
సాక్షి, పెద్దపల్లి: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్‌పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు.
అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మట్లాడారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలపారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ నియమిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment