
సాక్షి, అమరావతి/ విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్‌ను కలవడం పబ్లిసిటీ స్టంట్ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(జీఇఎఫ్) అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించినట్టు ఆయన స్పష్టం చేశారు.
కాగా, వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాత గవర్నర్‌ను కలవడమేంటని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే వీఆర్‌ఏలు, ఎండీవోలకు పదోన్నతులు వచ్చాయి. సచివాలయ ఉద్యోగులకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయలేదా?. గతంలో ఉద్యోగుల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.
అంతకు ముందు.. సూర్యనారాయణపై ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనారాయణ ఉద్యోగ సంఘాలను విమర్శించడం మానుకోవాలి. ఆయన ఉద్యోగుల గురించి మాట్లాడితే బాగుంటుంది. మీరు ఛాంపియన్‌లా.. మమ్మల్ని చవటల్లా చిత్రీకరిస్తే ఊరుకోము. 11 పీఆర్సీలు సాధించిన ఘనత మా సంఘానిది. గవర్నర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడకుండా మాపై విమర్శలు చేస్తున్నారు. నీ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను తాకట్టు పెట్టొద్దు. సీఎం వైఎస్ జగన్ చర్చలకు పిలిస్తే.. నువ్వు ఎందుకు శ్రీకాకుళం పారిపోయావు అని ప్రశ్నించారు.