సమావేశంలో మాట్లాడుతున్న గౌతంరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీఠ వేశారని వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్రాధ్యక్షుడు గౌతంరెడ్డి అన్నారు. అక్టోబర్ 4న వాహన మిత్ర పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా కార్మికులకు ఏడాదికి 10వేల రూపాయలు అందిస్తామన్నారు. ఆటోడ్రైవర్లు, షాపులున్న నాయి బ్రాహ్మణులకు చేయుతనివ్వనున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పారిశుధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంఘీభావంగా వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభినందన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జగన్ చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను ఓర్వలేకే చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment