప్పటి నుండి వారికి చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఫ్యాక్టరీలు, చేతివృత్తుల వారికి కూడా పనుల్లేక పస్తులుండా ల్సిన పరిస్థితుల్లో దాతల దాతృత్వం వెల్లివిరిసింది. ప్రభుత్వాల సాయం అందింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఒక్క ఏప్రిల్ నెలలోనే మూడు దఫాలుగా రేషన్ సరుకులు ఇవ్వడంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేశారు. అంతే కాకుండా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూ. వెయ్యి వంతున ఆర్థిక సాయం అందించారు. ఏ దేశంలోనైనా సమాజ మార్పునకు చోదక శక్తి కార్మిక వర్గమే. మనలాంటి వెనుకబడిన దేశంలో కార్మికులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. మెరుగైన సమాజం కోసం శ్రామికవర్గం దీక్షబూనాలి. ఆ మహ త్తర సంకల్పంతోనే ముందుకు సాగాలి. అందుకు పాలకులు సహృదయంతో సహకరించాలి. ఏపీలో కార్మిక వర్గాల బాధలను తన బాధలుగా చూసే సీఎం ఉండటం మనందరి అదృష్టం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో కార్మిక వర్గానికి ఈ మేడే మంచి రోజులను ప్రతిబించాలని, మెరుగైన కార్మిక చట్టాలను, విధానాలను అమలు చేయాలని, చేస్తారని ఆశిస్తూ.. (నేడు మేడే సందర్భంగా) డా. పి గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్ : 98481 05455 -
'నైపుణ్య కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ'
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్పై గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ యునివర్సిటీ ఏర్పాటు, భవనాల నిర్మాణం, ప్రవేశ పెట్టాల్సిన కోర్సులపై చర్చించారు. కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ఐటీఐ, డిప్లమో, ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సులు పూర్తిచేసినవారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచాలన్నారు. (విద్యార్థుల మృతదేహాలను రప్పించండి) ఇప్పటికే ఆ తరహా కోర్సులు చేస్తున్న వారికి ఏడాది అప్రెంటిస్ ఇవ్వడమే యూనివర్శిటీ, నైపుణ్య కేంద్రాల ప్రధాన ఉద్దేశం అని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నైపుణ్య కేంద్రంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ తదితర కోర్సుల విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ది చేయడంతో పాటు జీవనోపాధి కోసం ఇతరులకు చిన్న చిన్న పనులు నేర్పించడానికి శిక్షణా తరగతులు నిర్వహించాలని వెల్లడించారు. ఈ మొత్తం కార్యక్రమాలను ఎన్ఐసీ ద్వారా నిర్వహించాలని జగన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కో ఫ్యాకల్టీలో ప్రముఖ సంస్థల భాగస్వామ్యాలు తీసుకోవాలన్నారు. దీనివల్ల ఈ కోర్సులకు మరింత విలువ ఉంటుందని, వైద్య రంగంలో అందించే సర్వీసులకు కూడా ఈ నైపుణ్య కేంద్రాల్లోనే శిక్షణ అందించాలని తెలిపారు. హై ఎండ్ స్కిల్స్ కోసం విశాఖలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని జగన్ అధికారులను కోరారు. ఏ కోర్సుకైనా కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలన్నారు. ఇప్పటివరకూ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ లాంటి వివిధ కోర్సులు చదువుతున్న వారే కాదు, కోర్సులు పూర్తైన వారు కూడా ఈ కేంద్రాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అధ్యాపకులను అప్‌గ్రేడ్ చేసేందుకు వారికి సంబంధించిన శిక్షణా తరగతులు కూడా నైపుణ్య కేంద్రాల్లోనే నిర్వహించాలని జగన్ వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గౌతంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు కేంద్ర మంత్రుల అభినందనలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలను కేంద్ర మంత్రులు స్వయంగా అభినందిస్తున్నారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ప్రజలెవ్వరూ వైరస్ బారినపడకుండా సీఎం ఆదేశాల మేరకు అధికారులను కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో కరోనా పరీక్షల కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 వేల కోవిడ్ కిట్లను ఉత్పత్తి చేశామని, అన్ని జిల్లాలు, మండలాలకు సరఫరా చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మంత్రి గౌతమ్ రెడ్డి గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్తగా మరో 50 వేల టెస్టింగ్ కిట్లను ఉత్పత్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. మొత్తం లక్ష కరోనా వైరస్ కిట్లతో రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజుల్లో 20లక్షల పరీక్షలు చేస్తామని వెల్లడించారు. రెండు రోజుల్లో ఇండియన్ టెక్నాలజీతో వెంటిలేటర్లు తయారు చేస్తున్నామని, దేశంలో ఇలా తయారు చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైంది. భవిష్యత్‌ను ముందే ఊహించి టెస్టింగ్ కిట్లను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. 35 రోజుల్లోనే టెస్టింగ్ కిట్ల ఉత్పత్తి చేయగలిగాం. పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టాం. కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ కిట్లను అందిస్తాం. ఇందుకోసం ప్రభుత్వమే చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంఎస్ఎంఈలను ఆదుకుంటాం. లాక్ డౌన్ నేపథ్యంలో ఎంఎస్ఎంఇ లకు రాయితీలివ్వాలని సీఎం భావిస్తున్నారు. కోవిడ్‌తో నష్టపోయిన పరిశ్రమలను ఆదుకోవాలని సీఎం చర్యలు చేపడుతున్నారు’ అని తెలిపారు. -
పరిశ్రమలకు ఉన్న ప్రతి సమస్య పరిష్కరిస్తున్నాం
-
రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి ఉజ్వల భవిత
సాక్షి, హైదరాబాద్ : రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి మంచి భవిష్యత్తు ఉందని హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ అన్నారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న అమెరికా భారత్ రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఢిల్లీ రాయబార కార్యాలయ అధికారి కెప్టెన్ డేనియల్ ఇ ఫిలియన్, ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విశాఖపట్నంలో అమెరికా, భారత్ త్రివిధ సైనిక దళాలు ప్రదర్శించిన సైనిక విన్యాసాలు రక్షణ రంగంలో ఏపీ సామర్థ్యానికి అద్దం పట్టాయన్నారు. ఏపీ, తెలంగాణలతో అత్యున్నత రక్షణ సాంకేతిక సహకార బంధం ఏర్పరుచుకునేందుకు పలు అమెరికన్ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయన్నారు. భౌగోళికంగా చూస్తే.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అనేక అనుకూలతలున్నాయని తెలిపారు. అమెరికా విద్యాసంస్థల్లో చదివే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీసాల జారీని కొనసాగించడంతో పాటు, భవిష్యత్తులో వాటి సంఖ్యను కూడా పెంచుతామని చెప్పారు. తాజాగా అమెరికా, భారత్ నడుమ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఒప్పందానికి రెండు దేశాలు తుది రూపునిచ్చినట్టు తెలిపారు. దీని మూలంగా రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బదిలీతో పాటు.. భాగస్వామ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేస్తుందని రీఫ్‌మన్ వెల్లడించారు. ఇంగ్లిష్‌మీడియం నిర్ణయం భేష్ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను తప్పనిసరిచేస్తూ ఏపీ ప్రభుత్వం చట్టం చేయడాన్ని రీఫ్‌మన్ స్వాగతించారు. అంతర్జాతీయంగా సాంకేతికత, ఇతర అంశాల్లో ఇంగ్లిష్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని, విద్యార్థులకు బాల్యం నుంచి ఇంగ్లిష్‌ను నేర్పించడం ద్వారా వివిధ అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఏపీ వాటాను పెంచుతాం సాక్షి, హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వాటాను రానున్న రెండేళ్లలో మూడింతలు పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఎనిమిది రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా ఉందన్నారు. హైదరాబాద్‌లో రెండు రోజులుగా జరుగుతున్న భారత్, అమెరికా రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను పురోభివృద్ధి బాటలో నడిపేందుకు రూపొందిస్తున్న రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే రంగాలు, అంశాలను గుర్తించినట్టు తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ కారిడార్లు రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించామన్నారు. భారతీయ సైనిక బలగాలు, నౌకదళంతో ఏపీ ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకుందని, రామాయపట్నం పోర్టులో నేవీ బేస్, దొనకొండలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు తదితరాలను గౌతంరెడ్డి ఉదహరించారు. సబ్‌మెరైన్, ఎయిర్‌క్రాఫ్ట్ బేస్, ఆఫ్‌షోర్ రిజర్వు తదితరాలతో ఇప్పటికే విశాఖ పారిశ్రామిక, సైనిక కేంద్రంగా ఉందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో దేశ తూర్పు తీరం కీలక పాత్ర పోషించనుందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ (డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్)ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న రక్షణ ఒప్పందాల నేపథ్యంలో ఏపీకి చెందిన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు ‘సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్’లో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్(ఓఈఎం) సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ఏపీ రూపొందించే పారిశ్రామిక విధానంలో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి ప్రాధాన్యమిస్తూ డిఫెన్స్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా ఓఈఎంలకు ఉత్పత్తి సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ రంగంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తామని గౌతంరెడ్డి వెల్లడించారు. మానవ రహిత విమానాల(యూఏవీ) కోసం ప్రత్యేక పాలసీ సిద్ధం చేస్తున్నామన్నారు. ఎక్కువ ఉద్యోగాలు, పెట్టుబడులతో రాష్ట్రానికి సహకరించాల్సిందిగా వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో విశాఖ కేంద్రంగా ఆర్థిక విప్లవం వస్తుందని గౌతంరెడ్డి వెల్లడించారు. మాట్లాడుతున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. చిత్రంలో రీఫ్‌మన్ -
విశాఖలో బిమ్స్టెక్ అంతర్జాతీయ సదస్సు
-
అక్టోబర్ 4న వాహన మిత్ర పథకం ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీఠ వేశారని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్రాధ్యక్షుడు గౌతంరెడ్డి అన్నారు. అక్టోబర్ 4న వాహన మిత్ర పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా కార్మికులకు ఏడాదికి 10వేల రూపాయలు అందిస్తామన్నారు. ఆటోడ్రైవర్లు, షాపులున్న నాయి బ్రాహ్మణులకు చేయుతనివ్వనున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పారిశుధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంఘీభావంగా వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభినందన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జగన్ చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను ఓర్వలేకే చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. -
‘వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు’
సాక్షి, అమరావతి : గుంతకల్లు డీఎస్పీ.. తెలుగుదేశం పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బందిపెడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత గౌతంరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. బుధవారం సీఈఓ ద్వివేదీని కలిసిన ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్ రోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రత పెంచాలని కోరారు. ఆర్వో, పీఓలతోపాటు డీఎస్పీని ఎన్నికల విధులనుంచి తొలగించి కౌంటింగ్ నిస్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. -
‘క్రిమినల్ కేసులున్న పోలీసులకు పోస్టింగులు’
సాక్షి, విజయవాడ : అధికార తెలుగు దేశం పార్టీ ఎన్నికల నిబంధనలను పట్టించుకోవడం లేదని, క్రిమినల్ కేసులు ఉన్న పోలీస్ ఆఫీసర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించకూడదని వున్నా.. వారికి పోస్టింగులు ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎన్నికల నిబంధనల నిఘా కమిటి సభ్యుడు నాగిరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ట్విటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కామెంట్స్ ట్యాగ్ చేస్తున్నారని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటివరకు వెయ్యి మాత్రమే రైతుల ఖాతాలో జమైనా.. 15 వేల రూపాయలు రైతులకు ఇచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత ముగ్గురు ఐపీఎస్‌లకు అడిషనల్ డీజీ పదోన్నతులు ఇచ్చారని తెలిపారు. వీటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఆ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు : గౌతంరెడ్డి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆర్థికపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని వైఎస్సార్ సీపీ ఎన్నికల నిబంధనల నిఘా కమిటీ సభ్యుడు గౌతంరెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ప్రతిపని ఎన్నికల నిబంధనల ప్రకారం జరగాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలతో కూడిన భారీ కటౌట్లు పెట్టారని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘క్రిమినల్ కేసులున్న పోలీసులకు పోస్టింగులు’
-
‘ఇది హేయమైన చర్య’
సాక్షి, విజయవాడ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ గురువారం ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి తరలిరాగా.. ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదని చెప్పిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను అరెస్టు చేసి గవర్నర్ పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, గౌతం రెడ్డి.. సూర్యనారాయణను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్‌పై ఆందోళన చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఉద్యోగులపై పోలీసులను ప్రయోగించడం హేయమైన చర్య అని విమర్శించారు. అరెస్టు చేసిన ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
‘బాబు సర్కారుకు గుణపాఠం చెప్పాలి’
సాక్షి, విజయవాడ: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారుకు గుణపాఠం చెప్పాలని వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్టీయూసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలను చర్చించినట్లు తెలిపారు. కార్మిక గర్జనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆటో యూనియన్ సదస్సులు నిర్వహించాలని, యూనివర్శిటీల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
‘కాంట్రాక్ట్ కార్మికులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు’
సాక్షి, విజయవాడ : కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్‌కు సంబంధించి వేసిన కేబినెట్ సబ్‌కమిటీ ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదని మండిపడ్డారు. ఇలా కమిటీలు వేయడం.. నివేదికలు విస్మరించడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. పర్మీనెంట్ చేసే విషయంలో ఇప్పుడు సుప్రీం ఉత్తర్వులు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ ఎందుకు వేసిందని నిలదీశారు. కాంట్రాక్ట్ కార్మికులను చంద్రబాబు మోసం చేస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకుంటారని గౌతం రెడ్డి పేర్కొన్నారు. -
శివాజీకి ముందే ఎలా తెలుసు?
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు నాయడు కనుసన్నల్లోనే ఆపరేషన్ గరుడ జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డిలు ఆరోపించారు. ఆపరేషన్ గరుడ కుట్రదారుడైన నటుడు శివాజీపై చర్య తీసుకోవాలంటూ వారు సోమవారం నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నటుడు శివాజీ చౌదరిని ఉపయోగించి చంద్రబాబు ఈ కుట్ర కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కూడా ఆ కుట్రలో భాగమేనన్నారు. కత్తితో హత్యకు ప్రయత్నించిన శ్రీనివాస్‌తో పాటు చంద్రబాబు, శివాజీ చౌదరిలను విచారించాలని డిమాండ్ చేశారు. శివాజీ చౌదరి గరుడ పురాణం చెప్పడం... శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం.. శివాజీ ముందే చెప్పాడంటూ చంద్రబాబు సమర్ధించడం కుట్ర అనేందుకు నిదర్శనమన్నారు. గరుడ కుట్ర పేరుతో మాట్లాడుతున్న శివాజీ చౌదరిపై తక్షణమే కేసు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. శివాజీకి ముందస్తుగా ఈ సమాచారం ఎలా వచ్చిందని, ఈ సమాచారం అందించిన వారు ఎవరో బయట పెట్టాలన్నారు. -
అన్నం పెట్టే మహిళల అరెస్ట్ ఒక దుర్మార్గపు చర్య
-
కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
-
‘సీఎం తన వర్గంతో దొంగ దీక్షలు’
సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతం రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం తన వర్గంతో దొంగ దీక్షలు చేయిస్తున్నారని గౌతం రెడ్డి ధ్వజమెత్తారు. అంతేకాక కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని చెప్పి సీఎం మోసం చేశారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేని పరిస్థితి నెలకుందని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నారు. వైఎస్స్‌ర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనుల కోసం 30 సంవత్సరాలుగా కార్మికుల పోరాటం చేస్తున్న విషయాన్ని సీఎం పట్టించుకోలేదని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత గౌతం రెడ్డి గుర్తు చేశారు. -
ఐకేపీ ఉద్యోగులను, ఆదర్శ రైతులను ఎందుకు తొలగించారు
-
‘పచ్చచొక్కా వేసుకుంటేనే ఉద్యోగాలా?’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నేత గౌతమ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ఐకేపీ ఉద్యోగులను, ఆదర్శ రైతులను ఎందుకు తొలగించారని గౌతమ్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పచ్చ చొక్కాలు వేసుకుంటేనే ఉద్యోగాలు ఇస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచమంటే నాటకాలు ఆడుతోందని పేర్కొన్నారు. -
'సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'
హైదరాబాద్: కార్మిక వర్గ పొట్టకొట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిద్దామని, రేపు (సెప్టెంబర్ 2న) సార్వత్రిక సమ్మెను జయపద్రం చేద్దాం' అంటూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల భారత్ బంద్ నేపథ్యంలో గురువారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు ముందు హామీలతో ఊదరగొట్టి.. తీరా ఎన్నికలైపోయాక కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి ఉద్యోగాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని చంద్రబాబు నాయుడు సంపాదించేసుకున్నారని గౌతంరెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేసి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీరణ, కార్మిక సంస్కరణల పేరిట మొత్తం కార్మికుల చట్టాలన్నింటినీ కుదించి కార్మికుల హక్కును అణిచివేయడం లాంటి చర్యలు కార్మికులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని గౌతంరెడ్డి దుయ్యబట్టారు. కాగా, రేపు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఈ బంద్ నేపథ్యంలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా సంస్థలు మూతపడనున్నాయి. అఖిల భారత సమ్మెకు స్థానిక కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. -
'స్విస్ చాలెంజ్ వెనుక కుట్ర దాగుంది'
-
'స్విస్ చాలెంజ్ వెనుక కుట్ర దాగుంది'
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విస్ చాలెంజ్‌కు మొగ్గు చూపడం వెనుక కుట్ర దాగుందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్విస్ చాలెంజ్ విధానం అసాధ్యమని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినా చంద్రబాబు సింగపూర్ కంపెనీలతో లాలూచీపడ్డారన్నారు. చంద్రబాబు, లోకేశ్ దేశీయ కంపెనీలకు దూరం పెడుతున్నారని గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్విస్ చాలెంజ్ బిడ్డింగ్‌లకు సీఆర్డీఏ నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు నాలుగెకరాలు కొనుక్కోలేరా?
-
చంద్రబాబు నాలుగెకరాలు కొనుక్కోలేరా?
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార దుర్వినియోగంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు చంద్రబాబు తప్పుడు పాలసీ తీసుకు వచ్చారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నల్లపాడులో రైతుల భూములు లాక్కోవడం దారుణమన్నారు. భూములను చంద్రబాబు యథేచ్చగా మింగేస్తున్నారని, రైతుల భూములు లాక్కొని పార్టీలకు ఎలా ఇస్తారని అంబటి ప్రశ్నించారు. బినామీ పేర్లతో వేలకోట్లు దోచుకుంటున్న చంద్రబాబు నాలుగెకరాల భూమిని కొనుక్కోలేరా అని వ్యాఖ్యానించారు. రాజధానిలో నాలుగెకరాలు.. జిల్లాల్లో రెండు ఎకరాలు కొట్టేయాలని చూస్తున్నారని అంబటి అన్నారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపు పేరుతో చంద్రబాబు పెద్ద మొత్తంలో టీడీపీకి భూములు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆయన చెప్పారు. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి కేటాయిస్తామనడం సరైన పద్దతి కాదన్నారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును అడ్డుకోని బీజేపీ దుర్మార్గానికి పాల్పడిందని వైఎస్ఆర్ సీపీ నేత అంబటిరాంబాబు విమర్శించారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్డీఏనే ప్రత్యేక హోదాను ప్రకటించాల్సింది పోయి...ప్రైవేటు బిల్లును కూడా గందరగోళం సృష్టించి అడ్డుకొని పార్లమెంటరీ సంప్రదాయాల్ని తుంగలో తొక్కిందని అంబటి ఆరోపించారు. విభజన సమయంలో యూపీఏ ప్రవర్తిన తీరుగానే ఇప్పుడు ఎన్డీఏ ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. బాబు భూముల్ని కొల్లగొడుతున్నారు.. విజయవాడ: పేదల నుంచి భూములు లాక్కొని పెద్దలకు కట్టబెట్టడం చంద్రబాబు నాయుడుకు అలవాటైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు భూ భకాసురుడిగా మారి భూములను కొల్లగొడుతున్నారన్నారు. పేదల నుంచి వేల ఎకరాలను లాక్కొని పార్టీలకు లీజుకు ఇవ్వడాన్ని వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. -
'బందరు పోర్టులో చంద్రబాబుకు పరోక్ష వాటాలు'
విజయవాడ: బందరు పోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరోక్ష వాటాలున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత గౌతంరెడ్డి ఆరోపించారు. పోర్టు భూముల అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వాటాలున్నందుకే లక్షా ఐదువేల ఎకరాలను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని ఆయన సిద్ధమవుతున్నారని విమర్శించారు. గతంలో రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు సీఎం చంద్రబాబు భూములను అప్పజెప్పారని మండిపడ్డారు. ప్రస్తుతం బందరు పోర్టుతో చైనా కంపెనీలకు భూములు కట్టబెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల సీఎం తన చైనా పర్యటనలో ఆ దేశ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రైతులకు అండగా వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని వైఎస్ఆర్ సీపీ నేత గౌతంరెడ్డి అన్నారు. మొత్తం భూమిలో 22వేల ఎకరాలు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు కోసం, మిగతా భూమి పారిశ్రామిక కారిడార్, తదితర అవసరాల కోసం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా గౌతంరెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా విజయవాడ (సెంట్రల్)కు చెందిన పూనూరు గౌతంరెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురం (అర్బన్)కు చెందిన బుర్రా సురేష్‌గౌడ్ నియమితులయ్యారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆ నలుగురిని మళ్లీ బరిలోకి దింపండి..
విజయవాడ: తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీచేసి గెలవలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ సీనియర్ నేత సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ.. గతంలో దానం నాగేందర్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్‌కు వచ్చినప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారి చేత పదవులకు రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో నిలబెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్నారని, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళితే వారు రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తారు. ఇక్కడ మాత్రం నలుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించారా? అంటూ ప్రశ్నించారు. జలవనరుల ప్రాజెక్టుల్లో కుంభకోణం చేయగా వచ్చిన కోట్లాది రూపాయల సొమ్మును ఎరగా వేసి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ఖాన్ను రాజీనామా చేయించి తిరిగి టీడీపీ తరపున పోటీ చేయించాలని కోరారు. జలీల్‌ఖాన్‌పై ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఏడుగురు కార్పొరేటర్లలో మీ పార్టీ ఎవర్ని సూచించినా పోటీకి దింపి. పాతిక వేల మెజారిటీతో గెలిపించుకుంటామని సవాలు విసిరారు. చంద్రబాబు రాజధాని ప్రాంతాన్ని సింగపూర్‌గా మార్చుతానంటే ప్రజలు నమ్మారని, అయితే రాజకీయ వ్యభిచార కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికే తెలంగాణను కోల్పోయి రెండు కళ్లలో ఒక కన్ను పోగొట్టుకున్నారని, ఇప్పుడు రెండో కంట్లో నాలుగు యాసిడ్ చుక్కల్ని వేసుకుని ఆ కన్ను కూడా పోగొట్టుకునేందుకు సిద్ధమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి అన్నారు. ప్రజల్లో చంద్రబాబు గ్రాఫ్ రోజురోజుకు పడిపోతూ ఉండబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి ఇప్పుడు ఆకర్ష్ పథకం పెట్టి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు చేసే దుర్మార్గపు పనుల్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఆయన్న రాజకీయ సమాధి చేస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు. -
'పవన్.. నువ్వు పెయిడ్ ఆర్టిస్టువా ?'
సత్యనారాయణపురం (విజయవాడ): 'పవన్ కల్యాణ్.. నువ్వు సినీ ఆర్టిస్టా లేక పెయిడ్ ఆర్టిస్టువా..' అని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో 35 రోజుల తర్వాత స్పందించిన పవన్.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివారని విమర్శించారు. దీనికి నిర్మాత, దర్శకుడు, సంగీతం, మాటలు ఎవరో అర్థమవుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు స్టీఫెన్సన్కు ఫోన్ చేయడం నేరం కాదా ? ఆ ఫోన్ సంభాషణలని స్టీఫెన్సన్ రికార్డు చేయడం నేరమా ? అని నిలదీశారు. గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి ఓటుకు కోట్లు వ్యవహారంపై ఏమీ చెప్పక పోవడం సిగ్గుచేటన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదన్న పవన్ మాట దివాలాకోరు వాదనగా గౌతమ్‌రెడ్డి అభివర్ణించారు. -
వైఎస్సార్సీపీలో జిల్లాకు కీలక పదవులు
సాక్షి, నెల్లూరు: పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్రస్థాయి కమిటీల పునర్య్యవస్థీకరణలో జిల్లాకు కీలక పదవులు దక్కాయి. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడి గా, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ను కేంద్ర పాలక మండలి సభ్యుడిగా నియమించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ అధికార ప్రతినిధిగా, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇటీవల వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మేరిగ మురళీధర్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా ఏడు చోట్ల ఎమ్మెల్యేలుగా పార్టీ నాయకులే ఉన్నారు. నెల్లూరు, తిరుపతి ఎంపీలుగా కూడా వైఎస్సార్సీపీ నేతలే కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైఎస్సార్సీపీనే దక్కించుకుంది. ఈ క్రమంలోనే పార్టీని మరింత పటిష్టం చేసేందుకు జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. -
మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్
మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమశిల, న్యూస్‌లైన్: మాట తప్పని, మడమ తిప్పని ఏకైక నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అనంతసాగరం మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా పార్టీ అభ్యర్థుల తరపున గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, నాయకుడు ఊరిబిండి ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. మండలంలోని శంకరనగరం, రేవూరు, మినగల్లు, కొత్తపల్లి, పాతదేవరాయపల్లి, ముస్తాపురం, ఉప్పలపాడు, పీకేపాడు, సోమశిల, అనంతసాగరం, గౌరవరం, చిలకలమర్రి, బొమ్మలవరం, అగ్రహారం గ్రామాల్లో ఆయా సెగ్మెంట్ల పరిధిలో ప్రచారం నిర్వహించారు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపించారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ర్ట అభివృద్ధిని మరిచిన ఓ నాయకుడు ఇప్పుడు తానేదో చేస్తానంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని పరోక్షంగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు. ఆదివారం జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే నెల్లూరు పార్లమెంటు నుంచి తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని, ఆత్మకూరు అసెంబ్లీ నుంచి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకపాటి గౌతమ్‌రెడ్డిని నెల్లూరు మాజీ కార్పొరేటర్ రూప్‌కుమార్ యాదవ్ కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం జెడ్పీటీసీ అభ్యర్థి పెయ్యల సంపూర్ణమ్మ, నాయకులు చిలకా సుబ్బరామిరెడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి, బుట్టి వెంకటసుబ్బారెడ్డి, రాపూరు సుబ్బారెడ్డి, పాలపాటి నాగిరెడ్డి, కేతా రామకృష్ణారెడ్డి, పాల వెంకటకృష్ణారెడ్డి, పోతల నరసింహులు, ఎస్థానీ, బట్రెడ్డి చక్రధర్‌రెడ్డి, ఎద్దుల శ్రీనివాసులురెడ్డి, బొద్దుకూరు వెంకటేశ్వర్లురెడ్డి, కాలువ నరసింహులు, రాచపల్లి రమణారెడ్డి, రత్నారెడ్డి, కేసరి వెంకటేశ్వర్లురెడ్డి, రమణయ్య యాదవ్, మలినేని కొండయ్య, అక్కలరెడ్డి భాస్కర్‌రెడ్డి, లింగంగుంట జయరామయ్య, కేతా రవీంద్రారెడ్డి, గుండుబోయిన వెంకటరమణతోపాటు వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
మెట్టప్రాంత అభివృద్ధికి కృషి
అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్ : తాగు, సాగునీరు, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. పార్టీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, గోపిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని తెల్లపాడులో గడపగడపకూ వైఎస్సార్సీపీ పాదయాత్రను గౌతమ్‌రెడ్డి ప్రారంభించారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. తెల్లపాడు ఎస్సీ కాలనీలో, పాతూరు, కొత్తూరులో నాయకులతో కలిసి గడపగడపకూ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. మహానేత వైఎస్సార్ ప్రజల సంక్షేమం కోసం చేసిన అభివృద్ధి పనులను స్థానికులకు వివరిం చారు. వైఎస్సార్ సువర్ణపాలనను జగన్ మాత్రమే అందించగలరన్నారు. రాబో యే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాల ని కోరారు. గామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఆ యన్ను కోరారు. సమస్య పరిష్కారానికి గౌతమ్‌రెడ్డి సానుకూలంగా స్పందించా రు. కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు ప న్నినా జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నాయకులు సూరా భాస్కర్‌రెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, సర్పంచ్ వెంక ట రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, బ్రహ్మారెడ్డి, ఉపసర్పంచ్ షౌకత్ ఆలి, నాయకులు షబ్బీర్, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాదర్‌బాషా, హరికృష్ణారెడ్డి, తెల్లపాడు నాయకులు శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, సొసైటీ డెరైక్టర్ రమణారెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు, పుల్లలచెరువు శ్రీనివాసులురెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, చాన్‌బాషా పాల్గొన్నారు. చేనేతకు చేయూతనందిస్తాం సంగం: పాలకుల నిర్లక్ష్యంతో నానాటికీ సమస్యల ఊబిలో చిక్కుకుపోతున్న చేనేత పరిశ్రమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయూతనందిస్తుందని ఆ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి హామీ ఇచ్చారు. సంగంలో చేనేత కార్మికుడు బత్తూరి వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన ఆయనను స్థాని క చేనేత కార్మికులు కలిసి తమ కష్టాలు వివరించారు. గౌతమ్‌రెడ్డి స్పం దిస్తూ అందరికీ దుస్తులు అందించే చేనేత కార్మికులు., పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు లేక పస్తులుండటం దురదృష్టకరమన్నారు. మరమగ్గాలకు రాయితీలు ఇస్తూ చేనేత కార్మికులను పాలకులు గాలికొదిలేశారని విమర్శించారు. ఓ వైపు పెట్టుబడులు పెరిగిపోగా, మరోవైపు నేత వస్త్రాల ధరలు తగ్గి నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అర్థమవుతోందన్నారు. చంద్రబాబు పాలనలో పనులు లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అప్పటి ప్రతిపక్ష నేత మహానేత వైఎస్సార్ అసెంబ్లీ సాక్షిగా ఉద్యమించారని గుర్తు చేశారు. మహాప్రజాప్రస్థానం పాదయాత్రలో కష్టాలను స్వయంగా చూసి చేనేత కార్మికుల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. కార్మికుల జీవితాల్లో ఆనందం వస్తోందని సంతోషించే సమయంలో వైఎస్సార్ మృతిచెందడంతో మరోసారి చేనేత పరిశ్రమ కష్టాల్లో పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. రాజన్న ఆశయాలను ఆయన తీరుస్తారని, కొన్ని రోజుల పాటు అధైర్యపడకుండా కష్టాలను ఓర్చుకోవాలని సూచించారు. జగనన్న ప్రభుత్వంలో చేనేత పరిశ్రమకు పూర్తి స్థాయిలో చేయూతనందించి జీవితాలు ఆనందమయం చేస్తామని చెప్పారు. -
జగనన్నకు ప్రజలు, కార్యకర్తలే అండ
సోమశిల, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్ర జలు, కార్యకర్తలే అండ అని ఆత్మకూ రు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అనంతసాగరం మండలం సమీపంలో చాపురాళ్లపల్లి శివారు ప్రాంతంలో పాదయాత్ర క్యాంపు వద్ద ఆదివారం అనంతసాగరం, చేజర్ల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతో జగన్మోహన్రెడ్డి సీఎం కాబోతున్నారన్నారు. ఆయనకు ప్రజల దీవెనలు, కార్యకర్తల అండదండలున్నాయన్నారు. కాం గ్రెస్, టీడీపీ పన్నిన కుట్రలు, కుతంత్రాలు జగన్‌పై ఉండే ప్రజాభిమానం ముందు బలాదూర్ అయ్యాయన్నారు. వైఎస్సార్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. ఇకపై తాను పూర్తి కాలాన్ని నియోజకవర్గంపైనే దృష్టి పెడతానన్నారు. ప్రజాసేవకు మేకపాటి కుటుంబం అంకితమైందన్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించడం తథ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, మర్రిపాడు నాయకులు బిజివేముల సుబ్బారెడ్డితో పాటు ఆత్మకూరు నాయకులు పూనూరు రమేష్, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, అనంతసాగరం నాయకులు చిలకా సుబ్బరామిరడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి, ఎద్దుల శ్రీనివాసులురెడ్డి, కాటంరెడ్డి రమణారెడ్డి, రాచపల్లి రమణారెడ్డి, రత్నారెడ్డి, శ్రీమన్నారాయణ, శ్రీనివాసరాజు, బిజివేముల ఓబుల్‌రెడ్డి, కుప్పారెడ్డి, దశరథరామిరెడ్డి, కేతా రవీంద్రారెడ్డి, విజయ్‌మోహన్‌రెడ్డి, రమణయ్యయాదవ్, కలువాయి రోశిరెడ్డి, పార్లపల్లి కృష్ణారెడ్డి, సన్నపరెడ్డి నారసింహారెడ్డి, యు. మస్తానయ్య, మాజీ సర్పంచ్ సయ్యద్ ఎస్థానీ, కరేటి పెంచలయ్య, మాజీ సర్పంచ్ కాలువ నరసింహులు, లింగంగుంట జయరామయ్య, చేజర్ల నాయకులు బూదళ్ల వీరరాఘవరెడ్డి, ఉగ్గుమూడి రఘురామిరెడ్డి, బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పూనూరు మనోహర్‌రెడ్డి, గుండుబోయిన నారాయణ, మర్రిపాడు మండలం నాయకులు మన్నె రామ్‌గోపాల్, శేషం హజరత్బాబుయాదవ్, కొండారెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
బిడ్డలా ఆదరిస్తున్నారు
ఆత్మకూరు, న్యూస్‌లైన్: ఈ నీళ్లు తాగి ఇదిగో రోగాలొస్తున్నాయయ్యా..ఆది వెనకబడిన ప్రాంతాల్లో మహిళల ఆవేదన. పిం ఛన్ కూడా అందడం లేదు సామీ.. మీరైనా మా గోడు ఆలకించడయ్యా.. ఓ వృద్ధురాలి వేడుకోలు. గ్రామస్థాయిలో ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూస్తూ ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి పాదయాత్ర ముందుకు సాగుతోంది. గురువారం నాటికి గౌతమ్‌రెడ్డి పాదయాత్ర 250 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఏఎస్‌పేట మండలం హసనాపురం నుంచి గత నెల 22న మేకపాటి గౌతమ్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఏఎస్‌పేట, ఆత్మకూరు మండలంలోని ఆరవీడు, వెన్నవాడలో గౌతమ్‌రెడ్డి పాదయాత్ర పూర్తయింది. మర్రిపాడు మండలంలో పాదయాత్ర కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయి. పింఛన్లు అందని వృద్ధుల అవస్థలు చూసి చలించిపోయారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ ఓ వైపు అధికార పార్టీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటుండటం చూసి ఇదేనా అభివృద్ధి అంటూ ప్రశ్నించి ప్రజల నుంచే సమాధానాలు రాబడుతున్నారు. దీంతో గ్రామస్థాయిలో పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు.300 కిలోమీటర్లకు పాదయాత్ర చేరువవుతోంది. రాత్రి పూట గ్రామాల సమీపంలోనే టెంట్లు వేసుకుని నిద్రించడం, ఉదయాన్నే స్థానికులతో కాసేపు ముచ్చట్లు సాగిస్తూ గౌతమ్‌రెడ్డి ఆకట్టుకుంటున్నారు. పాదయాత్రలో అనుభవాలు ఆయన ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు. ఆ అనుభవాలు ఆయన మాటల్లోనే.. 80 శాతం ప్రజలు పల్లెల్లోనే జీవిస్తున్నారు. వారు బాగుంటేనే దేశం బాగుంటుంది. 250 కిలోమీటర్ల పాద యాత్రలో ముఖ్యంగా నాలుగు సమస్యలు గుర్తించా. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, మరో ముఖ్యమైన సమస్య మరుగుదొడ్లు. ఆ నాలుగు సమస్యలు పరిష్కారం అయితేనే ఒక గ్రామం అభివృద్ధి సాధించినట్లు. అయితే నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా ఈ నాలుగు సమస్యలే ప్రముఖంగా కన్పిస్తున్నాయి. సొంత నిధులు వెచ్చించి నియోజకవర్గంలో అక్కడక్కడా శుద్ధిజలప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఏఎస్‌పేట మండలం కొత్తపల్లి, మర్రిపాడు మండలం ఇస్కపల్లిలో ఇప్పటికే శుద్ధిజలప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఇంకా మరికొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంలేదు. ప్రజాసేవ చేసేందుకు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పాదయాత్రతో చాలా పాఠాలే నేర్చుకున్నా. సహనం అలవడింది. ఏ పల్లె కెళ్లినా ప్రజలు తమ బిడ్డలా ఆదరిస్తున్నారు. వారి ఆదరణ చూస్తే ఒళ్లు పులకించిపోతోంది. కాళ్లకు బొబ్బ లెక్కినా ప్రజాదరణ ముందు అదేమీ సమస్య అనిపించడంలేదు. పాదయాత్ర ప్రారంభించినప్పుడు రకరకాల మాటలన్నవారున్నారు. ఇప్పుడు వారే అభినందిస్తున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా షెడ్యూల్ ప్రకారం పాద యాత్ర పూర్తి చేస్తా. పాదయాత్రకు జగనన్నే స్ఫూర్తి. ప్రజల ఆదరణ, ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. వారి ఆశీర్వాదంతోనే ముందుకు కదులుతున్నా. ఒక విధంగా వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత నాకు గురువు. ఆయన అడుగు జాడల్లోనే నడుచుకుంటా. పార్టీ ఆశయాలు కొనసాగిస్తా అంటూ ఆయన పాదయాత్ర సాగించారు. -
గౌతంరెడ్డితో సహా పలువురు నాయకుల అరెస్ట్
-
వైయస్ఆర్సిపి నేత గౌతమ్ రెడ్డితో సాక్షి వేదిక
-
విజయవాడలో గౌతం రెడ్డి,పలువురు నేతలు దీక్ష