కార్మిక సంక్షేమానికి నిర్వచనంగా జగన్‌ పాలన | Gowtham Reddy Article On May Day | Sakshi
Sakshi News home page

కార్మిక సంక్షేమానికి నిర్వచనంగా జగన్‌ పాలన

Published Fri, May 1 2020 12:46 AM | Last Updated on Fri, May 1 2020 12:46 AM

Gowtham Reddy Article On May Day - Sakshi

మే ఒకటో తేదీ రాగానే కార్మికుడి హృదయం విజయగర్వంతో ఉప్పొంగు తుంది. పెట్టుబడిదారీకి పుట్టినిల్లునైన అమెరికాలో దాదాపు 130 ఏళ్ల క్రితం శ్రమ దోపిడీపై కార్మికులు ఉద్యమిం చారు. 1886 మే 1న చికాగో కార్మికులు రోజుకు 8 గంటల పనిదినం కోసం ఉద్య మించిన రోజే ప్రపంచ కార్మిక దినో త్సవం మేడేగా ప్రసిద్ధికెక్కింది. ఆ నెల లోనే 3వ తేదీన సమ్మెచేస్తున్న కార్మికులపై అమెరికన్‌ పోలీసులు కాల్పులు జరిపి కార్మికులను పొట్టన బెట్టుకున్న ఘటనకు నిరస నగా మే 4న హేమార్కెట్‌ ప్రాంతంలో కార్మికులు చేస్తున్న శాంతి యుత ఆందోళనపై పోలీసులు తుపాకీ గుళ్లవర్షం కురిపించిన ప్పుడు హే మార్కెట్‌ ప్రాంతం మొత్తం కార్మికుల రక్తంతో తడిసి పోయింది. నాటి స్ఫూర్తితో నేటికీ కార్మికవర్గాలు మేడే పండుగ ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

కార్మికుల హక్కును కాలరాసే కుట్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడూ, అలాగే 2014లో విభజనానంతరం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా  తెలుగుదేశం ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నిలువునా వంచి స్తూనే వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికవర్గానికి వంద లాదిగా హామీలిచ్చి ఓట్లేయించుకుని గెలిచిన తరువాత ఆ ఊసే ఎత్తలేదు సరికదా, అదేమని గొంతెత్తి అడిగితే వారిపై ఉక్కు పాదం మోపారు. సమ్మిట్‌ల పేరుతో ప్రజాధనాన్ని దుర్విని యోగం చేసి ఒక్క ఉద్యోగం కూడా లేకుండా చేశారు. 

రాజధాని పేరిటా మోసం..
ఏడాదికి మూడు పంటలు పండే ప్రాంతంలో రైతుల నుండి బల వంతంగా భూములు లాక్కుని రైతు కూలీలకు ఉపాధిని బల వంతంగా తీసేశారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు కూడా ఆల్విన్, హెచ్‌ఎంటీ వంటి ప్రభుత్వ రంగ సంస్థ లను, నిజాం షుగర్స్‌ను బలవంతంగా మూసేయించి వేలాది మంది కార్మిక కుటుంబాలను రోడ్డున పడేశారు. రాజధాని పేరుతో వ్యవసాయ కార్మికుల నోటికాడి కూడును బలవంతంగా లాగేసి కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్‌ పరిచారు. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని ఇప్పటి ప్రభుత్వం చెబితే అక్కడ రాజధాని ప్రాంత పరిధిలో ఎలా ఇస్తారంటూ తన అనుయాయు లతో కోర్టుకెక్కారు. అంటే తనకు అవసరమైన చాకలి, మంగలి, వడ్రంగి, సఫాయి వంటి కార్మికులు అక్కడ నివాసం ఉండేందుకు మాత్రం అర్హులుకారని, కేవలం వారి అవసరాలనుతీర్చే యంత్రా లుగానే ఆయన చూసినట్లు మనకు స్పష్టంగా అర్థమౌతోంది.  

'నేనున్నానంటూ...     
ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ నాటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు సుదీర్ఘ పాదయాత్ర చేసి వారి కష్టాలను కళ్లారా చూశారు. తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 10 వేల వంతున ఇస్తామని, బీమా సౌకర్యం కల్పిస్తామని, కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా మని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎంఎస్‌ఎంఈలను ప్రోత్స హించి మరింత మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నియో జకవర్గానికి ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుతోపాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. అంతే.. ఆయన మాటలను నమ్మిన కార్మిక వర్గం 2019 ఎన్నికల్లో ఆయనకు వెన్ను దన్నుగా నిలిచింది. ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి రాగానే వైఎస్‌ జగన్‌ ఆటో కార్మికులకు రూ. 10 వేల హామీని అమలు చేసి చూపించారు. ప్రమాద భీమాను రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మిక పక్షపాతి నని రుజువు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఎంచుకున్న రంగాల్లో శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి అవకాశాలను మెరుగు పర్చేందుకు కార్యాచరణ రూపొందించారు. 

పైగా ఏపీలో ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చారు. అధికారం లోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నాలుగు లక్షల మందికి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాలను ఇచ్చారు. పైగా ప్రతి ఏడాది మార్చి నెలలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నియా మకాలకు కేలండర్‌ విడుదల చేస్తున్నారు. కార్మికులు, కర్షకులు మద్యం మహమ్మారి బారినపడి వారి కుటుంబాలు ఛిద్రం కాకుండా దశలవారీగా మద్య నియంత్రణ చేస్తామని చెప్పి చేతల్లో చూపించారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని బెల్టు షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారు. బార్లను 40 శాతం కుదించారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించేలా చేసి చూపారు. ఆదర్శ వంతమైన పాలనకు ఊపిరిలూదారు. కార్మికులకు అన్నగా, తమ్ము డిగా కొమ్ముగాస్తూ అండగా నిలిచారు. 

కరోనా ప్రభావం ...
రెక్కాడితేగాని డొక్కాడని కార్మిక, కర్షక, తాడిత, పీడిత వర్గాలపై కరోనా మహమ్మారి కోరలు చాచింది. కరోనా ప్రభావంతో షాపిం గ్‌మాల్స్, సినిమా హాల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వీటిల్లో పనిచేసే చిరుద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి ప్రదేశాలు కూడా మూతపడటంతో ఆయా ప్రాంతాల్లో పనిచేసే శానిటేషన్‌ వర్కర్స్‌ పనులు కోల్పో యారు. కూరగాయల మార్కెట్లు, దుకాణాలపైనా కరోనా ప్రభావం పడింది. ఆటో కార్మికులు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడంలేదు. సరుకులు అమ్ముడు పోక వ్యాపారాలు తగ్గడంతో పరిశ్రమల యజమానులు ఉత్పత్తి తగ్గించి, ఆ మేరకు కార్మికులకు సెలవులు ఇస్తున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కోట్లాది మంది కార్మికులు, రైతులు, కూలీల జీవన స్థితిగతులు అతలాకుతలం అయ్యాయి. పనిచేస్తేనే పూట గడిచే వారి జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22 నుండి లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.

అప్పటి నుండి వారికి చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఫ్యాక్టరీలు, చేతివృత్తుల వారికి కూడా పనుల్లేక పస్తులుండా ల్సిన పరిస్థితుల్లో దాతల దాతృత్వం వెల్లివిరిసింది. ప్రభుత్వాల సాయం అందింది. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ ఒక్క ఏప్రిల్‌ నెలలోనే మూడు దఫాలుగా రేషన్‌ సరుకులు ఇవ్వడంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేశారు. అంతే కాకుండా తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ రూ. వెయ్యి వంతున ఆర్థిక సాయం అందించారు. ఏ దేశంలోనైనా సమాజ మార్పునకు చోదక శక్తి కార్మిక వర్గమే. మనలాంటి వెనుకబడిన దేశంలో కార్మికులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. మెరుగైన సమాజం కోసం శ్రామికవర్గం దీక్షబూనాలి. ఆ మహ త్తర సంకల్పంతోనే ముందుకు సాగాలి. అందుకు పాలకులు సహృదయంతో సహకరించాలి. ఏపీలో కార్మిక వర్గాల బాధలను తన బాధలుగా చూసే సీఎం ఉండటం మనందరి అదృష్టం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో కార్మిక వర్గానికి ఈ మేడే మంచి రోజులను ప్రతిబించాలని, మెరుగైన కార్మిక చట్టాలను, విధానాలను అమలు చేయాలని, చేస్తారని ఆశిస్తూ..
(నేడు మేడే సందర్భంగా)

డా. పి గౌతమ్‌ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్‌ : 98481 05455

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement