Trade Union
-
డీఏపై కేబినెట్లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుతో పాటు ఇతర అంశాలపై ఈ నెల 12న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై కక్ష గట్టి రద్దు చేస్తే, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేశారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందేనని, మంత్రివర్గ ఉప సంఘం శాఖల వారీగా సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఆదివారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనసాగింపుపై త్వరలో నిర్ణయం గత పదేళ్లుగా తమ సమస్యలను చెప్పుకోవడానికి ఉద్యోగులకు అవకాశం లభించలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే వ్యవహరించారని విమర్శించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గవర్నర్‌ను సంప్రదించి ప్రొఫెసర్ కోదండరాంను శాసనమండలికి పంపుతామని, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికి గౌరవమన్నారు. బడులు, కళాశాలలకు ఉచిత విద్యుత్! ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలన్నారు. తెలంగాణ బాపు జయశంకరే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ, తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారని, శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారని తెలిపారు. తెలంగాణ బాపు తానే అని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని విమర్శించారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకరే అని, తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని అన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలన ను గాడిలో పెడుతున్నామని, తాము పదేళ్లు అధి కారంలో ఉండటం ఖాయమని సీఎం అన్నారు. -
‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’
సాక్షి, పెద్దపల్లి: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మట్లాడారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలపారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ నియమిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. -
భారత్-కెనడా వాణిజ్య చర్చలకు బ్రేక్
ఒట్టావా: భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటికే జీ20 సదస్సుకు కొద్ది రోజుల ముందు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్‌లో ఆ చర్చలను తిరిగి ప్రారంభిచాల్సి ఉండగా తాజాగా మరోసారి ఇవి వాయిదా పడ్డాయి. భారత్‌తో జరగాల్సిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై చర్చలను వాయిదా వేస్తున్నట్లు కెనడా వెల్లడించింది. భారత్‌తో అక్టోబరులో జరగాల్సిన వాణిజ్య మిషన్‌ను వాయిదా వేయాలని ఆదేశ వాణిజ్యశాఖ మంత్రి మేరీ ఎన్జీ నిర్ణయించారని సదరుశాఖ అధికార ప్రతినిధి శాంతి కోసెంటినో తెలిపారు. అయితే వాయిదా వేయడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చర్చలు జరిపిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం వెలుగుచూసింది. సెప్టెంబర్9, 10 న భారత్ అధ్యక్షతన నిర్వహించిన జీ 20 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాధినేతలతో ధైపాక్షక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఖలిస్థానీ సానుభూతిపరులకు కెనడా అడ్డాగా మారుతుందనే విషయాన్ని నేరుగా ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, అక్కడ నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. -
ఉద్యోగుల సంఘం గవర్నర్‌ను కలవడం పబ్లిసిటీ స్టంట్: వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి/ విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్‌ను కలవడం పబ్లిసిటీ స్టంట్ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(జీఇఎఫ్) అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించినట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా, వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాత గవర్నర్‌ను కలవడమేంటని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వీఆర్ఏలు, ఎండీవోలకు పదోన్నతులు వచ్చాయి. సచివాలయ ఉద్యోగులకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయలేదా?. గతంలో ఉద్యోగుల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. అంతకు ముందు.. సూర్యనారాయణపై ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనారాయణ ఉద్యోగ సంఘాలను విమర్శించడం మానుకోవాలి. ఆయన ఉద్యోగుల గురించి మాట్లాడితే బాగుంటుంది. మీరు ఛాంపియన్‌లా.. మమ్మల్ని చవటల్లా చిత్రీకరిస్తే ఊరుకోము. 11 పీఆర్సీలు సాధించిన ఘనత మా సంఘానిది. గవర్నర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడకుండా మాపై విమర్శలు చేస్తున్నారు. నీ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను తాకట్టు పెట్టొద్దు. సీఎం వైఎస్ జగన్ చర్చలకు పిలిస్తే.. నువ్వు ఎందుకు శ్రీకాకుళం పారిపోయావు అని ప్రశ్నించారు. -
సింగరేణిలో ‘గుర్తింపు’ ఎప్పుడో?
సాక్షి,పెద్దపల్లి: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ఊసులేకుండా పోయింది. కోల్‌బెల్ట్ ప్రాంతం, ఎమ్మెల్యే, ఎంపీల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఈ ఎన్నికలను ఆచితూచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా, కేంద్రం మాత్రం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచే ఈ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గుర్తింపు ఎన్నికల గడువు దాటి నాలుగేళ్లు అవుతోందని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న టీబీజీకేఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. 11 ఏరియాలు 42 వేల మంది కార్మికులు సంస్థ పరిధిలోని 11 ఏరియాల్లో సుమారు 42 వేల మంది కారి్మకులు పనిచేస్తున్నారు. ఆరు కార్మిక సంఘాలు పోటీలో ఉంటున్నాయి. 1998లో మొదటిసారి రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత నాలుగేళ్లకోసారి నిర్వహించారు. ఈసారి కోవిడ్ కారణంగా గుర్తింపు ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. కోవిడ్ సెకండ్‌వేవ్ తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు కోరినప్పటికీ యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో బొగ్గుగని కారి్మకుల సమస్యల పరిష్కారం కోసం కోలిండియావ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దీనిపై స్పందించిన సింగరేణి యాజమాన్యం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహాయించి మిగతా డిమాండ్లపై చర్చలకు ఆహ్వానించింది. చర్చల సమయంలో సింగరేణిలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మార్చి చివరినెల కావడంతో యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ వెనక్కివెళ్లింది. కార్మిక సంఘాల పట్టు సింగరేణి గుర్తింపు సంఘం గడువు ముగిసిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్, అలాగే ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ ఎన్నికలకు ముందే కారి్మకులకు దగ్గర కావాలని చూస్తున్నాయి. బస్సుయాత్ర, జీపుయాత్ర, శిక్షణతరగతులు, జనరల్‌బాడీ సమావేశాల పేరుతో ఇప్పటికే గనుల్లో ఈ సంఘాల నేతలు పర్యటించారు. ఇంకా తేల్చని యాజమాన్యం సింగరేణి గుర్తింపు ఎన్నికలపై యాజమాన్యం ఇంకా తేల్చలేదు. మార్చి¯ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఎన్నికలుంటాయని కార్మిక సంఘాలు భావించినా ఎలాంటి నిర్ణయం వెలుబడలేదు. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల పక్రియ ప్రారంభిస్తే ఒక్కో షిఫ్టుకు రెండు గంటల మేర అంతరాయం ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. దీంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని ఆలోచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవునికే ఎరుక సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవుడికే ఎరుక. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం. గుర్తింపు యూనియన్లకు సంబంధించిన పత్రాలన్నీ ఎప్పుడో సమర్పించాం. – వెంకట్రావ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు -
కార్మికలోకం రుణం తీర్చుకున్నారు!
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కళ్లారా చూడాలని రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్మికలోకం పరితపించింది. ఆయన పాదయాత్రలో అడుగడుగునా కార్మికుల అడుగు జాడలు ప్రస్ఫుటంగా కనిపిం చాయి. ప్రతిచోటా కార్మికులు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలతో ఆయనను కలిశారు. వారి వారి సమస్యలను ఓపికతో విన్న జగన్మోహన్ రెడ్డి అక్కడే వారికి హామీలు ఇచ్చారు. ఆయన అధికారంలోకి రావడానికి... కార్మికవర్గం పడిన శ్రమ, తాపత్రయం కూడా కారణాలే. వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భవించి సరిగ్గా నేటికి 11 ఏళ్లు. ఈ సందర్భంగా కార్మికులకు వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును తలుచుకోవడం అవసరం. తాడిత, పీడిత ప్రజలు, కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగానే 2019 మే 30న అందరి ఆశీస్సులతో జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 80 రకాల కార్మిక యూనియన్లకు చెందిన ప్రతి ఒక్కరూ జగన్ విజయంలో ప్రధాన భూమిక పోషించినవారే. అందుకే అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుండే పాదయాత్రలో తనకు వచ్చిన వినతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు జగన్. ముఖ్య మంత్రిగా తొలి సంతకం అవ్వ–తాతలకు పింఛన్ పెంపు ఫైల్‌పై చేశారు. తర్వాత ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుండి ఏకంగా రూ. 10 వేలకు వేతనాన్ని పెంచారు. ఒకేసారి వేతనాన్ని 300 శాతం పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. అదేక్రమంలో డ్వాక్రా సంఘాల్లో పనిచేసే యానిమేటర్లు, బుక్ కీపర్లకు రూ. 10 వేల వంతున గౌరవ వేతనం అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అర్హత, సీనియార్టీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అందుకే పారిశుద్ధ్య కార్మికులకు రూ. 18 వేల వంతున వేతనం ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఇక అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 11,500, ఆయాలకు రూ. 7 వేల వంతున వేతనాల పెంపు చేశారు. గిరిజన సంక్షేమ శాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రూ. 400 నుండి రూ. 4 వేలకు వేతనాన్ని పెంచారు. వారితోపాటే హోం గార్డులకు కూడా వేతనాలు పెంచి బడుగు జీవుల జీవితాల్లో దీపావళి కాంతులు నింపారు. పథకాలన్నీ కార్మిక నేస్తాలే! వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న చేదోడు, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వెఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు, వైఎస్సార్ భీమా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలు నిరుపేదల ఇళ్లల్లో సంక్షేమ సంక్రాంతిని నింపాయి. నగదు బదిలీ ద్వారా 24 రకాల పథకాల పేరిట లబ్ధిదారులకు రూ. 84,402.68 కోట్లు ఇచ్చారు. అలాగే నగదు బదిలీతో సంబంధం లేకుండా మరో 5 రకాల పథకాల ద్వారా 1,52,69,364 మంది లబ్ధిదారులకు రూ. 15,714.58 కోట్ల మేర లాభం కలిగించారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో రూ. 1,00,117.26 కోట్లమేర ప్రజలకు లబ్ధి చేకూరింది. ఇందులో అసంఘటిత, సంఘటిత రంగాల్లో ఉన్న కార్మిక వర్గమే ఎక్కువ ప్రయోజనం పొందిందని వేరే చెప్పనవసరం లేదు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రతి 50 మంది ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పథకాలను వారి ఇళ్ల ముందుకే తీసుకెళ్లారు సీఎం జగన్. అప్పటివరకూ వివిధ రంగాల్లో చిన్నా చితకా వేతనాలకు కార్మికులుగా పనిచేస్తున్న యువతీ యువకులు ప్రభుత్వో ద్యోగులుగా, ప్రతినిధులుగా మారారు. విద్య, వైద్యాలను దరిచేర్చి... పేదలకు విద్య, వైద్యం అందకపోవడం వల్ల వారి అభివృద్ధి సాధ్యం కావటంలేదని గ్రహించి... ఆయా రంగాల్లో ‘నాడు–నేడు’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ తరహా సేవలను నిరుపేదల ముంగిటకు తీసుకొచ్చారు. ఇది ఆశించినదానికంటే మంచి ఫలితాల నిచ్చింది. అదేక్రమంలో ఆరోగ్య శ్రీ సేవల పరిధిని పెంచి నిరుపేదలైన కార్మికుల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. అచ్చంగా కార్మికలోకాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మిక బీమా, కార్మికులకు గుర్తింపు కార్డుల అందజేత వంటి అనేకానేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇంటిలో మహిళలు ఆర్థికంగా బలపడితేనే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి వస్తుందని బలంగా నమ్మిన సీఎం జగన్ మహిళల పేరుతోనే సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందువల్ల కార్మిక మహిళలే ఎక్కువగా ఫలితం పొందుతున్నారు. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి లక్షలాది మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలకు భరోసా కల్పించారు. (క్లిక్: ఈ వర్గపు ఆగడాలకు అంతం లేదా?) అమరావతిలోనూ... మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా మార్చిన చంద్రబాబు... ఆ మహానగరంలో నిర్మించ తలపెట్టిన నవ నగరాల్లో ఏ నగరంలో కూడా కార్మికులు ఉండకూదనీ, అలా ఉంటే సామాజిక సమతౌల్యం లోపి స్తుందనే పక్షపాత ధోరణిని ప్రదర్శించారు. కార్మిక వర్గాలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాయి. పాదయాత్రలో ఉన్న జగన్‌కు నివేదించాయి. దానికి తీవ్రంగా స్పందించిన జగన్ అధికారంలోకి రాగానే ఆ అసమానతలను రూపు మాపి, అక్కడే కార్మిక వర్గానికి కూడా స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఆయన నిలబెట్టు కున్నారు. (క్లిక్: బాబు బ్రాండ్ రాజకీయాలు) ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి కార్మికులు చేసిన శ్రమ ఊరకే పోలేదు. ఆయన అధికారంలోకి రాగానే కార్మికుల రుణం తీర్చుకున్నారు. - డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్, రాష్ట్ర వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు (నేడు వైకాపా ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం) -
విజయవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్‌లోకి టీడీపీకి చెందిన 150 మంది కార్మికవర్గ సభ్యులు చేరారు. వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ ఫలాలు, ఆయన పనితీరును చూసి ఆకర్షితులై వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. (చదవండి: అందులో పట్టుబడ్డవారంతా టీడీపీ కార్యకర్తలే) వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందనే ఉద్ధేశ్యంతో నగరంలోని టీడీపీకి చెందిన స్వీట్ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పార్టీలోకి జాయిన్ అయ్యారని పేర్కొన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని వైఎస్సార్ స్వీట్ స్టాల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సైతం ప్రారంభించదలుచుకున్నామని వెల్లడించారు. టీడీపీలో ఆదరణ లేకపోగా, కులాల కంపుతో తమ అస్తిత్వాన్ని చంపుకుని ఉండలేమని అసోసియేషన్ సభ్యులు వైఎస్సార్సీపీలోకి చేరారని తెలిపారు. ప్రజల మనిషిగా, పేదలకు సాయం చేసే వ్యక్తిగా ఉన్న సీఎం జగన్ వెంట తాము నడుస్తామని వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారన్నారు. సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు కరోనా విపత్తు సమయంలో కూడా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. (చదవండి: ‘చంద్రబాబు ఏమైనా దేవదూతనా..’) -
వికేంద్రీకరణకు మద్దతుగా ట్రేడ్ యూనియన్ ఏకగ్రీవ తీర్మానం
-
కార్మికుల హక్కులను కేంద్రం హరిస్తోంది..
సాక్షి, విజయవాడ: ఈ నెల 8న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె, రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ మద్దతు ప్రకటించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కనీస వేతనాలపై కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. 8న విజయవాడ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరుకు వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల నుండి కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. సమ్మెలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ సభ్యులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీపీఎం నేత ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే..ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెకు వామపక్షాలు మద్దతునిస్తున్నాయని పేర్కొన్నారు. -
ఏపీ విధానాలను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న విధానాలను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిన మహానుభావుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. కార్మిక విధానాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు.కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా కేంద్రం ఆలోచనలున్నాయని విమర్శించారు. కనీస వేతనాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్మిక వ్యతిరేక విధానాలపై జనవరి 8న పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకి పిలుపునిచ్చారు. సమ్మెలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొనాలని విజ్ణప్తి చేశారు. కార్మికులకి 21 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఉండాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను పోస్కోకి కట్టబెట్టడం దారుణమని గౌతంరెడ్డి మండిపడ్డారు. -
అక్టోబర్ 4న వాహన మిత్ర పథకం ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీఠ వేశారని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్రాధ్యక్షుడు గౌతంరెడ్డి అన్నారు. అక్టోబర్ 4న వాహన మిత్ర పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా కార్మికులకు ఏడాదికి 10వేల రూపాయలు అందిస్తామన్నారు. ఆటోడ్రైవర్లు, షాపులున్న నాయి బ్రాహ్మణులకు చేయుతనివ్వనున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పారిశుధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంఘీభావంగా వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభినందన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జగన్ చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను ఓర్వలేకే చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. -
కార్మిక హక్కుల సంరక్షణా స్ఫూర్తి మేడే!
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చరిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే అలాంటి ఒక చరి త్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది కార్మికులు రక్తతర్పణం చేసి అమెరికాకే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఇంకా ఎనిమిది గంటలు వినోదం (రిక్రియేషన్) అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. మనదేశంలో మొదటిసారిగా 1923లో ‘మే డే’ను పాటించారు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటంతో అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాలకు కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ముఖ్యంగా, ఐ.టి.రంగంలో ఎంతోమంది యువతులు, యువకులు పని చేస్తున్నారు. ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. కార్మిక చట్టాలు అమలుకాని ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10, 12 గంటలు పని చేయిస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. ఐ.టి. రంగంలో కూడా కార్మిక చట్టాల అమలుకోసం పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్సోర్సింగ్లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు. ఉదాహరణకు ఇంటర్మీడియట్ వ్యవస్థలో రెగ్యులర్ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే అధికమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. నిరుద్యోగాన్ని, అశక్తతతను ఆసరా చేసుకుని వాళ్ళచే 10, 12 గంటలు పనిచేయిస్తున్నారు. ఇక విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతుంది కాబట్టి శ్రమదోపిడీ కూడా పెరుగుతుంది. వెనుకటికి స్కూళ్ళు 10 నుంచి 14 గంటల వరకు పనిచేసేవి. పిల్లవాణ్ణి ఆరు గంటల కంటే ఎక్కువ చది వించకూడదని విద్యావేత్తలు, పరిశోధకులు చెబుతున్నా, సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ పేర పాఠశాలలు సర్వసాధారణమైపోయాయి. ఆ టీచర్స్ నోరు మెదపకుండా 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచీకరణ వలన వందేళ్ల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదు. ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ట చేస్తున్నాయి. ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మేడే నాడు కొత్త స్ఫూర్తిని రగి లిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటిం చేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని మాత్రమే కాదు.. అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా వుంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే. ఆ రకంగా ఈ మేడే మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం! పి. గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు -
కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
-
‘సీఎం తన వర్గంతో దొంగ దీక్షలు’
సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతం రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం తన వర్గంతో దొంగ దీక్షలు చేయిస్తున్నారని గౌతం రెడ్డి ధ్వజమెత్తారు. అంతేకాక కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని చెప్పి సీఎం మోసం చేశారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేని పరిస్థితి నెలకుందని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నారు. వైఎస్స్‌ర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనుల కోసం 30 సంవత్సరాలుగా కార్మికుల పోరాటం చేస్తున్న విషయాన్ని సీఎం పట్టించుకోలేదని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత గౌతం రెడ్డి గుర్తు చేశారు. -
ఐటీ ఉద్యోగులకు తొలి ట్రేడ్ యూనియన్
బెంగళూరు : ఐటీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఇండస్ట్రీలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తొలిసారి ఐటీ ఉద్యోగులు ట్రేడ్ యూనియన్‌గా ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద టెక్ హబ్ అయిన బెంగళూరు, కర్నాటక లేబర్ కమిషన్, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, కర్నాటక ట్రేడ్ యూనియన్స్ రెగ్యులేషన్స్ 1958 కింద కర్నాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్(కేఐటీయూ) ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపాయి. ఇది తమకు ఎంతో ముఖ్యమైన క్షణమని, ఐటీ ఉద్యోగి యూనియన్‌కు ఇది తొలుత అంకితమిస్తున్నట్టు కేఐటీయూ జనరల్ సెక్రటరీ వినీత్ వాకిల్ తెలిపారు. చాలా మంది ఐటీ ఉద్యోగులు సమస్యలను ఎదుర్కొంటుండటం వల్ల యూనియల్ ఏర్పాటుచేయడం కుదిరిందని, ఐటీ యూనియన్ ఏర్పాటుతో ఈ సమస్యలన్నింటిన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కేవలం బెంగళూరులోనే ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసు రంగాల ఉద్యోగులు 1.5 మిలియన్ మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా కనీసం 4 మిలియన్ మంది ఉన్నట్టు తెలిసింది. గతేడాది నుంచి ఐటీ రంగంలో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున్న లేఆఫ్స్, ఎక్కువ పని గంటలు వంటి వాటిని కంపెనీలు చేపడుతున్నాయి. ఆటోమేషన్ ప్రభావంతో కంపెనీలు ఉద్యోగులను భారీ ఎత్తున్న తీసేస్తున్నాయి. అంతేకాక ఇంక్రిమెంట్లు కూడా తగ్గించేశాయి. ఈ రంగ ఎగుమతుల రెవెన్యూలు కూడా ఎలాంటి మార్పులు లేకుండా 7-8 శాతం మధ్యలోనే ఉంటాయని ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ అంచనావేస్తోంది. దీనికి గల ప్రధాన కారణం ఐటీ ఎగుమతులకు అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికాలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటమే. -
చెన్నైలో డీఎంకే నేతల నిరాహార దీక్ష
-
సమ్మె సక్సెస్
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించిన కార్మిక, ఉద్యోగ సంఘాలు మూతపడిన వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్తంభించిన రవాణా వ్యవస్థ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి న్యూశాయంపేట : కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సమ్మె విజయవంతమైంది. దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగంలోని సుమారు 20 ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సమ్మెకు దిగాయి. పన్నెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఈ సమ్మెలో బీజేపీ అనుబంధ బీఎంఎస్ మినహా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల అనుబంధ కార్మి సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మె ప్రభావంతో బ్యాంకులు, వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆటో కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. బస్సులు నడవకపోవడంతో ప్రైవేటు వాహనాల వారు ప్రయాణికుల నుంచి అధిక మెత్తంలో డబ్బులు వసూలు చేశారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. సినిమా హాళ్లు మూతపడ్డాయి. కార్మికుల ర్యాలీలు, ధర్నాలో పలు పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రధానంగా.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి ఇప్పుడున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, అసంఘటిత, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రతతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా అమ్మకాలను నిలిపివేయాలని, రక్షణ, బ్యాంకు, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించొద్దని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. నిలిచిన బొగ్గు ఉత్పత్తి సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1, 2, 5, 6, ఓసీపీ, కేఎల్పీ గనుల్లో ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. కేవలం అత్యవసర సర్వీసులలో పనిచేసే కార్మికులు మాత్రమే వి«ధులకు హాజరయ్యారు. ఏరియాలో ఒకరోజు ఉత్పత్తి 12వేల టన్నులు పూర్తిగా నిలిచిపోయి రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. -
టీడీపీ అనుబంధ యూనియన్‌లో చేరాల్సిందే
► తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నేతల హెచ్చరిక ► సభ్యత్వం తీసుకోకుంటే కార్డులుండవ్.. ఉద్యోగాలుండవ్ ► అంగన్వాడీల సమీక్ష సమావేశం ► అనధికారికంగా వచ్చి ప్రసంగాలు మంగళగిరి : అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది.. పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాల్సిందే.. సభ్యత్వం తీసుకోకుంటే వారిని లక్ష్యంగా చేసుకుని ఇబ్బం దులు పెడతాం.. ఉద్యోగాలు తీసేయిస్తాం.. సభ్యత్వం తీసుకుంటే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం.. లేదంటే రేషన్ కార్డులు ఉండవు.. సంక్షేమ పథకాలు ఉండవు’ అంటూ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకులు అంగన్వాడీలను హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని ఐసీడీఎస్ సమావేశం హాలులో శుక్రవారం అధికారులు నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభం కాగా మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులు భోజన విరామం ప్రకటించారు. ఇంతలో అంగన్వాడీ తెలుగునాడు ట్రే డ్ యూనియన్ నాయకులమని జిల్లా గౌరవాధ్యక్షుడు మద్దిరాల గంగాధర్, జిల్లా అధ్యక్షురాలు కొల్లి లక్ష్మీకుమారి, మంగళగిరి తెలుగు మహిళా నాయకురాలు గుత్తా నందినిచౌదరి నిబంధనలు మీరి సమావేశ మందిరంలోకి వచ్చారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం! ఇక మైక్ పుచ్చుకున్న నాయకులు టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలకు జీతాలు పెంచడంతోపాటు మిమ్మల్ని ఉద్దరిస్తుందని.. అందరూ తెలుగునాడు యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాలని ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తసాగారు. అధికార పార్టీ యూనియన్‌లో సభ్యత్వం తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని, తీసుకోనివారిని ఏవిధంగా తొలగించాలో తమకు తెలుసంటూ హెచ్చరించారు. అయినా అంగన్వాడీలు సభ్యత్వం తీసుకోం.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బయటకు వెళ్లిపోయారు. భోజనం కూడా చేయనివ్వకుండా వేధిస్తున్నారంటూ బయటకు వచ్చిన అంగన్వాడీ మహిళలు సాయంత్రం నాలుగు గంటలకు ప్రాంగణంలోని చెట్ల కింద భోజనం చేశారు. సీడీపీవో వివరణ.. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ సమావేశాన్ని ప్రభుత్వ సమావేశం హాలులో ఎలా అనుమతించారని సీడీపీవో భారతిని ‘సాక్షి’ వివరణ కోరగా తాము నెలవారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మధ్యాహ్నం భోజన విరామం ప్రకటించి తాను భోజనానికి వచ్చానని సమావేశం గురించి తనకు తెలియదని సమాధానమిచ్చారు. -
'ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర'
యాదగిరిగుట్ట: ప్రధాని మోదీ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రకు పాల్పడుతున్నారని వ్యవయసాయ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు నాగేంద్రనాథ్ ఓజా విమర్శించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, దినసరి కూలీగా రూ.300 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర భూములను సేకరించి కార్పొరేట్ శక్తులకు అమ్ముకునే కుట్రకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. -
కరీంనగర్ లో ట్రేడ్ యూనియన్ ధర్నా
కరీంనగర్: ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ట్రేడ్ యూనియన్ నాయకులు ధర్నాకు దిగారు. కార్మిక చట్టాల సవరణ, ప్రభుత్వరంగ సంస్థ వాటాల అమ్మకం, విద్యుత్ చట్ట సవరణ బిల్లు, రక్షణ, రైల్వే రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆపాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు, స్కిమ్ వర్కర్స్‌కి కనీస వేతనం రూ.15 వేలు ఇచ్చి, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్‌టీయూకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
జగన్ దృష్టికి కార్మికుల సమస్యలు
విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి. గౌతంరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌ను కలిసిన ట్రేడ్ యూనియన్‌కు సంబంధించి పలు విషయాలపై చర్చించారు. ఆర్టీసీ ఇటీవల పెంచిన బస్ చార్జీల పెంపు వల్ల ఇబ్బందులు, వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. గౌతంరెడ్డి సాక్షితో మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్‌కు సంబంధించి పలు అంశాలపై జగన్‌తో చర్చించానని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు. -
కార్మికులకు మంచి రోజులు
ఉద్యోగులు సుఖసంతోషాలతో జీవించాలి కార్మికులను చీడపురుగుల్లా చూసిన చంద్రబాబు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్ ప్రసాద్ యూనియన్‌లో చేరిన వందల మంది స్వర్ణకార, ఆటోవర్కర్లు విజయవాడ, న్యూస్‌లైన్ : రానున్న రోజుల్లో కార్మికులు, ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయని, వారు సుఖ సంతోషాలతో జీవిస్తారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ అన్నారు. మరోవారం రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రి వద్ద మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి జనక్‌ప్రసాద్ తొలుత యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు శ్రమ దోపిడీ నుంచి విముక్తి కలిగిన రోజే మేడే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్మికులను చంద్రబాబు చీడపురుగుల్లా చూశారని విమర్శించారు. చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటు పరం చేయడంతో 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రోశయ్య, కిరణ్ సర్కార్లు రూ.32 వేల కోట్ల మేరకు విద్యుత్ బిల్లుల విధించడంతో అనేక కంపెనీలు మూతపడి వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో జగన్మోహన రెడ్డి ఏ ఒక్క కార్మికుడికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపడతారన్నారు. అర్హులైన కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేసే అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారని జనక్‌ప్రసాద్ తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు సుఖసంతోషాలతో జీవించాలన్నదే జగన్మోహన్రెడ్డి ఆశయమని పేర్కొన్నారు. అనంతరం ఆయన సిద్ధార్థ వైద్య కళాశాల ఎదుట యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోరంజని, స్టేట్వైస్ ప్రెసిడెంట్ ఎ.ఎం.ఆర్.పాల్, నగరశాఖ అధ్యక్షుడు విశ్వనాథ రవి, జిల్లా కార్యదర్శి జ్యోతిరెడ్డి, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వాస్పత్రి శాఖ అధ్యక్ష కార్యదర్శులు డి.సత్యనారాయణ, నాళం మురళీకృష్ణ, బాపట్ల శ్రీను, విశ్వనాథపల్లి జ్యోతిరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.వి.సత్యనారాయణ, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకార, ఆటో కార్మికుల చేరిక మేడే సందర్భంగా ప్రభుత్వాస్పత్రి వద్ద జరిగిన వేడుకల్లో నగరంలోని స్వర్ణకారులు 150 మంది పొన్నాడ గంగాధర్, శివశంకర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌లో చేరారు. ఆటోవర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎండి.రఫీ, ఎం.భర ద్వాజ్ తదితరులు 200 మంది కూడా చేరగా వారిని జనక్‌ప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు.